AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Microplastics: తల్లిపాలలో ప్లాస్టిక్ రేణువులు.. సర్వేలో షాకింగ్ విషయాలు.

Microplastics: తల్లిపాలలో ప్లాస్టిక్ రేణువులు.. సర్వేలో షాకింగ్ విషయాలు.

Anil kumar poka
|

Updated on: Mar 16, 2024 | 3:42 PM

Share

ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‎లో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‎తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం అంశంపై చేసిన తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన లైఫ్‎లో ప్లాస్టిక్ ఒక భాగం అయిందని మనం అనుకుంటున్నాం.. కానీ ప్లాస్టిక్ మన శరీరంలోనే భాగం అయిపోయింది.

ప్లాస్టిక్ మన రెగ్యులర్ లైఫ్‎లో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్‎తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం అంశంపై చేసిన తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మన లైఫ్‎లో ప్లాస్టిక్ ఒక భాగం అయిందని మనం అనుకుంటున్నాం.. కానీ ప్లాస్టిక్ మన శరీరంలోనే భాగం అయిపోయింది. అమెరికా, ఆస్ట్రియా దేశాల తాజా పరిశోధనలో షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ ఉపయోగం మానవ జాతి మనుగడకు ముప్పులా మారింది. ప్లాస్టిక్‎లో ఉండే అత్యంత సూక్ష్మరూపంలో ఉండే ప్లాస్టిక్ రేణువులు గాలిలో చేరుతున్నాయి. ,మనం తీసుకునే డ్రింక్, ఫుడ్ ద్వారా నీరు, ఆహారంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల రేణువులు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయం ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దుష్ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంత కంటే డేంజర్‎గా తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు పరిశోధకులు. తల్లి పాల ద్వారా అప్పుడే పుట్టిన పిల్లలకు ఆహారంగా ప్లాస్టిక్ రేణువులు మారుతున్నాయి అనే భయంకర విషయాన్ని గుర్తించారు.

దీంతో పాటు మగవారి వీర్య కణాలలోకూడా మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లను గుర్తించారు పరిశోధకులు. దీని ద్వారా సంతానోత్పత్తిపై కూడా ప్లాస్టిక్ ప్రభావం చాలానే ఉందని తెలిపారు. తాజా ఫలితాలను బట్టి..30 మంది పురుషుల నుంచి సేకరించిన వీర్యకణాలను విశ్లేషించగా.. 11 నమూనాల్లో మైక్రోప్లాస్టిక్‎ను గుర్తించినట్టు తెలిపారు. మనం రోజూ వాటర్ తాగే లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీనిని బట్టి పురుషుల సంతానోత్పత్తి సామర్త్యంపై ప్లాస్టిక్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow Us