Kim Jong Un: కిమ్ తరువాత రూలర్ ఆమేనా?.. ఆ స్టాంప్స్ వెనుక దాగిన రహస్యమేంటి?
ఉత్తర కొరియా.. అధినేత కిమ్ వారసులెవరు? ఇటీవలి పరిణామాలు ఏం చెబుతున్నాయి? తరచూ ఆయన తన రెండో కుమార్తెతో కనిపించడం వల్ల ఏం తెలుస్తోంది? ఈ విషయంలో లేటెస్ట్ అప్ డేట్ ఏంటి?..

ఉత్తర కొరియా.. అధినేత కిమ్ వారసులెవరు? ఇటీవలి పరిణామాలు ఏం చెబుతున్నాయి? తరచూ ఆయన తన రెండో కుమార్తెతో కనిపించడం వల్ల ఏం తెలుస్తోంది? ఈ విషయంలో లేటెస్ట్ అప్ డేట్ ఏంటి? స్పెషల్ స్టోరీ మీకోసం.. అవును, కిమ్ ఏం చేసినా సంచలనమే. కిమ్ తర్వాత వారసులెవరూ? అన్నది కూడా అతి పెద్ద చర్చనీయాంశం. గత కొన్నాళ్లుగా ఆయన కొన్ని హింట్స్ ఇస్తూ వస్తున్నారు. తన రెండో కుమార్తె.. చువేయ్ తో కలసి ఆయన తరచూ బయట కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న పదేళ్ల కుమార్తె చువేయ్ తో కలసి ఇలాగే బయటకొచ్చారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా మరో అప్ డేట్.. ఏంటంటే.. తన కుమార్తె చువేయ్ తో కలసి ఉన్న తపాలా స్టాంపును ఆవిష్కరించారు. దీంతో ఈ అణ్వాయుధ దేశానికి వారసురాలిగా.. చువేయ్ అయి ఉండొచ్చన్న నిర్దారణకు వస్తున్నారు నిపుణులు.
మొన్నటికి మొన్న క్షిపణి శాస్త్రవేత్తల సమావేశానికి.. చువేయ్ ను వెంటబెట్టుకెళ్లిన ఫోటోలను విడుదల చేసింది.. నార్త్ కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ. ఉత్తర కొరియా తదుపరి పగ్గాలు చేపట్టబోయేది చువేయ్.. అన్న చర్చ అప్పటి నుంచే నడుస్తోంది. తాజాగా పోస్టల్ స్టాంపులు సైతం విడుదల కావడంతో.. ఒక క్లారిటీ వచ్చినట్టుగా భావిస్తున్నారు అంతర్జాతీయ రాజకీయ వర్గాల
కుమార్తె చువేయ్ అంటే కిమ్ కి చాలా చాలా ఇష్టమని. అందుకే ఆమెను తన వారసురాలిగా ప్రకటించే దిశగా.. కిమ్ అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కిమ్ పిల్లల ప్రస్తావన చేసిందే లేదు. గత నవంబర్ లో కిమ్ తన కుమార్తెతో ఉన్న ఫోటోలను విడుదల చేశారు. అప్పటి నుంచీ ఆమె ఉత్తర కొరియా భవిష్యత్ తార కావచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంగళవారం నాడు.. నార్త్ కొరియన్ స్టాంప్ కార్పొరేషన్.. కొత్త సీరిస్ స్టాంపులు విడుదల చేయగా.. వాటిలో ఐదు స్టాంపులు.. కిమ్, తన రెండో కుమార్తె చువేయ్ తో ఉన్న చిత్రాలు కనిపించాయి. ఈ కార్పొరేషన్ తన వెబ్ సైట్ లో ప్రియమైన కుమార్తె అన్న టైటిల్ తో ఈ స్టాంపుల ప్రదర్శన చేసింది. ఈ సీరీస్ వచ్చే శుక్రవారం విడుదల కానుంది.




ఈ స్టాంపులను బట్టీ చెప్పొచ్చు.. ఆమె ఉత్తరకొరియా భవిష్యత్ నాయకి అన్న అంచనాలకు వచ్చేస్తున్నారు నార్త్ కొరియన్లు. చువేయ్ కు కుటుంబంలోనే అత్యంత గొప్ప స్థానం ఉండటం వల్లే.. ఆమె తన తండ్రితో సహా స్టాంపులకు ఎక్కినట్టుగా భావిస్తున్నారు ఉత్తర కొరియా వాసులు. ఒకరకంగా చెప్పాలంటే.. ఆమె తన తండ్రికి తగ్గ వారసురాలిగా అధికారిక జీవితాన్ని ప్రారంభించినట్టేనని చెప్పుకుంటున్నారు వరల్డ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ నార్త్ కొరియా స్టడీస్ వారు. ఇది నిజంగా ఒక చారిత్రక ఘట్టమనీ. ఈ స్టాంపుల ద్వారా.. కిమ్ వారసులెవరో ఈ ప్రపంచానికి తెలిసిపోయినట్టేనని భావిస్తున్నారు. అయితే ఇది కేవలం పైపై ప్రచారం అయి ఉండొచ్చనీ. కిమ్ పెద్ద కుమారుడు అసలు సిసలైన వారసుడిగా తాయరవుతుండవచ్చనీ అంచనా వేస్తున్నారు ఇంకొందరు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..