Blood Sugar Levels: చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు.. కొత్త డివైజ్‌ను తయారు చేసిన అమెరికా పరిశోధకులు..!

Blood Sugar Levels: ప్రస్తుత కాలంలో డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక డయాబెటిస్‌ బారిన పడిన వారు కనీసం మూడు నెలలకోసారైనా పరీక్షలు..

Blood Sugar Levels: చెమటతో రక్తంలో షుగర్‌ లెవల్స్‌ గుర్తింపు.. కొత్త డివైజ్‌ను తయారు చేసిన అమెరికా పరిశోధకులు..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 19, 2021 | 2:41 PM

Blood Sugar Levels: ప్రస్తుత కాలంలో డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక డయాబెటిస్‌ బారిన పడిన వారు కనీసం మూడు నెలలకోసారైనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ షుగర్‌ లెవల్స్‌ పెరిగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటి వరకు బ్లడ్‌ షుగర్‌ ఎంత ఉందో తెలుసుకునేందుకు మన శరీరం నుంచి కొంత రక్తం తీయాల్సి వచ్చేది. రక్తం తీయాలంటే సూది గుచ్చడం చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. వృద్ధులకైతే మరీ తలనొప్పిగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా పరిశోధకులు తయారుచేసిన డివైజ్‌తో ఎలాంటి రక్తం తీయాల్సిన అవసరమే ఉండదు. కేవలం మన శరీరంపై వచ్చే చెమట ఆధారంగా రక్తంలో చక్కెర స్థాయిలను గుర్తించవచ్చంటున్నారు. ఈ పరికరాన్ని చేతిపై ధరించడం ద్వారా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ను గుర్తించవచ్చు అంటున్నారు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ‘బయోసెన్సర్స్’ బయోఎలక్ట్రానిక్స్’ జర్నల్‌లో ప్రచురించారు.

ఈ డివైజ్‌లో నికెల్‌ మెటల్‌ను ఉపయోగించారు. ఇది రక్తంలో చక్కెరకు సున్నితంగా ఉంటుంది. ఈ డివైజ్‌ తయారీలో బంగారం కూడా వినియోగించారు. దీని కారణంగా ఎవరికైనా అలెర్జీ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని చెబుతున్నారు పరిశోధకులు. ఈ డివైజ్‌ రక్తంతో పోలిస్తే చెమటలోని గ్లూకోజ్‌ 100 రెట్లు ఎక్కువగా గుర్తించడంలో పనిచేస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు ఉన్న పరికరాలు నిర్దిష్ట ఎంజైమ్‌లతో ఆల్కలీన్ ద్రవాలను ఉపయోగించడం వలన చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని పరిశోధనలో తెలిపారు. ఈ డివైజ్‌లో ఎలాంటి ఎంజైమ్‌లు ఉపయోగించలేనందున చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Praising Children: పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..!

Vaccine: ఏయే వ్యాధులకు ఇంకా వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు.. ఎంతో మంది మరణిస్తున్నా.. తయారు కానీ టీకాలు!

Women Health Tips: మహిళలు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ఆ సమస్యలు దూరం..!

ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడి బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడి బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..