PM Modi: 21 గంటలు దుబాయ్‌లో గడపనున్న మోదీ.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..

దేశ ప్రధాని నరేంద్రమోదీ దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. గురవారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి దుబాయ్ వెళ్లారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయుుల మోదీ, మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే దుబాయ్ పర్యటనలో మోదీ ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

PM Modi: 21 గంటలు దుబాయ్‌లో గడపనున్న మోదీ.. ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారంటే..
Pm Modi To Spend 21 Hours In Dubai, Delivering 4 Speeches At World Climate Summit, Know Full Schedule
Follow us
Srikar T

|

Updated on: Dec 01, 2023 | 12:24 PM

దేశ ప్రధాని నరేంద్రమోదీ దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. గురవారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి దుబాయ్ వెళ్లారు. అక్కడ మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయుుల మోదీ, మోదీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే దుబాయ్ పర్యటనలో మోదీ ఏఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అరబ్ దేశంలో మోదీ మొత్తం 21 గంటలు గడపనున్నారు. ముందుగా శుక్రవారం జరిగే రెండు వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌ ఈవెంట్స్‌లో పాల్గొంటారు. ఆ తరువాత నాలుగు చోట్ల దౌత్య పరమైన అంశాలపై ప్రసంగించనున్నారు. ఆ తరువాత అక్కడి పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన ఏడు ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు.

యూఏఈతో భాగస్వామ్య ఒప్పందం చేసుకోవడం వల్ల ఇంధన రంగంలో భద్రతతో పాటూ, బలాన్ని పెంచుకోవచ్చు అని ప్రధాని తెలిపారు. గ్లోబల్ సోలార్ ఫెసిలిటీకి మద్దతు ఇవ్వడం వల్ల ఒకరి బలాన్ని ఒకరు పెంపొందించుకునేందుకు వీలుంటుందన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్, యూఏఈలు మంచి సుసంపన్నమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు దోహదపడుతుందన్నారు. ఇరు దేశాలు ఇంధన రంగంలో చేతులు కలపడం ద్వారా రీ ప్రొడక్టివ్ శక్తిని ప్రోత్సహించేందుకు వీలు పడుతుందని చెబుతూ.. యూఏఈలో తాను ఆరవ సారి పర్యటిస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా అభివ‌ృద్ది చెందుతున్న దేశాలు ఏవైనా సమస్యల్లో ఉంటే వాటిని పరిష్కరించడంలో భాగం కావాలని, దీనికి తాను సుముఖంగా ఉన్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా అవసరమైన ఆర్థిక, సాంకేతికతను ఒకరికొకరు అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు.

గ్లోబల్ సౌత్‌కి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎక్కడా రాజీపడకూడదని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఈమధ్య కాలంలో ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సమావేశాలను గుర్తు చేశారు. ఇలా వివిధ దేశాలు కలిసి మాట్లాడుకోవడం ద్వారా దేశంలో పెట్టుబడుల స్థాయి బిలియన్ డాలర్ల నుంచి ట్రిలియన్ డాలర్లుగా పెరుగుతుందన్నారు. ఇలా పెట్టుబడులలో వచ్చిన గణనీయమైన మార్పును చూసి తాను ఆనందిస్తున్నట్లు తెలిపారు. యూఏఈ వేదికగా జరిగే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌28 (UAE COP28)లో భారత్ కు ఆహ్వానం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం తరఫున తాను ప్రాతినిధ్యం వహించినందుకు ప్రత్యేకంగా సంతోషిస్తున్నానని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే దీని కోసం యూఏఈ ప్రభుత్వం అందించిన చొరవను అభినందిస్తున్నానన్నారు. ఈ సంవత్సరంలోనే జూలై, డిశంబర్ నెలల్లో రెండు సార్లు యూఏఈ సందర్శించే అవకాశం కల్పించినందుకు ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. యుఏఈకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి దుబాయ్‌లోని హోటల్ బయట ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. డయాస్పోరా సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు చేస్తూ, ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’, ‘వందేమాతరం’ అనే నినాదాలు చేశారు. హోటల్‌లో ప్రవేశించే ముందు డయాస్పోరా సభ్యులు కరచాలనం చేస్తూ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. తన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌ (ట్విట్టర్)లో దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీని కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, బంధాలకు ఈ ప్రవాస వాసులే నిదర్శనమని అన్నారు. “దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీ నుండి వచ్చిన సాదర స్వాగతం పట్ల లోతుగా చలించిపోయారు మోదీ.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..