AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nuclear Weapon: ఉక్రెయిన్ – రష్యా యుద్దానికి పరిష్కారం అణుదాడులేనా..?

రష్యాను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్ ను అమెరికా బినామీల వినియోగిస్తోందని, సైనిక విజయం... యూఎస్, నాటో బలగాల జోక్యంతోనే సాధ్యమనే అభిప్రాయం ప్రచారంలో ఉంది.

Nuclear Weapon: ఉక్రెయిన్ - రష్యా యుద్దానికి పరిష్కారం అణుదాడులేనా..?
Putin
Anil kumar poka
|

Updated on: Mar 12, 2023 | 5:08 PM

Share

ఉక్రెయిన్ యుద్ధం చివరికి అణుదాడులతోనే ముగుస్తుందా అంటే అవుననే సమాధానమిస్తున్నాయి అమెరికా నిఘా వర్గాలు. అంతేకాదు రష్యా ప్రజల మద్ధతు పొందేందుకు యుద్ధంలోకి నాటో కుటమిని లాగే ప్రయత్నం పుతిన్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. వార్షిక ముప్పు అధ్యయన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది. రష్యాను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్ ను అమెరికా బినామీల వినియోగిస్తోందని, సైనిక విజయం… యూఎస్, నాటో బలగాల జోక్యంతోనే సాధ్యమనే అభిప్రాయం ప్రచారంలో ఉంది. ఇది రష్యా నుంచి తీవ్ర స్పందనకు దోహదం చేయొచ్చు. ఈ యుద్ధం భౌగోళిక-రాజకీయ స్వరూపాన్ని మార్చుతోంది. చైనా-రష్యాకు పశ్చిమ దేశాలతో ఉన్న సమీకరణలు సైతం మారుతున్నాయి. రష్యా, పశ్చిమ దేశాల మధ్య సైనికపరంగా పెరిగిన ఉద్రిక్తతల వల్ల ప్రపంచానికి ఎప్పూడూ చూడని ప్రమాదం పొంచి ఉందని యూఎస్ నివేదిక తెలిపింది.

చాట్ జీపీటీ సమాధానం: అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గూగుల్ తో పోటీ పడుతూ ఇటీవల మంచి గుర్తింపు తెచ్చుకున్న చాట్ జీపీటీ ఉక్రెయిన్ యుద్దం ముగిసిపోవాలంటే ఏం చేయాలన్న విషయంపై ఆసక్తికర సమాధానం చెప్పింది. తాజాగా భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్ స్వరూప్ మధ్యవర్తిత్వ ప్రణాళిక గురించి చాట్ బోట్ ను అడగ్గా ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడం కోసం ఇరుపక్షాలు కూర్చోని మాట్లాడుకుంటే యుద్ధం ముగించవచ్చని పేర్కొంది. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణలు క్లిష్టమైనవి, సుధీర్ఘకాలంగా కొనసాగుతున్నవి. అయితే చర్చలు, కాల్పుల విరమణ, అధికార వికేంద్రీకరణ, ఇరు దేశాల ఒప్పందాలను పాటించడంపై అంతర్జాతీయ పర్యవేక్షణ, ఆర్థిక సహాకారం, ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించడం, సంస్కృతి-సంప్రదాయాల పరిరక్షణ, సైనిక బలగాల ఉపసంహరణ ఇలా ఈ ఎనిమిది అంశాలు పాటిస్తే యుద్దానికి పరిష్కారం దొరికే అవకాశం ఉందని బదులిచ్చింది. కాగా ఈ జవాబును వికాస్ స్వరూప్ ట్వటర్ లో పోస్ట్ చేశారు