Viral Video: 84 ఏళ్ల వయస్సులో విమానం నడిపిన వృద్ధురాలు.. చివరి కోరిక నెరవేర్చిన కొడుకు.. వీడియో వైరల్..
పార్కిన్సన్స్ అనేది ఒక వ్యాధి. ఇది మనిషి యొక్క కదలికను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి సరైన మందు లేదు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న ఒక మహిళ తన చివరి కోరికను తీర్చమని తన కుమారుడిని కోరింది. దీనికి కుమారుడు అంగీకరించాడు...
పార్కిన్సన్స్ అనేది ఒక వ్యాధి. ఇది మనిషి యొక్క కదలికను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధికి సరైన మందు లేదు. వ్యాధి ముదిరిన దశలో ఉన్న ఒక మహిళ తన చివరి కోరికను తీర్చమని తన కుమారుడిని కోరింది. దీనికి కుమారుడు అంగీకరించాడు. ఇంతకీ ఈ తల్లి కోరిక ఏమిటంటే.. విమానం నడపాలని ఆమె కోరిగి. తన తల్లి చివరి కోరికను ఎర్ల్ గేజ్ నెరవేర్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాజీ పైలట్ అయిన ఆ మహిళ విమానం నడుతుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కొందరిని భావోద్వేగానికి గురి చేసింది. చాలా మంది మహిళలను ఉత్సాహపరిచింది. వీడియోలో 84 ఏళ్ల మైర్తా గేజ్ విమానం యొక్క కాక్‌పిట్ లోపల కుర్చుని ఫైట్ నడపడం చూడవచ్చు. ఆమె కుమారుడు ఎర్ల్, వెనుక నుండి వీడియో రికార్డ్ చేసి, తన తల్లిని ప్రోత్సహిస్తూనే ఉన్నాడు.
విమానం నడపాలనే మైర్తా కోరికను పైలట్ కోడి మాటిఎల్లో ఆమోదించారు. అతను తోటి విమానయానదారునికి సహాయం చేయడానికి అంగీకరించాడు. ” కొన్ని రోజుల క్రితం ఈ అద్భుతమైన మహిళ యొక్క చివరి కోరిక నెరవేరింది. ఆమె తను మళ్లీ విమానం నడపాలని నాకు సహాయం చేయమని అడిగారు. ఆమె తన యవ్వనంలో పైలట్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె పార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నారు. ఆమె 84 ఏళ్ల వయసులో ఉన్నందున నిబంధనలు ఆమెను విమాన అనుమతి ఇవ్వవు ”అని మాటిఎల్లో చెప్పారు. 84 ఏళ్ల వయస్సులో మైర్తా గేజ్ విమానం నడిపి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also.. Live Video: కదులుతున్న రైలు నుంచి దిగేందుకు యత్నించిన గర్భిణీ.. క్షణాల్లో స్పందించి కాపాడిన కానిస్టేబుల్..