హిందూ, క్రైస్తవ బాలికలను ఎత్తుకుపోయి.. బలవంతంగా..

పాకిస్థాన్ ఇమ్రాన్‌ ప్రభుత్వ తీరుపై ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చాలా వివక్షాపూరితమైన చట్టాన్న తీసుకొచ్చిందంటూ ఫైర్ అయ్యింది. మతపరమైన అల్ప సంఖ్యాకులపై దాడులు చేయడానికి.. ఇమ్రాన్ ప్రభుత్వం ఏర్పడినట్లైందని పేర్కొంది. పాక్‌లోని పాకిస్థాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ ప్రభుత్వ పాలనపై ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘పాకిస్థాన్ – దాడికి గురవుతున్న మత స్వేచ్ఛ’’ అన్న పేరుతో విడుదలైన ఈ నివేదికలో అనేక విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీలను అణగదొక్కడంతో […]

హిందూ, క్రైస్తవ బాలికలను ఎత్తుకుపోయి.. బలవంతంగా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 16, 2019 | 4:48 AM

పాకిస్థాన్ ఇమ్రాన్‌ ప్రభుత్వ తీరుపై ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం చాలా వివక్షాపూరితమైన చట్టాన్న తీసుకొచ్చిందంటూ ఫైర్ అయ్యింది. మతపరమైన అల్ప సంఖ్యాకులపై దాడులు చేయడానికి.. ఇమ్రాన్ ప్రభుత్వం ఏర్పడినట్లైందని పేర్కొంది. పాక్‌లోని పాకిస్థాన్ తెహరీక్-ఏ-ఇన్సాఫ్ ప్రభుత్వ పాలనపై ఓ నివేదికను విడుదల చేసింది.

‘‘పాకిస్థాన్ – దాడికి గురవుతున్న మత స్వేచ్ఛ’’ అన్న పేరుతో విడుదలైన ఈ నివేదికలో అనేక విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌లో మతపరమైన మైనారిటీలను అణగదొక్కడంతో పాటు.. రాజకీయ బలం పెంచుకోవడానికి ప్రభుత్వాలు దైవ దూషణ చట్టాలను ఉపయోగించుకుంటున్నారని పేర్కొంది. ఈ క్రమంలో ఆయుధాల వినియోగంతో పాటు.. వివిధ అంశాలపై రాజకీయాలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

దైవ దూషణ చట్టాలను, అహ్మదీయ వ్యతిరేక చట్టాన్ని ఇస్లామిక్ సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని.. ఈ చట్టాలను ఆసరాగా చేసుకుని.. అల్ప సంఖ్యాకులను హింసిస్తున్నట్లు పేర్కొంది. హిందువులు, క్రైస్తవులు దాడులకు గురవుతున్నారని.. ముఖ్యంగా హిందూ, క్రైస్తవ మహిళలు, బాలికలు బాధితులుగా మిగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా వందల మంది హిందూ, క్రైస్తవ బాలికలను బలవంతంగా ఎత్తుకుపోయి.. మతం మార్చుతూ ముస్లిం యువకులతో వివాహాలు చేస్తున్నారంటూ వెల్లడించింది.

ఈ క్రమంలో బాధిత మహిళలు, బాలికలు తిరిగి సొంతవారిని చేరుకుంటామనే ఆశను కూడా కోల్పోతున్నారని తెలిపింది. వీరిని అపహరించినవారు తీవ్రంగా బెదిరిస్తుండటమే దీనికి కారణమని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇలా చేసే వారిపై పోలీసులు కూడా చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదిన.. మతపరమైన మైనారిటీల పట్ల పోలీసులు, న్యాయ వ్యవస్థ వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఈ నివేదికలో వివరించింది. కాగా, ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సాంఘిక మండలిలో భాగంగా సీఎస్‌డబ్ల్యూ కూడా పని చేస్తోంది.