AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఇండోనేషియా గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం.. ఎదురుగా ఫైటర్ జెట్స్.. ఆ తర్వాత సీన్ ఇదే!

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిత ఇండోనేషియాకు చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. విమానాశ్రయానికి స్వయంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేరుకుని ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలకడం ఈ పర్యటనకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.

Video: ఇండోనేషియా గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం.. ఎదురుగా ఫైటర్ జెట్స్.. ఆ తర్వాత సీన్ ఇదే!
Pm Modi Warm Welcome By Indonesia
Balaraju Goud
|

Updated on: Jul 06, 2026 | 5:19 PM

Share

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిత ఇండోనేషియాకు చేరుకున్నారు. రాజధాని జకార్తాలో ఆయనకు ఇండోనేషియా ప్రభుత్వం అత్యంత ఘనంగా స్వాగతం పలికింది. విమానాశ్రయానికి స్వయంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేరుకుని ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలకడం ఈ పర్యటనకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పింది.

అంతకు ముందు ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే, ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు దానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాధారణంగా స్నేహపూర్వక దేశాల అధినేతలకు ప్రత్యేక గౌరవ సూచకంగా ఇలాంటి ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌ను అందిస్తారు.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

జూలై 6 నుంచి 8 వరకు కొనసాగనున్న ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ సహకారం, సముద్ర భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి.

అలాగే యోగ్యకార్తాలోని ప్రపంచ ప్రసిద్ధ ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించడంతో పాటు, అక్కడి భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో భారత్–ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us