AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veto power: వీటో పవర్ అంటే ఏమిటి.. రష్యా ఎన్నిసార్లు భారత్‌కు అనుకూలంగా దీన్ని ఉపయోగించింది..

ఉక్రెయిన్‌పై రష్యా తన దాడిని తక్షణమే ఆపివేయాలని, దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి..

Veto power: వీటో పవర్ అంటే ఏమిటి.. రష్యా ఎన్నిసార్లు భారత్‌కు అనుకూలంగా దీన్ని ఉపయోగించింది..
Un
Srinivas Chekkilla
|

Updated on: Feb 26, 2022 | 11:08 AM

Share

ఉక్రెయిన్‌పై రష్యా తన దాడిని తక్షణమే ఆపివేయాలని, దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానం చేసింది. దీన్ని రష్యా తన వీటో పవర్‌ ఉపయోగించి అడ్డుకుంది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో UNSCలోని 15 భద్రత మండలి సభ్య దేశాలు ఉండగా.. తీర్మానానికి అనుకూలంగా 11 ఓట్లు వచ్చాయి.  చైనా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గైర్హాజరయ్యాయి. రష్యా ఓటు వేయలేదు. అయితే ఈ ఓటింగ్ ద్వారా రష్యా ఒంటరితనాన్ని చూపించారు. ఈ తీర్మానంపై వీటోలు లేని 193 మంది సభ్యు దేశాలు U.N. జనరల్ అసెంబ్లీలో ఓటు వేయాల్సి ఉంటుంది. భద్రతా మండలి నిర్ణయానికి ప్రతి సభ్య దేశం కట్టుబడి ఉండాలి.

భద్రత మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అవి యూఎస్, యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. ఇవి ఐక్యరాజ్యసమితి స్థాపనలో కీలక పాత్ర పోషించాయి. అందుకే UNలో వీరికి కొన్ని ప్రత్యేక అధికారం. అదే వీటో పవర్.ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం వీటో పవర్ ఉపయోగించిన ఆ తీర్మానం చెల్లదు. శాశ్వత సభ్య దేశం ప్రతిపాదిత తీర్మానంతో పూర్తిగా ఏకీభవించనప్పటికీ, వీటోను వేయకూడదనుకుంటే దూరంగా ఉండాలు. అప్పడు భద్రత మండలిలో 9 ఓట్లు వస్తే ఆ తీర్మానం ఆమోదం పొందుతుంది. UN చార్టర్‌లోని ఆర్టికల్ 27 (3) ప్రకారం, కౌన్సిల్ అన్ని నిర్ణయాలను “శాశ్వత సభ్యుల సమ్మతి ఓట్లతో” తీసుకుంటుంది. వీటో అధికారం చాలా వివాదాస్పదంగా ఉంది.

భారత్‌కు అనుకూలంగా

రష్యా తరచుగా వీటో అధికారాన్ని ఉపయోగించుకునేది. అప్పటి సోవియట్ రాయబారి ఆండ్రీ గ్రోమికో Mr Nyet, వ్యాచెస్లావ్ మోలోటోవ్‌ను Mr వీటో అని పిలుస్తారు. రష్యా ఇప్పటి వరకు146 సార్లు తన వీటో హక్కును ఉపయోగించుకుంది. 1946లో లెబనాన్, సిరియా నుంచి విదేశీ దళాల ఉపసంహరణకు సంబంధించి ముసాయిదా తీర్మానంపై రష్యా వీటో అధికారాన్ని ఉపయోగించింది. రష్యా తన వీటో అధికారాన్ని భారతదేశానికి అనుకూలంగా కూడా ఉపయోగించింది. రష్యా 1957లో కాశ్మీర్ సమస్యపై భారతదేశానికి అనుకూలంగా వీటో అధికారాన్ని ఉపయోగించింది. 1955లో అప్పటి సోవియట్ యూనియన్ నాయకురాలు నికితా క్రుష్చెవ్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారత్‌కు రష్యా అండగా ఉంటుందని చెప్పారు. సైనికీకరణకు సంబంధించి తాత్కాలిక UN బలగాలను ఉపయోగించాలని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పుడు రష్యా భారతదేశానికి అనుకూలంగా వీటో అధికారాన్ని ఉపయోగించింది.

1961లో పోర్చుగల్ గోవాకు సంబంధించి UNSCకి ఒక లేఖ పంపింది. ఆ సమయంలో గోవా పోర్చుగల్ అధికారంలో ఉండగా భారతదేశం ఈ ప్రాంతాన్ని విముక్తి చేసి మన దేశంలో భాగం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఫ్రాన్స్ మాదిరిగా కాకుండా, పోర్చుగల్ భారతదేశంలోని తన భూభాగాలను విడిచిపెట్టడానికి నిరాకరించింది. గోవాలో నిరసనకారులపై కాల్పులు కూడా జరిపింది. నికితా క్రుష్చెవ్‌కు మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఒక టెలిగ్రామ్ పంపారు. అందులో అతను తమ భూభాగంలో వలసవాదం అవుట్‌పోస్ట్‌లను తొలగించడానికి భారతదేశం చర్యలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని కోరారు. పోర్చుగల్ UN చార్టర్‌ను అమలు చేయడానికి ప్రయత్నించింది. భారతదేశం గోవా నుండి తమ బలగాలను ఉపసంహరించుకోవాలని తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చాయి. కానీ రష్యా భారతదేశాన్ని రక్షించడానికి వచ్చింది. తన 99వ సారి వీటో అధికారాన్ని ఉపయోగించి ప్రతిపాదనను తోసిపుచ్చింది. చివరకు డిసెంబర్19, 1961న గోవా.. పోర్చుగల్ పాలన నుండి విముక్తి పొందింది.

1962

రష్యా 1962లో 100వ సారి వీటోను ఉపయోగించింది. ఈసారి కూడా భారతదేశానికి అనుకూలంగా ఉపయోగించింది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి ఒకదానితో ఒకటి నేరుగా చర్చలు జరపాలని UNSCలో ఐరిష్ తీర్మానం భారతదేశం, పాకిస్తాన్‌లను కోరింది. ఏడుగురు UNSC సభ్య దేశాలు దీనికి మద్దతు ఇచ్చాయి. అందులో నాలుగు శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. US, ఫ్రాన్స్, UK, చైనా. భారతీయ ప్రతినిధి బృందం తీర్మానాన్ని ఆమోదించడానికి నిరాకరించింది. రష్యా ప్రతినిధి ప్లాటన్ డిమిత్రివిచ్ మొరోజోవ్ తీర్మానాన్ని రద్దు చేయడానికి వీటో అధికారాన్ని ఉపయోగించారు.

1971

1965లో భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో కాశ్మీర్ సమస్యను UN వద్ద లేవనెత్తారు. భారత ప్రతినిధి బృందం నిరసనగా వాకౌట్ చేసింది. 1971లో కాశ్మీర్ సమస్యపై తీర్మానాలు ప్రతిపాదించినప్పుడు మినహా కాశ్మీర్ సమస్య UNSCలో ఎప్పుడు లేవనెత్తలేదు. కానీ డిసెంబర్ 1971లో బంగ్లాదేశ్‌ను విముక్తి చేయడానికి పాకిస్తాన్‌పై భారతదేశం యుద్ధంలో నిమగ్నమైనప్పుడు రష్యా తన వీటో అధికారాన్ని మూడుసార్లు ఉపయోగించింది.

వీటో అధికారాన్ని UNSCలోని ఇతర శాశ్వత సభ్యులైన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, చైనా, ఫ్రాన్స్‌లు కూడా బాగానే ఉపయోగించాయి. 1970లో US తన మొదటి వీటోను వినియోగించుకుంది. ఇప్పటి వరకు 82 సార్లు వీటో అధికారాన్ని ఉపయోగించింది. 1956లో సూయజ్ సంక్షోభం సమయంలో UK మొదటిసారిగా వీటో అధికారాన్ని ఉపయోగించింది. ఇప్పటి వరకు 31 సార్లు వీటోను వినియోగించుకుంది. ఫ్రాన్స్ 1956లో మొదటిసారి వీటోను ఉపయోగించింది. ఇప్పటివరకు 17 సార్లు ఉపయోగించింది. చైనా 18 సార్లు వీటోను ఉపయోగించింది.

Read Also.. Russia Ukraine War: రాజధాని కీవ్‌పై విరుచుకుపడ్డ రష్యా దళాలు.. కీవ్‌ ఎయిర్‌పోర్ట్‌ హస్తగతం!