ఇంత ఘోరమా.. ఇంత చిన్న రీజన్‌కి.. 10 వేల ఒంటెలను చంపేస్తారట..
వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఉంది ఆసీస్‌లోని ఒంటెల పరిస్థితి. ఓ వైపు ఇప్పటికే కార్చిచ్చుతో ఆసీస్ అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. వేల ఎకరా అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. మిలియన్ల జంతువులు కార్చిచ్చులో బూడిదైపోయాయి. దాదాపు 12మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారిన ఒంటెలను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఏ ఒకటో రెండో కాదు.. ఏకంగా పదివేల […]
వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు ఉంది ఆసీస్‌లోని ఒంటెల పరిస్థితి. ఓ వైపు ఇప్పటికే కార్చిచ్చుతో ఆసీస్ అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. వేల ఎకరా అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. మిలియన్ల జంతువులు కార్చిచ్చులో బూడిదైపోయాయి. దాదాపు 12మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారిన ఒంటెలను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఏ ఒకటో రెండో కాదు.. ఏకంగా పదివేల ఒంటెలను చంపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సామూహిక ఒంటెలను హతమార్చడానికి ఓ కారణం ఉందంటూ అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం కార్చిచ్చు ఇంకా అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో అదేసమయంలో వేడిని భరించలేక ఒంటెలు ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నాయట. అయితే ఒంటెలు పెద్ద మొత్తంలో నీటిని తీసుకోవడం ద్వారా తమకు తాగడానికి నీరు ఉండటం లేదని అక్కడి ప్రజలు మొత్తుకుంటున్నారట. దీంతో ప్రభుత్వం ఆ ఒంటెలను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వీటిని చంపేందుకు ఆసీస్ హెలికాప్టర్‌లను కూడా ఏర్పాటు చేసింది.