Narendra Modi: దుబాయ్‌లో నరేంద్రమోదీ.. ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం..
మొన్నటి వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన మోదీ గురువారం రాత్రి దుబాయ్ వెళ్లారు. కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్ 28వ సమ్మిట్‌లో భారత ప్రధాని పాల్గొననున్నారు. శుక్రవారం జరగనున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ.
మొన్నటి వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన మోదీ గురువారం రాత్రి దుబాయ్ వెళ్లారు. కాన్ఫెరెన్స్ ఆఫ్ పార్టీస్ 28వ సమ్మిట్‌లో భారత ప్రధాని పాల్గొననున్నారు. శుక్రవారం జరగనున్న వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్‌లో ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. యుఏఈకి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి దుబాయ్‌లోని హోటల్ బయట ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతరం సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. డయాస్పోరా సభ్యులు ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు చేస్తూ, ‘అబ్కీ బార్ మోదీ సర్కార్’, ‘వందేమాతరం’ అనే నినాదాలు చేశారు. హోటల్‌లో ప్రవేశించే ముందు డయాస్పోరా సభ్యులు కరచాలనం చేస్తూ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
యుఏఈలో ప్రధాని మోదీని కలిసినందుకు భారతీయ ప్రవాసులు ఆసక్తి చూపించారు. ఈ సందర్బంగా సంతోషం వ్యక్తం చేస్తూ, “నేను 20 ఏళ్లుగా యుఏఈలో నివసిస్తున్నాను, కానీ ఈ రోజు నా స్వంత వ్యక్తి ఈ దేశానికి వచ్చినట్లు అనిపించింది” అని చెప్పారు. “ప్రధాని మోదీని ఇక్కడ చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది” అని, “ఈ రోజును తమ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేము” అని అన్నారు.
తన సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ (ట్విట్టర్)లో దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీని కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మన సంస్కృతి, బంధాలకు ఈ ప్రవాస వాసులే నిదర్శనమని అన్నారు. “దుబాయ్‌లోని భారతీయ కమ్యూనిటీ నుండి వచ్చిన సాదర స్వాగతం పట్ల లోతుగా చలించిపోయారు మోదీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ప్రారంభ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..