AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA: H1B వీసాపై టెన్షనొద్దు.. O-1 వీసా ఉందిగా?

ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అమెరికాకు వెళ్లేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్న టైంలో ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్‌ అవుతోంది. అదే ఓ-1 వీసా. అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులను విపరీతంగా ఆకర్షిస్తోంది ఈ వీసా. హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయంగా మారిన ఓ-1 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు మన భారతీయులు.

USA: H1B వీసాపై టెన్షనొద్దు.. O-1 వీసా ఉందిగా?
O -1 Visa
Ram Naramaneni
|

Updated on: Jun 29, 2025 | 5:57 PM

Share

ట్రంప్‌ అనుసరిస్తున్న కఠిన వైఖరితో అమెరికాకు వెళ్లేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్న టైంలో ఒక్క వీసా మాత్రం తెగ పాపులర్‌ అవుతోంది. అదే ఓ-1 వీసా. అమెరికా వెళ్లాలనుకునే వృత్తి నిపుణులను విపరీతంగా ఆకర్షిస్తోంది ఈ వీసా. హెచ్‌-1బీకి ప్రత్యామ్నాయంగా మారిన ఓ-1 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు మన భారతీయులు.

యూఎస్‌ ఇమిగ్రేషన్‌ యాక్ట్‌ 1990 కింద ఓ-1 వీసాను ప్రవేశపెట్టారు. సైన్స్‌, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ ఫిల్మ్‌లో అసాధారణ ప్రతిభ, నైపుణ్యాలున్నవారికి, ఆయా రంగాల్లో అద్భుత విజయాలు సాధించినవారికి ఓ వన్‌ వీసాలు మంజూరుచేస్తున్నారు. కాకపోతే వీసాకు దరఖాస్తు చేసుకునేవారు.. నిర్ణయించిన ఎనిమిది కఠిన ప్రమాణాల్లో కనీసం మూడైనా కలిగిఉండాలి.

లాటరీ విధానం, పరిమితులేమీ లేకపోవటంతో ఓ-వన్‌ వీసాని తిరస్కరించే అవకాశాలు తక్కువ. దరఖాస్తుదారుల్లో 93 శాతం మందికి వీసాలు మంజూరవుతుంటాయి. హెచ్‌-1బీ అయితే ఆ ఛాన్స్‌ కేవలం 37 శాతమే. ఓ-1 వీసాని మొదటమూడేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఎన్నిసార్లయినా పొడిగించుకోవచ్చు.

వీసా ఈజీనే కానీ కాస్త ఖర్చెక్కువ. సాధారణంగా హెచ్‌-1బీ దరఖాస్తుకయ్యే ఖర్చు 970 డాలర్ల నుంచి 7,775 డాలర్లుగా ఉంటుంది. కానీ ఓ వన్‌ వీసా దరఖాస్తు రుసుము 10వేల డాలర్ల నుంచి 30వేల డాలర్లుగా ఉంది. ఈ వీసాలను అత్యధికంగా పొందుతున్న వారిలో బ్రిటన్‌, బ్రెజిల్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది.

అయితే హెచ్‌-1బీ వీసా కష్టమైపోతున్న సమయంలో భారత సైబర్‌ నిపుణులు, ఏఐ రీసెర్చర్లు, అథ్లెట్లు, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్లు అమెరికాకు వెళ్లేందుకు ఓ-1 వీసాని షార్ట్‌ కట్‌గా భావిస్తున్నారు. గూగుల్‌, టెస్లా, ఓపెన్‌ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఓ-1 వీసాతోనే నియామకాలకు ఆసక్తి చూపిస్తున్నాయి. సైన్స్, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్ రంగాలలో అసాధారణ సామర్థ్యం ఉన్నవారికి, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వారికి ఓ వన్‌ A వీసాలిస్తారు. కళాకారులు, సంగీతకారులు, రచయితలు, సినిమా, టీవీ పరిశ్రమలో అసాధారణ విజయాలు అందుకున్నవారికి B కేటగిరీలో ఓ వన్‌ వీసాలు వస్తాయి.