Turkiye: టర్కీ పేరు తుర్కియోగా మారింది. అసలు పేరెందుకు మార్చాల్సి వచ్చిందంటే..!

టర్కీ పేరు మార్చాలని చాన్నాళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఓ గట్టి నిర్ణయం తీసుకుందని టర్కీ రేడియో అండ్ టెలివిజన్‌ కార్పొరేషన్‌ చెబుతోంది. పోయిన జనవరిలో హలో తుర్కియా పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది.

Turkiye: టర్కీ పేరు తుర్కియోగా మారింది. అసలు పేరెందుకు మార్చాల్సి వచ్చిందంటే..!
Turkey Name Change
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 03, 2022 | 12:26 PM

నేములో నేమున్నది అని షేక్స్‌పియర్‌ అన్నాడే కానీ.. అంతా పేరులోనే ఉందనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు. పేరులోనే పెన్నిధి అనేది వారి నిశ్చితాభిప్రాయం. కుటుంబరావు అని పేరున్న పెద్ద మనిషికి అసలు పిల్లలే కలగకపోవచ్చు. సరస్వతి అని పేరు పెట్టుకున్నామెకు చదువే అబ్బకపోవచ్చు. లక్ష్మీపతి దగ్గర రూపాయి కూడా ఉండకపోవచ్చు. లాజిక్కులు చెప్పకండి. మాంచి పేరుండటం మాకు గొప్పేనండి. అదే మాకు గర్వకారణం కూడానూ అని అంటారు కొందరు. ఇదిగో ఈ కోవలోకే వస్తుంది టర్కీ అనే దేశం కూడా! ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు తమ దేశం పేరు బాగోలేదని పాలకులకు తెలిసి వచ్చింది. అసలు టర్కీ అనేది ఓ పక్షి పేరు. పక్షి పేరు పెట్టుకోవడంలో తప్పేమిటి అని కొశ్చన్‌ వేయవచ్చు. టర్కీ అనే పదానికి నానా అర్థాలున్నాయి. ఇంగ్లీషు నిఘంటువు తిరగేస్తే ఫెయిల్యూర్‌, మూర్ఖుడు, సిల్లీఫెలో అనే అర్థాలు కనిపిస్తాయి. ఇలాంటి అర్థాలున్నప్పుడు ఎవరికైనా పేరు మార్చుకోవాలనే అనిపిస్తుంది. అందుకే టర్కీ పేరు మార్చాలని చాన్నాళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఓ గట్టి నిర్ణయం తీసుకుందని టర్కీ రేడియో అండ్ టెలివిజన్‌ కార్పొరేషన్‌ చెబుతోంది. పోయిన జనవరిలో హలో తుర్కియా పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. రీ బ్రాండింగ్‌ ప్రక్రియలో భాగంగా అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తుర్కియో పేరును ప్రమోట్‌ చేయడం మొదలు పెట్టింది. ఇక నుంచి టర్కీ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై మేడ్‌ ఇన్‌ తుర్కియో అని ఉంటుందే తప్ప మేడిన్‌ టర్కీ అని ఉండదు. తమ కొత్త పేరును గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి కూడా టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆల్‌రెడీ ఓ ప్రపోజల్‌ను పంపింది. ఈ ప్రతిపాదనకు ఐక్య రాజ్య సమితి కూడా ఓకే చెప్పేసింది.

అసలీ పేరు మార్పు ప్రక్రియను అంటే రీబ్రాండింగ్‌ను దేశ అధ్యక్షుడు రెచప్‌ టయ్యప్‌ ఎర్దోవాన్‌ ఎప్పుడో మొదలు పెట్టారు. దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలకు టర్కీ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తమ దేశం పేరును తుర్కియోగా పిలవాలని అధ్యక్షుడు ఎర్దోగాన్‌ ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతీ సంప్రదాయాలు, ఘనమైన చరిత్ర, గొప్ప నాగరికత, విలువలకు తుర్కియో అన్న పదమే సూటవుతుందని ఎర్దోవాన్‌ అంటున్నారు. ఇక టర్కీ అనే పేరు చరిత్రలో మిగిలిపోనుంది. దేశం పేరును మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనమేమీ లేదన్నది ఆ దేశవాసులలో చాలా మందికి ఉన్న భావన. టర్కీ ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో ఉందని, దీన్నుంచి తమ దృష్టిని మరల్చడానికే పేరు మార్పును ముందుకు తెచ్చారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఎర్దోవాన్‌ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని విపక్షాలు అంటున్నాయి. తమ బాగోగులను పట్టించుకోకుండా ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పేరు మారిస్తే తప్పేముంది? పర్షియా ఇరాన్‌ కాలేదా? సియామ్‌ థాయ్‌లాండ్‌గా మారలేదా? గ్రీస్‌తో పడకపోవడంతో మాసిడోనియా నార్త్‌ మాసిడోనియాగా రూపాంతరం చెందలేదా? అంటూ ఎర్దోవాన్‌ మద్దతుదారులు ప్రశ్నలను సంధిస్తున్నారు.

Latest Articles
వామ్మో.! ఇదేం వయ్యారం రా బాబు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
వామ్మో.! ఇదేం వయ్యారం రా బాబు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
ఇలా అయ్యింది ఏంటి..? బుచ్చయ్య చౌదరిపై మహిళ ఆగ్రహం
ఇలా అయ్యింది ఏంటి..? బుచ్చయ్య చౌదరిపై మహిళ ఆగ్రహం
గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
గుంటూరు రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు
ఓవెన్‌లో వీటిని మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా.? చాలా డేంజర్‌
ఓవెన్‌లో వీటిని మళ్లీ మళ్లీ వేడి చేస్తున్నారా.? చాలా డేంజర్‌
వామ్మో.. ఇతనేంటి ఇలా ఉన్నాడు..! నోటి నిండా పళ్లే..32 కాదు 64
వామ్మో.. ఇతనేంటి ఇలా ఉన్నాడు..! నోటి నిండా పళ్లే..32 కాదు 64
ఏపీలో ప్రారంభ‌మైన ఓటింగ్ ప్రక్రియ.. వీరికి మాత్రమే అవకాశం..
ఏపీలో ప్రారంభ‌మైన ఓటింగ్ ప్రక్రియ.. వీరికి మాత్రమే అవకాశం..
సిల్కర్ స్క్రీన్‌పై 'అన్నామలై'.. బయోపిక్‌లో ఆ స్టార్ హీరో
సిల్కర్ స్క్రీన్‌పై 'అన్నామలై'.. బయోపిక్‌లో ఆ స్టార్ హీరో
'ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసింది.. అతనే ఈ వరుస ఓటములకు కారణం'
'ఈ సీజన్‌లో ముంబై కథ ముగిసింది.. అతనే ఈ వరుస ఓటములకు కారణం'
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!
కింగ్‌ కోబ్రా.. తన గుడ్ల జోలికి వస్తే ఇట్టాగే ఉంటుంది మరీ..!
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్