AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుణ గ్రహంపై ఆక్సిజన్ తయారు చేసిన నాసావారి రోవర్ ‘పర్సేవేరెన్స్’, సరికొత్త ‘సృష్టి’

అమెరికాలోని  నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం అరుణ గ్రహంపైకి పంపిన రోవర్ ' పర్సేవేరెన్స్'.. చరిత్ర సృష్టించింది. ఈ గ్రహంపై మొదటిసారిగా ఆక్సిజన్ తయారు చేసింది.

అరుణ గ్రహంపై ఆక్సిజన్ తయారు చేసిన నాసావారి రోవర్ 'పర్సేవేరెన్స్', సరికొత్త 'సృష్టి'
Us Nasa Perseverance Mars Rover Makes Oxygen On Mars
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Apr 22, 2021 | 10:31 AM

Share

అమెరికాలోని  నాసా అంతరిక్ష పరిశోధనా కేంద్రం అరుణ గ్రహంపైకి పంపిన రోవర్ ‘ పర్సేవేరెన్స్’.. చరిత్ర సృష్టించింది. ఈ గ్రహంపై మొదటిసారిగా ఆక్సిజన్ తయారు చేసింది. అరుణ గృహ వాతావరణం నుంచి కొంత కార్బన్ డై ఆక్సైడ్ ని తీసుకుని దీన్ని ఆక్సిజన్ గా మార్చింది. మరో గ్రహంపై ఇలా జరగడం ఇదే తొలిసారని నాసా ప్రకటించింది. ఆరు  చక్రాలున్న ఈ రోవర్..కార్బన్ డై ఆక్సైడ్ ని ఆక్సిజన్ గా మార్చడంలో తీసుకున్న  క్రిటికల్ ఫస్ట్ స్టెప్ అని నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ డైరెక్టరేట్ శాస్త్రజ్ఞుడు జిమ్ రాయిటర్ అభివర్ణించారు. దీనివల్ల భవిష్యత్తులో అంగారక గ్రహాన్ని విజిట్ చేసే వ్యోమగాములు శ్వాస తీసుకోగలుగుతారని  ఆయన వ్యాఖ్యానించారు. పైగా రిటర్న్ జర్నీ కోసం అనవసరంగా భూమి నుంచి ఆక్సిజన్ తీసుకువెళ్లేందుకు రాకెట్ ప్రొపెల్లర్లను వినియోగించుకునే భారం తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. రాకెట్ ఇంధనం కోసం ఫ్యూచర్ రీసెర్చర్లు ఆక్సిజన్ ని తయారు చేయాల్సి ఉంటుంది. వారికి కూడా ఈ గ్రహంపై శ్వాస తీసుకోవడానికి వీలవుతుందని నాసా తెలిపింది.

అంగారక గ్రహం పై గల ఆక్సిజన్ ని ఈ రోవర్ ఫ్రంట్ రైట్ సైడ్ లో ..కారు బ్యాటరీ సైజులో ఉన్న గోల్డెన్ బాక్స్ లో నిక్షిప్తం చేశారు. దీన్ని ‘మెకానికల్ ట్రీ’ గా పేర్కొంటున్నారు. కార్బన్ డై ఆక్సైడ్ పరమాణువులను వెదజల్లేందుకు ఈ బాక్సు విద్యుత్ ని,  కెమిస్ట్రీని వినియోగించుకుంటుంది.   బై ప్రాడక్టుగా ఇది కార్బన్ మోనాక్సయిడ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 గ్రాముల ఆక్సిజన్ ని  తయారు చేస్తుందని, ఓ వ్యోమగామి 10  నిముషాల పాటు శ్వాస తీసుకోవడానికి ఇది సరిసమానమని నాసా తెలిపింది. ఈ బాక్సుకు సంబంధించిన ఇంజనీర్లు మరిన్ని పరీక్షలు జరిపి..ఔట్ ఫుట్ ను పెంచడానికి కృషి చేస్తున్నారు. గంటకు 10 గ్రాముల ఆక్సిజన్ ని జనరేట్ చేయాలన్నది వీరి లక్ష్యం. గత ఫిబ్రవరి 18 న ఈ రోవర్ అంగారక గ్రహంపై దిగింది. దీని  మినీ హెలికాఫ్టర్ ఇటీవలే ఈ గ్రహంపై ఎగిరి  కొత్త చరిత్రకు నాంది పలికింది. మరిన్ని చదవండి ఇక్కడ : తెలంగాణలో షర్మిల సక్సెస్ అవుతారా? ఒక జయలలిత మమతా బెనర్జీ లా షర్మిల మిలిగిపోతారా ?:The Rajinikanth Show Video. New Covid Sintomas:ఈ ఐదు మెయిన్ కోవిడ్ లక్షణాలు… క్రిటికల్ సిట్యూషన్స్ వీడియో.. అత్యంత ప్రమాదకరంగా కొత్త కరోనా