Google: తక్కువ జీతం ఇస్తున్నారంటూ మహిళల పోరాటం.. దెబ్బకు తలొగ్గిన గూగుల్.. ఎంత చెల్లించిందంటే?

2013లో ఈ వివక్ష మొదలైంది. 5 ఏళ్లపాటు పోరాడిన మహిళలు, చివరకు కాలిఫోర్నియాలో సమస్య ముగిసింది. Google మాజీ మహిళా ఉద్యోగులు

Google: తక్కువ జీతం ఇస్తున్నారంటూ మహిళల పోరాటం.. దెబ్బకు తలొగ్గిన గూగుల్.. ఎంత చెల్లించిందంటే?
Follow us
Venkata Chari

|

Updated on: Jun 15, 2022 | 7:26 PM

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్ లింగ వివక్ష కారణంగా వివాదంలో చిక్కుకుంది. గూగుల్ సంస్థ మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతూ తక్కువ వేతనాలతో వారిని నియమించుకుంది. సమాన వేతనం కోసం మహిళలు చాలా కాలంగా కోర్టులో పోరాడుతున్నారు. ప్రస్తుతం అందులో పనిచేసే సదరు మహిళలు విజయం సాధించారు. వ్యాజ్యాన్ని పరిష్కరించేందుకు కంపెనీ అంగీకరించిడంతో, ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. దీంతో గూగుల్ 15,500 మంది మహిళా ఉద్యోగులకు 118 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 920 కోట్లు చెల్లించనుంది.

2013లో మొదలైన వివక్ష.. 5 సంవత్సరాలు పోరాడిన మహిళలు..

2013లో ఈ వివక్ష మొదలైంది. 5 ఏళ్లపాటు పోరాడిన మహిళలు, చివరకు కాలిఫోర్నియాలో సమస్య ముగిసింది. Google మాజీ మహిళా ఉద్యోగులు కెల్లీ ఎల్లిస్, హోలీ పీస్, కెల్లీ విసురి, హెడీ లామర్ కంపెనీపై దావా వేశారు. అదే హోదాలో ఉన్న పురుషుల కంటే కంపెనీ తమకు తక్కువ వేతనం ఇస్తోందని మహిళలు పేర్కొన్నారు. ఈ కేసులో, శాన్ ఫ్రాన్సిస్కో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పరిష్కారానికి అంగీకరించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఒప్పందం ప్రకారం, సెప్టెంబర్ 14, 2013 నుంచి Googleలో 236 వేర్వేరు స్థానాల్లో పనిచేస్తున్న 15,500 మంది కాలిఫోర్నియా మహిళలకు ఒప్పందం మొత్తం ఇవ్వనున్నారు. ఈ ఉద్యోగులు బహుళ విభాగాలు, స్థాయిలలో పనిచేశారు. ఇప్పుడు ప్రతి మహిళకు దాదాపు $7,612 అంటే రూ. 5.94 లక్షల పరిహారం లభిస్తుంది.

పురుషులకు గంటకు $21, స్త్రీలకు $18.51 చెల్లిస్తోంది..

Google ఒక మహిళా ఉద్యోగికి గంటకు $18.51 వేతనం చెల్లించేది. అదే సమయంలో తక్కువ అనుభవం, అర్హతలు ఉన్న పురుషులకు గంటకు $21 చెల్లిస్తోంది.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.