Donald Trump: నేను ఈసారి ఎన్నిక కాకపోతే.. రక్తపాతం జరుగుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరోసారి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేపబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒహియోలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ఎన్నికలు అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని ట్రంప్ అన్నారు. తనను ఎన్నుకోకపోతే రక్త ప్రవాహం జరుగుతుందని బెదిరించాడు.
మరోసారి ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఆసక్తిని రేపబోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒహియోలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ఎన్నికలు అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని ట్రంప్ అన్నారు. తనను ఎన్నుకోకపోతే రక్త ప్రవాహం జరుగుతుందని బెదిరించాడు. “నవంబర్ 5ని గుర్తుంచుకోండి. ఈ రోజు మన దేశానికి చరిత్ర సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను” అని ట్రంప్ అన్నారు. అమెరికాలో ఈసారి జరుగబోయే ఎన్నికల్లో 2020 పునరావృతం కానుంది. మరోసారి జో బిడెన్, డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి పోరులో తలపడ్డారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకదాని తర్వాత మరొకటి గెలుస్తూ అధ్యక్ష ఎన్నికల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. ఇప్పుడు భయంకరమైన బెదిరింపులు ఇచ్చాడు. ఈ ఎన్నికల్లో రక్తపాతం తప్పదని బెదిరించారు.
మెక్సికోలో కార్లను తయారు చేసి అమెరికన్లకు విక్రయించాలనే చైనా ప్రణాళికలను ఆయన విమర్శించారు, “నేను ఎన్నికైతే, వారికి ఆ కార్లను విక్రయించే అవకాశం లేదు. అదే సమయంలో, జో బిడెన్ అమెరికా చెత్త అధ్యక్షుడిగా పేర్కొన్న ట్రంప్.. “నేను ఈసారి ఎన్నిక కాకపోతే, రక్తపాతం జరుగుతుంది” అని అంటూ హెచ్చరికలు జారీ చేశాడు. ఇక బిడెన్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కూడా ట్రంప్ విమర్శించారు. “మిలియన్ల కొద్దీ వలసదారులకు పని అనుమతి ఇవ్వడం ద్వారా బిడెన్ ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లను పదేపదే వెన్నుపోటు పొడిచాడు” అని ట్రంప్ విమర్శించారు.