- Telugu News Photo Gallery Fashion tips in Telugu include these footwears from different states in your collection
Fashion Tips: అందమైన అమ్మాయిల పాదాలకు మరింత అందాన్నిచ్చే చెప్పులు.. వివిధ రాష్ట్రాలకు చెందిన పాదరక్షణ వివరాలు
Fashion Tips: పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షించడమే కాకుండా, శుభ్రంగా ఉంచుతాయి, అందాన్నిస్తాయి. నేటి కాలంలో తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, ట్రెండ్, మ్యాచింగ్ ప్రకారం బట్టలు నుండి పాదరక్షల వరకు ధరించడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు స్త్రీలలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
Updated on: May 14, 2022 | 9:18 PM

ఒకప్పుడు పాదరక్షలు కొన్నప్పుడు ఎక్కువ కాలం వాడేవారు కానీ నేడు కాలం మారింది. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించడం కోసం, ప్రజలు వివిధ రకాల పాదరక్షల సేకరించుకుని తమతో ఉంచుకుంటున్నారు. వాటిని సందర్భాలను బట్టి దుస్తులను మ్యాచ్ అయ్యే విధంగా ధరిస్తారు. ఈ విషయాల్లో మహిళల్లోనే అధికం. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాల్లో విక్రయించే పాదరక్షల గురించి ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నాం. తద్వారా మీరు కూడా వీటిని మీ సేకరణలో చేర్చుకోవచ్చు.

పంజాబీ జుట్టీలు: పొడవుగా ఎత్తు ఉన్న అమ్మాయిలు, హీల్స్‌కు దూరంగా ఉండే వారికి పంజాబీ జుట్టీలు మంచి ఎంపిక. ఈ చెప్పులు ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. మెహందీ, పెళ్లి లేదా ఏదైనా కుటుంబ ఫంక్షన్లకు మంచి ఎంపిక. మార్కెట్‌లో వివిధ డిజైన్‌లు, వర్క్‌లు, రంగులు అందుబాటులో ఉన్నాయి.

కొల్హాపురి చప్పల్స్: కొల్హాపురి చప్పల్స్ తో ఆఫీసు, పార్టీ ఇలా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. జీన్స్, ప్యాంట్‌ల నుండి కుర్తీలు, సూట్‌ల వరకు ఏవైనా ఈ చెప్పులకు సులభంగా సరిపోతాయి. కొల్హాపురి చప్పల్స్ వివిధ డిజైన్‌లు మహిళలు, జెంట్స్ కోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పురుషులు వీటిని ప్యాంటు, జీన్స్‌తో పాటు కుర్తా పైజామాకు మంచి మ్యాచింగ్. చాలా తక్కువ బరువు కలిగి ఉంటాయి. ధర కూడా తక్కువగా ఉంటుంది. మన్నిక కూడా అధికం.

మొజారి చెప్పులు: ఈ రోజుల్లో మొజారి చెప్పులు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఎలాంటి దుస్తులకైనా ఈ చెప్పులు మంచి మ్యాచ్ గా నిలవడం ఈ చెప్పుల ప్రత్యేకత. కొంతమంది వీటిని డిజైనర్ బూట్లు అని కూడా పిలుస్తారు. మోజ్రీలో జైపురి పనితనం అద్భుతంగా ఉంటుంది. స్త్రీ, పురుషులకు సంబంధించిన అన్ని డిజైన్‌ల చెప్పులు, షూలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

పులా చప్పల్: మీరు ఏదైనా విభిన్నంగా ప్రయత్నించాలనుకుంటే, మీరు పులా చప్పల్ ధరించవచ్చు. గడ్డి, జనపనార, గుడ్డ సహాయంతో వీటిని తయారుచేస్తారు. కొండ ప్రాంతాలలో వీటిని ఎక్కువగా ధరిస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. చల్లని వాతావరణంలో పాదాలను చాలా వెచ్చగా ఉంచేందుకు ఈ చెప్పులు పని చేస్తాయి




