Water Cremation: ఆ దేశంలో త్వరలో మృత దేహానికి నీటిలో దహన సంస్కారాలు.. నీటి దహనం అంటే ఏమిటి? లాభాలు ఏమిటంటే..?

|

Jul 07, 2023 | 10:43 AM

వాస్తవానికి మృతదేహాన్ని దహనం చేసినప్పుడు ఇంధనాన్ని వినియోగిస్తారు. ఆ సమయంలో అనేక రకాల  వాయువులు ఉత్పత్తి అవుతాయి. సాంప్రదాయకంగా మృతదేహాన్ని దహనం చేయడమే కాదు, మృతదేహాన్ని ఖననం చేసి.. దహనం చేస్తారు. కో-ఆప్ ఫ్యూనరల్‌కేర్ ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టిందో మరియు నీటి దహనంలో మానవ మృతదేహానికి ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..

Water Cremation: ఆ దేశంలో త్వరలో మృత దేహానికి నీటిలో దహన సంస్కారాలు.. నీటి దహనం అంటే ఏమిటి?  లాభాలు ఏమిటంటే..?
Water Cremation
Follow us on

మారుతున్న కాలంతో పాటు మానవ జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. వాటిల్లో ఒకటి మరణం తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు చేసే విధానంలో మార్పులు. ప్రపంచం దేశంలో ఒకొక్క ప్రాంతానికి ఒకొక్క సంప్రదాయం ఉంటుంది. మృతదేహాన్ని దహనం చేసేవారు కొందరు.. కొందరు మృతదేహాన్ని పెట్టెలో పెట్టి భద్రపరుస్తారు. అయితే ఇప్పుడు బ్రిటన్‌లో నీటి అడుగున అంత్యక్రియలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు.. అయితే ఈ ఫీట్ ను బ్రిటన్‌లోని అతిపెద్ద అంత్యక్రియల సంస్థ కో-ఆప్ ఫ్యూనరల్‌కేర్ చేయనుంది. ఈ ఏడాది చివరకు ఈ సర్వీస్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని ధృవీకరించింది. ఈ రకమైన దహన సంస్కారాల్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టే బదులు నీటిలో దహనం చేస్తారు.

వాస్తవానికి మృతదేహాన్ని దహనం చేసినప్పుడు ఇంధనాన్ని వినియోగిస్తారు. ఆ సమయంలో అనేక రకాల  వాయువులు ఉత్పత్తి అవుతాయి. సాంప్రదాయకంగా మృతదేహాన్ని దహనం చేయడమే కాదు, మృతదేహాన్ని ఖననం చేసి.. దహనం చేస్తారు. కో-ఆప్ ఫ్యూనరల్‌కేర్ ఈ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టిందో మరియు నీటి దహనంలో మానవ మృతదేహానికి ఏమి జరుగుతుందో తెలుసుకుందాం..

నీటి దహనం ఎలా జరుగుతుంది?
మృతదేహాన్ని నీటి దహనం చేయడం వలన పర్యావరణకు మేలు చేస్తుందని కో-ఆప్ ఫ్యూనరల్‌కేర్ చెప్పింది. ఆక్వామేషన్ ప్రక్రియలో డెడ్ బాడీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో ఉంచుతారు. ఉక్కు పాత్రలో ఉంచే ముందు క్షారాన్ని కలుపుతారు. ఈ క్షారము మృతదేహం బరువు, లింగం ఆధారంగా చేయబడుతుంది. అనంతరం 95 శాతం, 5 శాతం క్షార ద్రావణాలు 200-300 ° F వరకు వేడి చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక మృత దేశంలోని ఎముకలు చిన్న ఎముకలుగా విభజించబడతాయి. తరువాత ఎముకలు మృదువుగా తయారవుతాయి. వాటిని ఎండబెట్టి, తెల్లటి పొడిని తయారు చేస్తారు. అనంతరం కలశంలో ఈ ఎముకలను బంధువులకు తిరిగి ఇస్తారు.

పర్యావరణానికి ఎందుకు మేలు చేస్తుందంటే.. 
US ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అట్లాంటిక్ ప్రకారం జ్వాల దహనం వల్ల పర్యావరణంపై చూపే  ప్రభావంలో పదో వంతు కూడా ఆక్వామేషనమ్  (నీటి దహనం)లో ఉండదు. దహన సంస్కారాలకు చాలా ఇంధనం అవసరం. దహనం చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్, ఇతర విష వాయువులు విడుదలవుతాయి కాబట్టి పర్యావరణానికి హానికరం.

మరోవైపు మృతదేహాన్ని పూడ్చడం వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. US ఏజెన్సీ ప్రకారం సగటు దహన సంస్కారం 535 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కారును 600 మైళ్ల దూరం నడపడంతో సమానం. మరోవైపు ఖననం సమయంలో మృతదేహాన్ని మెటల్ లేదా ప్లాస్టిక్‌లో ఉంచినట్లయితే అది మట్టిలో కలిసి కుళ్ళిపోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.

నీటి దహన ఖర్చు ఎంత అంటే?
అయితే నీటి దహనానికి ఇప్పుడు ఎంత ఖర్చవుతుందనే దానిపై స్పష్టత లేదు. అయితే దీని ఖర్చు సాంప్రదాయ దహన సంస్కారాల ఖర్చు అంత మాత్రమే అవుతుందని అంత్యక్రియల గైడ్ పేర్కొంది. UK చుట్టూ ఉన్న శ్మశాన వాటికలతో ఈ ఖర్చులు మారవచ్చు. UK అంత్యక్రియల సంస్థ కో-ఆప్ సంవత్సరానికి 93,000 అంత్యక్రియలను నిర్వహిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి పైలట్‌ ప్రాజెక్ట్‌లో ఇందుకోసం నిపుణులతో పనులు చేయిస్తామన్నారు. అమెరికా, కెనడా , దక్షిణాఫ్రికాలో నీటి దహనం బాగా ప్రాచుర్యం పొందింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..