AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Mysterious Pneumonia: చైనా నుంచి అమెరికాకు సోకిన వింత వ్యాధి.. ఆసుపత్రులకు క్యూ కటుతోన్న పిల్లలు

అమెరికాలోని ఒహియోలో పెద్ద సంఖ్యలో పిల్లలు మిస్టీరియస్‌ న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీంతో పిల్లలు అధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మిస్టీరియస్‌ న్యుమోనియా వ్యాధి చైనాలో కూడా గరిష్ట స్థాయిలో ఉందని, అక్కడ కూడా పిల్లలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మాత్రమే చైనా న్యుమోనియా వ్యాధి వ్యాప్తి చెందినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. వారెన్ కౌంటీ హెల్త్‌ ఆఫీషియల్స్‌ ప్రకారం..

China Mysterious Pneumonia: చైనా నుంచి అమెరికాకు సోకిన వింత వ్యాధి.. ఆసుపత్రులకు క్యూ కటుతోన్న పిల్లలు
China Mysterious Pneumonia
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2023 | 11:38 AM

ఒహియో, డిసెంబర్ 1:  అమెరికాలోని ఒహియోలో పెద్ద సంఖ్యలో పిల్లలు మిస్టీరియస్‌ న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీంతో పిల్లలు అధిక సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మిస్టీరియస్‌ న్యుమోనియా వ్యాధి చైనాలో కూడా గరిష్ట స్థాయిలో ఉందని, అక్కడ కూడా పిల్లలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో మాత్రమే చైనా న్యుమోనియా వ్యాధి వ్యాప్తి చెందినట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. వారెన్ కౌంటీ హెల్త్‌ ఆఫీషియల్స్‌ ప్రకారం.. ఆగస్టు నుంచి వైట్ లంగ్ సిండ్రోమ్ అని పిలువడుతోన్న ఈ వింత వ్యాధికి సంబంధించి 142 న్యుమోనియా కేసులు నమోదయ్యాయి. ఓహియోలో ఈ సంఖ్య సగటు కంటే అధికంగా ఉండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో పీడియాట్రిక్ న్యుమోనియా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ వ్యాధి బారీన పడిన పిల్లల సగటు వయస్సు ఎనిమిది ఏళ్లుగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది.

ఓహియో వైద్యులకు వైట్ లంగ్ సిండ్రోమ్ సవాలుగా మారిందని వారెన్ కౌంటీకి చెందిన ఓ అధికారి బుధవారం (నవంబర్ 29) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాధి చైనాలో వ్యాపిస్తోన్న వ్యాధిని పోలి ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో మరెక్కడా కేసులు నమోదు కాలేదని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC)కి చెందిన నివేదిక తెలిపింది. చిన్నారుల్లో అనారోగ్యానికి గల కారణాలపై ఒహియో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కొత్త శ్వాసకోశ వ్యాధి మాత్రం కాదని ఒహియో చెబుతున్నారు. ఒకే సమయంలో బహుళ వైరస్‌ల వ్యాప్తి వల్ల వైట్‌ లంగ్‌ సిండ్రోమ్‌కు కారణమవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. సగటున 8 మంది రోగుల్లో 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మైకోప్లాస్మా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో హానికరమైన వైరస్లు ఊపిరితిత్తుల సంక్రమణకు కారణమవుతున్నట్లు తెలిపారు.

నెదర్లాండ్స్, డెన్మార్క్‌లలో న్యుమోనియా హెచ్చరిక

ఒక అధ్యయనం ప్రకారం, మహమ్మారి సమయంలో లాక్‌డౌన్, మాస్క్‌లు ధరించడం, పాఠశాలలను మూసివేయడం వల్ల పిల్లల రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గింది. అందువల్ల వారిలో కాలానుగుణ ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంది. చేతులు క్రమం తప్పకుండా కడుక్కోవడం, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు నోటిని కవర్ చేయడం, అనారోగ్యంతో ఉంటే ఇంట్లోనే ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాప్తిని నిరోధించడానికి అవకాశం ఉంటుందని వారెన్ కౌంటీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో జ్వరం, దగ్గు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్ లలో కూడా న్యుమోనియా కేసులు పెరుగుతున్నట్లు తెలిపారు. దీంతో అనేక యూరోపియన్ దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
మార్కెట్‌ను రూల్ చేస్తున్న టాలీవుడ్‌.. వారు ఎక్కడ వెనుకబడ్డారు.?
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్లు వసూలు చేశాడు.. చివరకు..
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 12కోట్లు వసూలు చేశాడు.. చివరకు..
తండ్రికి బైక్ గిఫ్ట్‌ ఇద్దామని బయల్దేరింది.. కానీ ఇచ్చేలోపే..
తండ్రికి బైక్ గిఫ్ట్‌ ఇద్దామని బయల్దేరింది.. కానీ ఇచ్చేలోపే..
ఎండురొయ్యలను ఇష్టంగా తింటున్నారా..?ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు
ఎండురొయ్యలను ఇష్టంగా తింటున్నారా..?ఏమౌతుందో తెలిస్తే షాక్ అవుతారు