ఆకలి సంక్షోభంలో 50 లక్షల మంది ప్రజలు, పోషకాహార లోపంతో 7 లక్షల మంది పిల్లలు..

శుక్రవారం UN భద్రతా మండలి ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశ ఉత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేసిందని, ప్రజల జీవనోపాధి, పని తీరు ప్రభావితమయ్యాయని, ప్రజలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాపారం దివాలా తీసే స్టేజ్ చేరుకుందని..  దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దేశంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలసి వస్తుంది ఈ కారణాల వలన సూడాన్‌లో ఆకలి స్థాయి పెరుగుతోంది.

ఆకలి సంక్షోభంలో 50 లక్షల మంది ప్రజలు, పోషకాహార లోపంతో 7 లక్షల మంది పిల్లలు..
Sudanese GirlImage Credit source: Luis Taco/AFP
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2024 | 11:39 AM

గత ఏడాది నుంచి కొనసాగుతున్న యుద్ధం కారణంగా సూడాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం కారణంగా సూడాన్‌లో 5 మిలియన్ల మంది ప్రజలు భయంకరమైన ఆకలి బాధితులుగా మారవచ్చని, దేశం ఆకలి, కరువు వైపు పయనించవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. 730,000 మంది సూడానీస్ పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని UN సహాయ చీఫ్ చెప్పారు. రానున్న నెలల్లో సూడాన్‌లో సుమారు 5 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆకలిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

శుక్రవారం UN భద్రతా మండలి ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశ ఉత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేసిందని, ప్రజల జీవనోపాధి, పని తీరు ప్రభావితమయ్యాయని, ప్రజలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాపారం దివాలా తీసే స్టేజ్ చేరుకుందని..  దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దేశంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్ళవలసి వస్తుంది ఈ కారణాల వలన సూడాన్‌లో ఆకలి స్థాయి పెరుగుతోంది.

ఇవి కూడా చదవండి

తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్న 730,000 మంది పిల్లలు

“తక్షణ మానవతా సహాయం అందించాలని సూచిస్తున్నారు. ప్రాథమిక అవసరాలు లేకుండా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 మిలియన్ల మంది ప్రజలు రాబోయే నెలల్లో తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటారు” అని గ్రిఫిత్స్ పేర్కొన్నారు. క్షీణించిన భద్రత కారణంగా పశ్చిమ, సెంట్రల్ డార్ఫర్‌లో కొంతమంది ప్రజలు కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన అన్నారు. “పార్టీలు ఇప్పుడు యుద్ధాన్ని ఆపాలి .. పౌరులను రక్షించాలి” అని గ్రిఫిత్స్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో తెలిపారు. దాదాపు 730,000 మంది సూడానీస్ పిల్లలు .. డార్ఫర్‌లో 240,000 కంటే ఎక్కువ మంది పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఆయన అన్నారు.

యుద్ధానికి కారణం

ఏప్రిల్ 15, 2023న సుడానీస్ సాయుధ దళాల (Sudanese armed force) చీఫ్ అబ్దేల్ ఫట్టా అల్-బుర్హాన్ , అతని మాజీ డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (Rapid Support Forces) కమాండర్ ల మధ్య అధికారం కోసం యుద్ధానికి బీజం పడింది. ఆ తర్వాత దేశంలో యుద్ధం ప్రారంభం కావడంతో సూడాన్‌లో వేలాది మంది చనిపోయారు. దేశం నుండి దాదాపు 8.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలామంది పొరుగున ఉన్న చాద్, దక్షిణ సూడాన్‌లకు తమ నివాసాన్ని మార్చుకున్నారు.

కాల్పుల విరమణ తిరస్కరణ

దేశంలో కాల్పుల విరమణ పరిస్థితి కనుచూపు మేరలో లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. గత వారం, UN భద్రతా మండలి ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైన తరువాత కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. అయితే SAF కాల్పుల విరమణను తిరస్కరించింది . అంతేకాదు ఇప్పుడు నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుండి RSF ఉపసంహరించుకుంటేనే దాడులను ఆపివేస్తామని చెప్పింది. మార్చి 12న, సుడాన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఓమ్‌దుర్మాన్‌లోని నేషనల్ రేడియో, టెలివిజన్ భవనాన్ని SAF స్వాధీనం చేసుకుంది. దేశంలోని 50 మిలియన్ల జనాభాలో సగం మందికి సహాయం అవసరమని.. 18 మిలియన్ల మంది కరువు బాటలో ఉన్నారని గ్రిఫిత్స్ చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..