Lazy Husband: ఓవైపు ఆఫీసు.. మరోవైపు ఇంటిపని.. భర్త బద్దకాన్ని భరించలేక హత్య చేసి.. ఉడకబెట్టిన భార్య

Lazy Husband: ఓవైపు ఆఫీసు.. మరోవైపు ఇంటిపని.. భర్త బద్దకాన్ని భరించలేక హత్య చేసి.. ఉడకబెట్టిన భార్య
Lazy Husband

తాజాగా భార్య తన భర్త బద్ధకాన్ని ఇక భరించలేక.. ఏకంగా భర్తనే హత్యచేసింది. ఈ దారుణ ఘటన ఆగ్నేయ ఐరోపా దేశమైన సెర్బియాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వింత ఘటన  ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Surya Kala

|

May 14, 2022 | 9:17 PM

Lazy Husband: భార్యాభర్తల బంధం ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది.. భిన్నమైనది.  వివాహ వేడుకల సమయంలో.. భార్యాభర్తలిద్దరూ ప్రతి సుఖదుఃఖంలో ఒకరికొకరు తోడుగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే పెళ్లి సమయంలో చేసిన ప్రమాణాలను పాటించే భర్తలు అతి తక్కువమంది ఉంటారు. ప్రసుత్తం ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఉద్యోగం చేసే భార్యలు ఓ ఆఫీసులో పని.. మరోవైపు  ఇంటి పనులన్నీ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి మహిళలో కొన్నిసార్లు చిరాకు, కోపం అధికంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా మొదలవుతాయి. అయితే భర్త బద్దకాన్ని తిట్టుకుంటూ .. తన పని తాను చేసుకుంటుంది. అయితే తాజాగా భార్య తన భర్త బద్ధకాన్ని ఇక భరించలేక.. ఏకంగా భర్తనే హత్యచేసింది. ఈ దారుణ ఘటన ఆగ్నేయ ఐరోపా దేశమైన సెర్బియాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వింత ఘటన  ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భర్త ఇంటి పనుల్లో సాయం చేయకపోవడంతో రెచ్చిపోయిన భార్య.. భర్తను చావబాదింది. అంతే కాదు..  కోపంతో తన భర్తని చంపి.. ఆ మృతదేహాన్ని అనేక ముక్కలుగా చేసి, ఆ ముక్కలను పెద్ద బాణలిలో ఉడకబెట్టింది. ఈ షాకింగ్ హత్య గురించి వివరాల్లోకి వెళ్తే..

ప్రత్యక్ష సాక్షి కూతురు:  డైలీ స్టార్ కథనం ప్రకారం..  ఈ సంఘటన సెర్బియాకు చెందిన జరంజానిన్. మే 10వ తేదీ రాత్రి 9 గంటలకు తెరాస అనే మహిళ ఈ ఘటనకు పాల్పడింది. కుమార్తె వాంగ్మూలం మేరకు ప్రస్తుతం నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళ తన భర్తను చంపే సమయంలో ఆమె కుమార్తె కూడా అక్కడే ఉందని పోలీసులు చెబుతున్నారు.

భర్తను స్పృహ తప్పేలా చేసిన భార్య  నివేదికల ప్రకారం.. మహిళ ఒంటరిగా రాత్రి భోజనం చేస్తుంది. అదే సమయంలో ఆమె భర్తపై చాలా కోపంగా ఉంది. తన భర్త బద్దకముగా ఏపని చేయడం లేదని అసంతృటిలో ఉంది. దీంతో తన భర్తకు డ్రగ్స్ ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకునేలా చేసింది. ఆపై అతన్ని చంపింది. అయినప్పటికీ ఆమె కోపం చల్లారకపోవడంతో తన భర్త శవాన్ని ముక్కలుగా కోసి బాణలిలో ఉడకబెట్టింది.

కూతురు చెప్పిన షాకింగ్ నిజం: 

తన తల్లి సవతి తండ్రిని చంపడం కళ్లారా చూశానని ప్రత్యక్షసాక్షి కూతురు చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన విషయం విన్న పోలీసులు సైతం ఉలిక్కిపడ్డారు. నిందితురాలు కూతురు D’Elje .. హత్య సమయంలో తన తండ్రి మద్యం తాగి ఉన్నాడని, అయినప్పటికీ ప్రాణాలను కాపాడుకోవడానికి తప్పించుకోవడానికి ప్రయత్నించాడని తెలిపింది. తన తల్లి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ తన తల్లి ఆగకుండా నిరంతరం కత్తులతో పొడిచిందని తెలిపింది.

పోలీసుల విచారణలో..  నిందితురాలు తన భర్త సోమరితనంతో విసిగిపోయానని చెప్పింది. గతంలో కూడా ఆమె తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో భర్త ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నడు. అయితే ఈ ఈసారి మాత్రం భార్య చేతుల నుంచి చావుని తప్పించుకోలేక పోయాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu