Turkey Earthquake: ఓ వైపు ప్రాణాలకు తెగించి బాధితులకు సాయం.. మరోవైపు దోపిడీ.. టర్కీలో దౌర్భాగ్య పరిస్థితులు
గత సోమవారం టర్కీ, సిరియాలో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా, ఇప్పటివరకు 28000 మందికి పైగా మరణించగా, 80 వేల మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు పలు ప్రాంతాలల్లో అందినకాడికి దోచేసుకున్నారు కొందరు దొంగలు
సోమవారం టర్కీ, సిరియాలో సంభవించిన తీవ్రమైన భూకంపం కారణంగా.. ఇప్పటివరకు 28000 మందికి పైగా మరణించారు. 80 వేల మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఓ వైపు రెస్క్యూ సిబ్బంది శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి కష్టపడుతుంటే.. సందట్లో దొరికిందే సందు అంటూ కొందరు చేతి వాటం గాళ్లు చేతికి అందింది దోచుకుని పోతున్నారు. విపత్తులో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అవకాశంగా మార్చుకుని దోపిడీ చేస్తున్న 48 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత సోమవారం వచ్చిన తీవ్ర భూకంపం తర్వాత వీరు అనేక దోపిడీకి పాల్పడ్డారు. టర్కీ అధికారిక మీడియా సంస్థ శనివారం ఈ మేరకు సమాచారాన్ని ఇచ్చింది. సోమవారం భూకంపం తర్వాత అక్కడ పరిస్థితులను అవకాశంగా తీసుకుని ఎనిమిది వేర్వేరు ప్రావిన్సుల్లో నిందితులను దోపిడీలకు పాల్పడ్డారు. దీంతో వీరిని అరెస్టు చేసినట్లు అనడోలు వార్తా సంస్థ తెలిపింది.
దొంగలను అణచివేస్తున్న: అధ్యక్షుడు టర్కీ దొంగలను అణిచివేస్తామని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ గతంలో ప్రతిజ్ఞ చేశారు. భూకంపం సంభవించిన దియార్‌బాకిర్ ప్రావిన్స్‌ను సందర్శించారు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ . ఈ సందర్భంగా ప్రస్తుతం మూడు నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతుందని గుర్తు చేశారు. అంతేకాదు.. ఇక నుంచి దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడే వారిపై తీసుకునే చర్యలు తీవ్రంగా ఉండనున్నాయని హెచ్చరించారు ఎర్డోగన్. భూకంపం కారణంగా ప్రభావితమైన ఆగ్నేయ టర్కీలోని 10 ప్రావిన్సులలో మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించైనా సంగతి తెలిసిందే.
ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేస్తోన్న భారత సైన్యం టర్కీ, సిరియాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ‘ఆపరేషన్ దోస్త్’ పేరుతో భారత్ చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా ఇండియన్ రెస్క్యూ టీమ్ ఇరు దేశాల్లోనూ యుద్ధప్రాతిపదికన పని చేస్తోంది. భారత్ రెండు దేశాలకు మందులు, సహాయక సామగ్రిని పంపింది. టర్కీ , సిరియాలో భూకంపం తర్వాత కూడా, శిధిలాల నుండి చనిపోయినవారిని నిరంతరం బయటకు తీస్తున్నారు. భూకంపం తాకిడికి గురైన టర్కీలో కూలిన భవనం శిథిలాల నుంచి ఎనిమిదేళ్ల బాలికను భారత్ బృందం సురక్షితంగా బయటకు తీశారు. NDRF బృందం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..