బ్రేకింగ్.. ఇరాన్ దాడిపై కీలక ప్రకటన చేసిన ట్రంప్..
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై.. ఇరాన్ చేసిన క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఒక్క అమెరికా పౌరుడు కూడా మరణించలేదని స్పష్టం చేశారు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తలకు కారణం ఇరాన్ అంటూ మండిపడ్డారు. తీవ్రవాదాన్ని ఇరాన్ ప్రోత్సహిస్తోందన్నారు. గత వారం ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమానీని అంతం చేశామని.. అసలు ఆ ఉగ్రవాదిని ఎప్పుడో చంపాల్సిందని, ఇప్పటికే ఆలస్యం చేశామన్నారు. సులేమాన్ మృతి.. ఉగ్రవాదులకు గట్టి […]
ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై.. ఇరాన్ చేసిన క్షిపణి దాడులపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఒక్క అమెరికా పౌరుడు కూడా మరణించలేదని స్పష్టం చేశారు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తలకు కారణం ఇరాన్ అంటూ మండిపడ్డారు. తీవ్రవాదాన్ని ఇరాన్ ప్రోత్సహిస్తోందన్నారు. గత వారం ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసీం సులేమానీని అంతం చేశామని.. అసలు ఆ ఉగ్రవాదిని ఎప్పుడో చంపాల్సిందని, ఇప్పటికే ఆలస్యం చేశామన్నారు. సులేమాన్ మృతి.. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికవంటిదని.. ఇరాన్ మాట వినకపోతే కఠిన నిబంధనలు అమలుచేస్తామన్నారు. తాను అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నంతకాలం ఇరాన్‌కు అణ్వాయుధం దక్కనీయనని చెప్పారు.
కాగా, తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. శాంతిని నెలకోల్పొడం కోసం పాటుపడుతున్నామని ఈ సందర్భంగా ట్రంప్ తెలిపారు.