Viral: బిడ్డ పుట్టిందని సంతోషపడిన తల్లి.. అంతలోనే వెలుగులోకి షాకింగ్ నిజం.. సీన్ కట్ చేస్తే!
ఓ తల్లి తనకు బిడ్డ పుట్టిందని సంతోషపడిన కొన్ని క్షణాలకే.. ఆ ఆనందం ఆవిరైంది. వెలుగులోకి సంచలన నిజం బయటపడింది.
ఓ తల్లి తనకు బిడ్డ పుట్టిందని సంతోషపడిన కొన్ని క్షణాలకే.. ఆ ఆనందం ఆవిరైంది. వెలుగులోకి సంచలన నిజం బయటపడింది. సీన్ కట్ చేస్తే.. అంతా విషాదం.. కన్నీరు మున్నీరు.. ఇక దీనంతటికి కారణమైన తన భర్తపై కేసు పెట్టింది.. ఆ మహిళ.. ఇంతకీ అసలేం జరిగింది.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?
వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ వ్యక్తి మరో వివాహితతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఇంతలో అతడికి హెచ్‌ఐవీ సోకిందని తేలింది. ఈ విషయాన్ని తన భార్యకు తెలియకుండా దాచాడు. కట్ చేస్తే.. ఆ మహిళకు పండంటి బిడ్డ పుట్టింది. అయితే ఆ నవజాత శిశువుకు HIV సంక్రమించి మరణించింది. అలాగే సదరు మహిళ కూడా హెచ్‌ఐవీతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. డాక్టర్ ఈ విషయాన్ని ఆ మహిళకు వివరించింది. దీంతో తన భర్త తనను మోసం చేశాడని తెలుసుకున్న మహిళ.. అతడిపై కేసు నమోదు చేసింది. థాయ్‌లాండ్‌కు చెందిన ఈ మహిళ తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ప్రముఖ న్యాయవాదిని ఆశ్రయించింది. ఆ స్టోరీని సదరు లాయర్ ఫేస్‌బుక్‌లో నెటిజన్లతో పంచుకుంది.
థైగర్ నివేదిక ప్రకారం, ప్రముఖ న్యాయవాది కిర్డ్‌ఫోన్ కెవ్‌కిర్డ్ ఇలా వ్రాసుకొచ్చాడు, ‘ఇసాన్ ప్రావిన్స్ సురిన్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ నాకు ఫోన్ చేసి, చాలా బాధగా ఉందని చెప్పింది. ఆమె భర్త వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుని హెచ్‌ఐవీ బారిన పడ్డాడని తెలిపింది. హెచ్ఐవీ అతడి నుంచి తనకు.. తన నుంచి తనకు పుట్టిన నవజాత శిశువుకు సంక్రమించిందని.. తద్వారా బిడ్డ చనిపోయిందని పేర్కొంది. ఇదేంటని.. ఇది ఎలా జరిగిందని ఆమె తన భర్తను ప్రశ్నించడంతో తనకు వివాహేతర సంబంధం ఉందని అతడు ఒప్పుకున్నాడట. అయితే ఆ స్త్రీ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్, భర్తపై కేసును పోరాడటానికి సరిపడా డబ్బు కూడా లేదని’ అతడు పేర్కొన్నాడు.
వివాహ ధృవీకరణ పత్రం కూడా లేకుండా సదరు వ్యక్తిపై మహిళ కేసు గెలవడం చాలా కష్టమని లాయర్ కిర్డ్‌ఫోన్ కెవ్‌కిర్డ్ చెప్పుకొచ్చాడు. కానీ సెక్షన్ 297 ప్రకారం అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మహిళ ఆరోపించవచ్చునని తెలిపాడు. ఆ వ్యక్తికి హెచ్‌ఐవీ ఉందని తెలిసినా.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడు. కాబట్టి సెక్షన్ 297 ప్రకారం, ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆరు నెలల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం