Zelensky: కీలక నిర్ణయం తీసుకున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. చైనాతో మంతనాల దిశగా అడుగలు.

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోన్నా.. ఇప్పటికీ పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఈ యుద్ధంలో ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగినా, అత్యధికంగా నష్టపోయింది మాత్రం ఉక్రెయినే. ప్రాణనష్టంతోపాటు దేశం మొత్తం అతలాకుతలైపోయింది...

Zelensky: కీలక నిర్ణయం తీసుకున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. చైనాతో మంతనాల దిశగా అడుగలు.
Zelensky
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 26, 2023 | 9:10 AM

ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది గడుస్తోన్నా.. ఇప్పటికీ పరిస్థితులు మాత్రం పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. ఈ యుద్ధంలో ఇరువైపులా భారీ ప్రాణనష్టం జరిగినా, అత్యధికంగా నష్టపోయింది మాత్రం ఉక్రెయినే. ప్రాణనష్టంతోపాటు దేశం మొత్తం అతలాకుతలైపోయింది. ఎటుచూసినా పెనువిధ్వంసమే. రష్యా బాంబుల మోతకి తన రూపురేఖల్నే కోల్పోయింది ఉక్రెయిన్‌. అయితే, ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి.

ఇలాంటి సమయంలోనే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశంకానున్నట్టు తెలిపారు. శాంతి ప్రణాళికలో భాగంగానే జిన్‌పింగ్‌తో భేటీకి కావాలనుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. రష్యాకి చైనా ఆయుధాలు సప్లై చేస్తోందన్న వార్తల నేపథ్యంలో జెలెన్‌స్కీ ప్రకటన సంచలనంగా మారింది. జిన్‌పింగ్‌తో భేటీ కోసం ఇప్పటికే చైనా సమాచారం పంపారు. అయితే, చైనా వైపు నుంచి ఇంకా రిప్లై రాకపోవడం ఉత్కంఠ రేపుతోంది.

ఇదిలా ఉంటే రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఇప్పటికే చైనా శాంతి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. అయితే, చైనా విడుదల చేసిన పీస్‌ స్టేట్‌మెంట్‌లో ఉక్రెయిన్‌ నుంచి రష్యా దళాలను ఉపసంహరించుకోవాలన్న మాట లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. కానీ, చైనా శాంతి ప్రతిపాదనను ప్రకటన విడుదల చేసింది. ఇదే టైమ్‌లో జిన్‌పింగ్‌తో భేటీకావాలనుకుంటున్నట్లు జెలెన్‌స్కీ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే, రష్యాకు ఆయుధాలు ఇవ్వొద్దని చెప్పడానికే చైనా ప్రెసిడెంట్‌ని కలవాలనుకుంటున్నట్టు సమాచారం సమాచారం అందుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..