Bill Gates: ఉద్యోగిణికి ఆ మెయిల్స్ పంపిన బిల్ గేట్స్.. వద్దని హెచ్చరించిన ఎగ్జిక్యూటివ్స్.. అసలు ఏం జరిగిందంటే..
బిల్ గేట్స్‌కు సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. 2008లో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌లు బిల్ గేట్స్‌ను మహిళా ఉద్యోగికి వెకిలి ఇమెయిల్స్ పంపడం మానేయాలని హెచ్చరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం రాసింది...
బిల్ గేట్స్‌కు సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. 2008లో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్‌లు బిల్ గేట్స్‌ను మహిళా ఉద్యోగికి వెకిలి ఇమెయిల్స్ పంపడం మానేయాలని హెచ్చరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం రాసింది. బిల్ గేట్స్ మిడ్‌లెవల్ ఉద్యోగికి కంపెనీ కొన్ని ఇమెయిల్స్ పంపినట్లు కనుగొన్న తర్వాత మైక్రోసాఫ్ట్ జనరల్ కౌన్సిల్, ఇప్పుడున్న ప్రెసిడెంట్, వైస్ ఛైర్ బ్రాడ్ స్మిత్, మరొక ఎగ్జిక్యూటివ్ గేట్స్‌తో సమావేశమయ్యారని కథనంలో నివేదించింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై మైక్రోసాఫ్ట్‌గానీ, స్మిత్‌గానీ స్పందించేందుకు ఇష్టపడడం లేదు. గేట్స్ కార్యాలయం ఈ ఆరోపణలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాత ఆరోపణలనే తిరగదోడుతున్నారని, దీనివెనుక వాళ్ల స్వలాభం ఉండొచ్చంటూ ఖండించింది. 2019లో బిల్‌గేట్స్ తనతో చాలా ఏళ్లు శారీరక సంబంధం నడిపారంటూ ఓ ఇంజినీర్ రాసిన లేఖ సంచలనం సృష్టించింది. దీనిపై టెక్ దిగ్గజం ఒక చట్టపరమైన సంస్థను నియమించి విచారణ జరిపింది. అయితే గత సంవత్సరం మైక్రోసాఫ్ట్ బోర్డు నుండి గేట్స్ నిష్క్రమించారు. మేలో బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ తమ 27 సంవత్సరాల వివాహాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. వారికి ఆగస్టులో విడాకులు ఖరారయ్యాయి. వీరు ఇప్పటికీ బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను సంయుక్తంగా నడుపుతున్నారు. 2000 వరకు మైక్రోసాఫ్ట్ సీఈఓగా గేట్స్ ఉన్నారు. 2014 వరకు బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు.
Read Also.. Viral Video: 84 ఏళ్ల వయస్సులో విమానం నడిపిన వృద్ధురాలు.. చివరి కోరిక నెరవేర్చిన కొడుకు.. వీడియో వైరల్..