AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Simran: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన యువతి.. ఫ్లైట్‌ దిగిన కాసేపటికే..

ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లిన ఓ 24 ఏళ్ల యువతి ఐదురోజులకే అదృశ్యం కావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. యువతి బంధువల ఫిర్యాదుతో స్థానిక సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా.. ఆమె తప్పిపోవడానికి ముందు ఆమె ఫోన్‌ చూస్తూ ఎవరికోసమో వెయిట్‌ చేస్తున్నట్టు కనిపించింది. పైగా ఆమెలో ఎలాంటి ఆందోళన కూడా కనిపించకపోవడంతో ఈ మిస్సింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Simran: పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికా వెళ్లిన యువతి.. ఫ్లైట్‌ దిగిన కాసేపటికే..
Simran
Anand T
|

Updated on: Jun 29, 2025 | 5:12 PM

Share

ఇంట్లో వాళ్లు కుదిర్చిన పెళ్లి కోసం భారత్ నుంచి అమెరికా వెళ్లిన ఓ 24 ఏళ్ల యువతి అదృశ్యం కావడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. భారత్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రన్ అనే యువతి పెద్దలు కుదిర్చిన వివాహం కోసం  జూన్ 20న అమెరికాకు చేరుకుంది. అయితే ఆమె ఆమెరికాకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో బంధువులు ఆమె కోసం వెతగ్గా ఆచూకీ లభించలేదు.. ఇక చేసేదేమి లేక వారు అమెరికా పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అమెరికా పోలీసులు ఘటనా స్థలంలోని స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించగా..అందులో తప్పిపోవడానికి కొద్ది సేపు ముందు సిమ్రన్ తన ఫోన్ చూస్తూ ఎవరి కోసమో ఎదురుచూస్తుండడం కనిపించిందని అమెరికా పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఆమెలో తప్పిపోయానన్న ఎలాంటి ఆందోళన కూడా కనిపించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

దీంతో సిమ్రాన్ మిస్సింగ్‌పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు ప్రాథమిక దర్యాప్తులో ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆమె నిజంగానే పెళ్లి కోసం అమెరికా వచ్చిందా..లేదా కేవలం ఉచిత విమాన ప్రయాణం చేసేందుకే పెళ్లి నాటకం ఆడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. భారత్‌లోని సిమ్రన్ కుటుంబ సభ్యులను సంప్రందించేందుకు ప్రయత్నించినా..తమకు ఎలాంటి వివరాలు లభించలేదని అమెరికా పోలీసులు తెలిపారు.

మరోవైపు ఆమెను గుర్తించేందుకు ఆమె చవరిసారిగా వేసుకున్న దుస్తువులు, ఆమె ఎలా ఉంటుందనే వివరాళను పోలీసులు వెల్లడించారు. సిమ్రాన్ 5 అడుగుల 4 అంగుళాల పొడవు, 68 కిలోల బరువు ఉంటుందని, నుదిటిపై చిన్న మచ్చ ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు. సిమ్రాన్ బూడిద రంగు స్వెట్‌ప్యాంట్, తెల్లటి టీ-షర్ట్, చిన్న డైమండ్ చెవిపోగులు ధరించి కనిపించిందిని తెలిపారు. పైగా సిమ్రాన్‌కు ఇంగ్లీష్ మాట్లాడం కూడా రాదని.. అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని అధికారులు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్ జో టొమాసెట్టికి సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్
ఓపెనర్లుగా అభిషేక్, వైభవ్.. మిడిల్‌లో మరో డేంజరస్ ప్లేయర్
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు.. ఎన్డీఏ మాస్టర్ ప్లాన్..
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు.. ఎన్డీఏ మాస్టర్ ప్లాన్..
ఫుట్‌బాల్ మ్యాచ్ కాస్తా బాక్సింగ్ రింగ్‌లా మారింది
ఫుట్‌బాల్ మ్యాచ్ కాస్తా బాక్సింగ్ రింగ్‌లా మారింది
హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..
హైదరాబాదీలు ఎగిరి గంతేసే వార్త.. ఇక ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే..
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేడుకల్లో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్
NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. మార్కులెన్నో చూశారా?
NEETలో మెరిసిన పశువుల కాపరి కుమార్తె.. మార్కులెన్నో చూశారా?
బరువును తగ్గించే దివ్యాస్త్రం.. జీలకర్ర నీటిని ఇలా తాగితే..
బరువును తగ్గించే దివ్యాస్త్రం.. జీలకర్ర నీటిని ఇలా తాగితే..
బెస్ట్ బైక్స్.. రూ.68 వేల నుంచే ప్రారంభం.. 70కిమీ పైగా మైలేజ్..!
బెస్ట్ బైక్స్.. రూ.68 వేల నుంచే ప్రారంభం.. 70కిమీ పైగా మైలేజ్..!
తెలుగురాష్ట్రాల్లో సోమవారం వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో సోమవారం వాతావరణం ఎలా ఉండబోతుందంటే?