డామిట్ కథ అడ్డం తిరిగింది.. రాజకీయ శరణార్థిగా షేక్ హసీనాకు ఆశ్రయం ఇచ్చేదెవరు..?
ఐదు సార్లు దేశానికి ప్రధాని, నిన్నటి వరకు తిరుగులేని నాయకురాలు... అధికారంలో ఉంటూ దేశంలో మొత్తాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్న నేత,.... షేక్ హసీనా... ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. తనకు ఉండటానికి ఆశ్రయం కావాలంటూ ఆ దేశాన్ని.. ఈ దేశాన్ని అడుక్కోవాల్సిన సందర్భం. ఓడలు... బళ్లు కావడం అంటే ఇదే. ఏదో భారత్ అయినా దయతలచి ఉండనిస్తోందే కానీ... ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లేందుకు ఆమె చేసిన ఏ ప్రయత్నమూ ఫలించడం లేదు.
ఐదు సార్లు దేశానికి ప్రధాని, నిన్నటి వరకు తిరుగులేని నాయకురాలు… అధికారంలో ఉంటూ దేశంలో మొత్తాన్ని తన చెప్పు చేతల్లో ఉంచుకున్న నేత,…. షేక్ హసీనా… ఇప్పుడు దేశాలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. తనకు ఉండటానికి ఆశ్రయం కావాలంటూ ఆ దేశాన్ని.. ఈ దేశాన్ని అడుక్కోవాల్సిన సందర్భం. ఓడలు… బళ్లు కావడం అంటే ఇదే. ఏదో భారత్ అయినా దయతలచి ఉండనిస్తోందే కానీ… ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లేందుకు ఆమె చేసిన ఏ ప్రయత్నమూ ఫలించడం లేదు. భారత్ కూడా ఆమెకు తాత్కాలిక డెస్టినేషనే తప్ప.. పర్మినెంట్ కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఎప్పుడో చెప్పేశారు. మరోవైపు హసీనా కుమారుడు సాజీబ్ వాదిజ్.. తన తల్లి ఏ దేశాన్ని రాజకీయ ఆశ్రయం కోరలేదని చెబుతున్నారు. అలాంటప్పుడు మరి షేక్ హసీనా డెస్టినేషన్ ఏది..? ఆమె ఎక్కడ ఉండబోతున్నారు..? అటు బ్రిటన్ లేదా.. అమెరికా ఏ దేశమైనా ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పిస్తుందా..? ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని పరిస్థితుల్ని ఆయా దేశాలు ఎలా చూస్తున్నాయన్న విషయంపై ఇదంతా ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆశ్రయం దొరకడం అంత ఈజీ కాదా?
ప్రస్తుత పరిస్థితుల్లో షేక్ హసీనాకు పశ్చిమ దేశాలు ఆశ్రయం కల్పించడం చాలా కష్టమని, అది జరగడం అసాధ్యమని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ రీసెర్చర్ టామ్ కీయెన్ తమతో చెప్పినట్టు బీబీసీ బంగ్లా తన వెబ్ సైట్లో పేర్కొంది.
షేక్ హసీనా హయాంలో గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై పశ్చిమ దేశాలు ఒ రకంగా షాక్‌కు గురయ్యాయి. ముఖ్యంగా ఆమె దేశం వదిలి పారిపోయే చివరి రోజుల్లో పరిస్థితులు మరింత ఆశ్చర్య పరిచాయి. శాంతియుతంగా ప్రజలు చేస్తున్నపోరాటాన్ని పోలీసు, ఆర్మీ సైన్యాలను ఉపయోగించి అత్యంత కఠినంగా అణచివేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో పశ్చిమ దేశాలు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు పశ్చిమ దేశాల కాకుండా గల్ఫ్ లేదా మరే ఇతర దేశమైనా ఆశ్రయం కల్పించాలే తప్ప మరో మార్గం లేదన్నది మెజార్టీ విశ్లేషకుల మాట.
పశ్చిమదేశాలు ఏమంటున్నాయి?
చాలా మంది నేతలకు గతంలో రాజకీయ ఆశ్రయం కల్పించడానికి యూరోప్ లేదా అమెరికా దేశాలు ఆశ్రయం కల్పిస్తూ ఉండేవి. ఇక ముస్లిం దేశాల విషయానికి వస్తే ఈ విషయంలో సౌదీ అరేబియా ముందుండేది. కానీ ఇప్పుడు షేక్ హసీనా విషయంలో వెస్ట్రన్ కంట్రీస్ పెద్దగా నోరు మెదపడం లేదు. ప్రధానంగా గడిచిన కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో జరిగిన హింసే అందుకు ప్రధాన కారణమని, హసీనా అధికారంలో ఉండగా ఆందోళన కారులపై నిర్దాక్షణ్యంగా వ్యవహరించారని పశ్చిమ దేశాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో అక్కడ ఏం జరగిందన్న విషయం యావత్ ప్రపంచం తెలిసిపోయింది.ఓ రకంగా అది హసీనాను ప్రపంచ దేశాలు అంత నెగిటివ్‌గా చూసేందుకు కారణం కావచ్చు. అంతేకాదు… తమ తమ దేశాల్లో ఉన్న మెజార్టీ బంగ్లాదేశీయులు కూడా కొద్ది రోజులుగా వారి దేశంలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతు పలికారు. షేక్ హసీనాను తొలగించాలన్న డిమాండ్లతో వాళ్లు కూడా గొంతు కలిపారు. సో.. అక్కడేం జరిగిందన్న విషయంలో వివిధ దేశాలు చాలా స్పష్టమైన అవగాహననతో ఉన్నట్టు తెలుస్తోంది.
మరి ఇప్పుడు హసీనా ఎక్కడికెళ్తారు?
ప్రస్తుతానికి భారత్‌లో ఉన్నప్పటికీ హసీనా ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులు వివిధ దేశాలలో ఉన్నారు. నిజానికి మొదట్నుంచి ఆమె యూకే వెళ్లాలనుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆమెతో కలిసి ఉన్నారని భావిస్తున్న సోదరి షేక్ రెహానా యూకే సిటిజన్. ఆలాగే ఆమె మేనకోడలు ట్యుడిప్ సిద్ధీక్..బ్రిటిష్ పార్లమెంటేరియన్. ఆమె లేబర్ పార్టీ ఎంపీ. కొత్తగా ఏర్పాటైన లేబర్ గవర్నమెంట్లో ఆమె ఎకానమిక్ సెక్రటెరీ కూడా. సో.. అక్కడ కచ్చితంగా తనకు ఆశ్రయం కల్పిస్తారని భావించే యూకే వెళ్లాలని భావించినట్టు తెలుస్తోంది. కానీ వివిధ కారణాల వల్ల యూకే ప్రస్తుతానికి నో చెప్పింది. బ్రిటన్‌లో బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. హసీనాకు ఆశ్రయం కల్పిస్తే.. అక్కడ ఆమెకు భద్రత కల్పించడం కష్టంగా మారుతుందని యూకే ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
హసీనా కుమారుడు సాజిబ్ యూఎస్‌లో ఉన్నారు. సో.. అందుకే ఆమె అమెరికా కూడా వెళ్లేందుకు ప్రయత్నించారన్న వార్తలు వచ్చాయి. బట్ అమెరికా కూడా వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నట్టే కన్పిస్తోంది. మరో ఆప్షన్ రష్యా అని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఆమె ప్రభుత్వంలో ఉన్నప్పుడు రష్యాతో నెరపిన సత్సంబంధాలే అందుకు కారణం అని అంటున్నప్పటికీ.. రష్యా నుంచి కూడా ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక మిగిలింది గల్ఫ్ దేశాలు .. అందులో సౌదీ అరేబియా. అక్కడకు కూడా ఆమె వెళ్లే అకాశం లేకపోలేదన్న వార్తలు వస్తున్నాయి. అయితే తన తల్లి యూకె లేదా యూఎస్ వచ్చే అవకాశమే లేదని ఆమె కుమారుడు సాజిబ్ చెప్పుకొస్తున్నారు. అంతే కాదు టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఆ సమయంలో హసీనా బంగ్లాదేశ్‌ను వదిలి వెళ్లకపోతే కచ్చితంగా ఆమె హత్యకు గురయ్యేవారని చెప్పారు. భారత్ తన తల్లికి తాత్కాలిక ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూనే.. తమ దేశంలో జరుగుతున్న దాడుల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర ఉందని టీవీ9తో చెప్పారు.
సో.. అది సంగతి.. ప్రస్తుతానికి హసీనా ఇండియాలోనే ఉన్నారు. నిజానికి ఆమె బంగ్లాదేశ్ నుంచి బయల్దేరినప్పుడు కేవలం ఫ్యూయల్ నింపుకోడానికి, అలాగే యూకేకి సంబంధించిన డాక్యుమెంటేషన్ పూర్తి చెయ్యడానికి కొద్ది సేపు మాత్రమే ఢిల్లీలో ఆగుతామని చెప్పారు. అయితే అలా చెప్పి రోజులు గడిచిపోయాయి. మరోవైపు ఆమె కుమార్తె సైమా వాజిద్ ఢిల్లీలోనే ఉన్నారు. ఆమె వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి రీజనల్ చీఫ్. మరి ఆమె దగ్గర ఉంటారా..? ప్రస్తుతానికైతే నో క్లారిటీ.
గతం ఏం చెబుతోంది?
సాధారణంగా ఏకఛత్రాధిపత్యం వహిస్తూ.. ఇంకా చెప్పాలంటే దేశ సర్వాధికారిగా చలామణి అయిన వాళ్లలో చాలా మందికి అధికారం చేజారిన తర్వాత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. గత చరిత్ర ఇదే చెబుతోంది. ఒకసారి పవర్ పోయిందంటే వాళ్ల సంగతి ముగిసినట్టే, అయితే జైలు, లేదంటే దేశం విడిచి వెళ్లిపోవడం.. ఒక్కసారి ప్రాణాలే ఫణంగా పెట్టాల్సిన పరిస్థితి కూడా. మళ్లీ అదృష్టవశాత్తు వాళ్ల పార్టీ అధికారంలోకొస్తే తప్ప… వాళ్ల సంగతి అక్కడితో ముగిసినట్టే.
అందుకే ఒక్కసారి అధికారం కోల్పోయారంటే వెంటనే జనాగ్రహం నుంచి తప్పించుకునేందుకు వాళ్లు దేశం వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుంటారు. అయితే దురృష్టవశాత్తు.. షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పటికీ దేశం వదిలివేసి వెళ్లాల్సి వచ్చింది.
1979లో ఉగాండాకు చెందిన నియంత ఈద్ అమీన్‌కు ఇలాంటి అనుభమే ఎదురయ్యింది. ఉగాండా రాజధాని కంపాలాను ఉగాండా రెబల్స్, టాంజానియన్ ట్రూప్స్ ఆక్రమించినప్పుడు ఈద్ రాజకీయ శరణార్ధిగా మొదట లిబియా పారిపోయారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందారు.
1986లో ఫిలిప్పీన్స్ డిక్టేటర్ ఫెర్డినాండ్ మోర్కాస్ ప్రజాగ్రహానికి భయపడి అమెరికా సాయంతో హవాయీ ద్వీపానికి పారిపోయారు. అదే సమయంలో హయతీ డిక్టేటర్ జీన్ క్లాడ్ ఫ్రాన్స్‌లో ఆశ్రయం పొందారు. అయితే ఈ మూడు సందర్భాల్లో కూడా నియంతలుగా పేరున్న వాళ్లు.. ఎన్నికలు వెళ్లడంతో అధికార మార్పిడి చాలా ప్రశాంతంగా సాగిపోయింది. లేదంటే పరిస్థితులు వేరేలా ఉండేవి.
2011లో మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో సామూహిక ఆందోళనలు ఉధృతంగా సాగాయి. ఆందోళనల్ని అరబ్ స్ప్రింగ్ అని పిలిచే వారు. అక్కడ దశాబ్దాలుగా ఎలాంటి ఎన్నికలు లేకుండానే ప్రభుత్వాలు కొనసాగాయి. ఆ అరబ్ స్ప్రింగ్ తొలి బాధితుడు ట్యూనిషియాకు చెందిన నియంత బెన్ అలీ. 23 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆయన ఈ ఆందోళనల ధాటికి సౌదీ అరేబియా పారిపోయారు. ఆ తర్వాత అక్కడే మరణించారు.
ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌కు కూడా అరబ్ స్క్పింగ్ దెబ్బ పడింది. దాదాపు 30 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఆయన కేవలం18 రోజుల పాటు కొనసాగిన ఆంధనలతో బలవంతంగా అధికారాన్ని వీడి వెళ్లిపోవాల్సి వచ్చింది. తన అధికారాన్ని ఆర్మీకి అప్పగించారు. దురదృష్టవశాత్తు.. ఆయన మాత్రం తన దేశాన్ని విడిచి వెళ్లే అవకాశం రాలేదు. 2012 ఆయన్నుఅరెస్ట్ చేసి జీవిత ఖైదు విధించారు. ఆ తర్వాత ఆ దేశ సుప్రీం కోర్టు జోక్యంతో ఆయన్ను 2017లో విడుదల చేశారు. 91 ఏళ్ల వయసులో ఆయన మరణించారు.
ఇక లిబియా నియంత మహమ్మద్ గడాఫీ కథ కూడా అలాంటిదే. లిబియా అరబ్ స్ప్రింగ్ ఆందోళనల్ని అణిచివేయాలని చూసిన గడాఫీ 2011లో తిరుగుబాటు దారుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. సుమారు 42 ఏళ్ల పాటు ఆయన లిబియాను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.
ఇక మన పొరుగు దేశం పాకిస్తాన్‌లోనూ ఇలాంటి పరిస్థితే గతంలో తలెత్తాయి. ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్న సమయంలో ఆర్మీ దెబ్బకు అధికారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆయన్ను ఉరి తీసేందుకు అన్ని ఏర్పాటు జరిగిపోయాయి కూడా. కానీ అమెరికా , సౌదీ అరేబియా దేశాల ఒత్తిడి కారణంగా నవాజ్‌ను నాటి మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ బలవంతంగా సౌదీ అరేబియా తరలించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరిగి ఆయన పార్టీ పాకిస్తాన్ ఎన్నికల్లో విజయం సాధించడం