AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పలికేవి శాంతి వచనాలు.. చేసేవి వార్‌ కుట్రలు.. యుద్ధకాండ వెనక అసలైన బేరం!

యుద్ధం కొందరికి అవసరం. అదే వాళ్ల వ్యాపారం. అందుకే, ప్రభుత్వాలనే శాసిస్తుంటాయి ఆయుధ కంపెనీలు. అమెరికాలో అయితే ఈ వ్యాపారుల లాబీయింగ్‌ పెద్ద ఎత్తున ఉంటుంది. అగ్రరాజ్యాల్లోనూ ఆయుధ వ్యాపారులదే ఆధిపత్యం. ఏదో ఒక రకంగా యుద్ధం జరిగేలా చూడాలని దేశాధినేతలనే ఒత్తిడి చేస్తుంటాయి కంపెనీలు. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్ ఒక రిపోర్ట్‌ ఇచ్చింది.

పలికేవి శాంతి వచనాలు.. చేసేవి వార్‌ కుట్రలు.. యుద్ధకాండ వెనక అసలైన బేరం!
Weapons And War
Balaraju Goud
|

Updated on: Jun 14, 2025 | 9:48 PM

Share

1776.. బ్రిటిష్‌ పాలన పోయి అమెరికాకు స్వాతంత్రం వచ్చిన ఏడాది. ఈ 250 ఏళ్లలో అమెరికాపై ఒక్కరంటే ఒక్కరు కూడా దాడి చేయలేదు. కానీ అమెరికా మాత్రం ఏకంగా 68 దేశాలపై దాడి చేసింది. అంటే.. ముప్పు అమెరికా వల్లే తప్ప అమెరికాకు కాదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఆయుధ తయారీలో గానీ, ఆయుధ వ్యాపారంలో గానీ, ఆయుధాల వాడకంలో గానీ అమెరికాను మించిన దేశం లేదు. జాగ్రత్తగా గమనిస్తే.. ప్రతి యుద్ధం వెనక ఉన్నది దాదాపుగా అమెరికానే. అందుకే అమెరికాపై ఓ విమర్శ ఉంది. యుద్ధం చేయించేది, ఆ పేరుతో ఆయుధాలు అమ్ముకునేది కూడా అమెరికానే. ఒక్క అమెరికా అనే కాదు.. అగ్రదేశాలు చేసే పనే ఇది. ఆయుధ వ్యాపారం కోసం దేశాల మధ్య చిచ్చు పెడతాయన్న పేరుంది. ప్రపంచం ప్రశాంతంగా ఓర్వలేరు. వాళ్లకు కావాల్సింది నిత్య రావణకాష్టం. సో, యుద్ధం వెనక కోణం ఆయుధ వ్యాపారమే అంటున్నారు నిపుణులు. యుద్ధం జరగాలంతే! ఎవరు ఎవరిపై దాడి చేసుకుంటున్నారన్నది అనవసరం. యుద్ధం జరిగి తీరాలి! ఇదీ ఆయుధ వ్యాపారుల కోరిక. ఒక దేశంలో రెండు పక్షాల వాళ్లు బాంబులు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారు. ఆ రెండు పక్షాలకీ వెపన్స్‌ సప్లై చేసింది ఒకే దేశం. ఇక ఉక్రెయిన్‌కి ఆయుధాలు సరఫరా చేస్తున్నది అమెరికానే. ముఖ్యంగా లాక్‌ హీడ్‌ మార్టిన్‌, రేతియన్‌ టెక్నాలజీస్‌ అనే కంపెనీల ఆయుధాలను ఉక్రెయిన్‌కు సప్లై చేస్తున్నారు. ఈ...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి