‘ మిస్ వరల్డ్-2019 ‘ గా జమైకా సుందరి..
జమైకాకు చెందిన టోనీ యాన్ సింగ్ ఈ ఏడాదికి గాను ‘ మిస్ వరల్డ్ ‘ గా ఎంపికయింది. లండన్ లో అట్టహాసంగా జరిగిన వేడుకలో ఆమె 111 దేశాలకు చెందిన భామలను ఓడించి అందాల రాణి అయింది.. ఆర్గనైజర్ పీటర్ యాండ్రే, నటి మేగన్ యంగ్ మూడు వారాలపాటు నిర్వహించిన సంరంభం ఆదివారం ముగిసింది. ఇది 69 వ యాన్యువల్ కాంపిటీషన్ అని, ఇన్ని దేశాల అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషమని నిర్వాహకులు […]
జమైకాకు చెందిన టోనీ యాన్ సింగ్ ఈ ఏడాదికి గాను ‘ మిస్ వరల్డ్ ‘ గా ఎంపికయింది. లండన్ లో అట్టహాసంగా జరిగిన వేడుకలో ఆమె 111 దేశాలకు చెందిన భామలను ఓడించి అందాల రాణి అయింది.. ఆర్గనైజర్ పీటర్ యాండ్రే, నటి మేగన్ యంగ్ మూడు వారాలపాటు నిర్వహించిన సంరంభం ఆదివారం ముగిసింది. ఇది 69 వ యాన్యువల్ కాంపిటీషన్ అని, ఇన్ని దేశాల అందాల భామలు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషమని నిర్వాహకులు అంటున్నారు.
గత ఏడాది విన్నర్‌గా నిలిచిన మెక్సికో సుందరి వనేసా డీ లియోన్.. టోనీ యాన్ సింగ్ తలపై కిరీటాన్ని ఉంచింది. ఈ పోటీలకు పయర్స్ మోర్గాన్ జడ్జిగా వ్యవహరించారు. మిస్ వరల్డ్ గా తన పేరు ప్రకటించగానే టోనీ సంబరాల్లో మునిగిపోయింది. తనకు ఈ టైటిల్ దక్కుతుందని ఊహించలేదని వ్యాఖ్యానించింది.