AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: మాటలకందని విషాదం.. ఊహకందని ఉత్పాతం.. భూకంపం ధాటికి 46వేలు దాటిన మృతులు

ప్రకృతి బీభత్సానికి టర్కీ, సిరియాలు వివవిల్లాడిపోయాయి. రెండు వారాల క్రితం తెల్లవారు జామున వచ్చిన పెను భూకంపం ధాటికి రెండు దేశాలూ కకావికలమయ్యాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జనాలు...

Earthquake: మాటలకందని విషాదం.. ఊహకందని ఉత్పాతం.. భూకంపం ధాటికి 46వేలు దాటిన మృతులు
Earthquake1
Ganesh Mudavath
|

Updated on: Feb 20, 2023 | 7:42 AM

Share

ప్రకృతి బీభత్సానికి టర్కీ, సిరియాలు వివవిల్లాడిపోయాయి. రెండు వారాల క్రితం తెల్లవారు జామున వచ్చిన పెను భూకంపం ధాటికి రెండు దేశాలూ కకావికలమయ్యాయి. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. జనాలు శిథిలాల కిందే ప్రాణాలు కోల్పాయారు. ఈ విపత్తు ధాటికి.. రెండు దేశాల్లో కలిపి చనిపోయిన వారి సంఖ్య 46 వేలు దాటింది. టర్కీలోనే 40 వేలకు మందికి పైగా మృతి చెందారు. సిరియాలో 5800 కు పైగా చనిపోయారు. భూకంపం సంభవించిన నాటి నుంచి సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది.. తాజాగా.. సహాయక చర్యలను ముగిస్తామని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకటించింది. ఒకవేళ శిథిలాల కింద ఎవరైనా ఉన్నా.. వారు ఇప్పటివరకు ప్రాణాలతో ఉండే అవకాశం లేదనేది మింగుడుపడని వాస్తవం. ఫిబ్రవరి 6వ తేదీన భూకంపం సంభవించిన తర్వాత కూడా 11 ప్రావిన్సుల్లో వేల ప్రకంపనలు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకు 6,040 ప్రకంపనలు సంభవించినట్లు ఏఎఫ్‌ఏడీ వెల్లడించింది.

భూకంపం కారణంగా 1,05,794 భవనాలు ప్రభావితం అయ్యాయి. ఇప్పటికే 20,662 భవనాలు పూర్తిగా కూలిపోయాయి. టర్కీతో పాటు సిరియాలోనూ ఆస్తినష్టం భారీగానే ఉంటారు. సిరియాలోనూ భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుందని వెల్లడించింది. భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టం కావడంతో అక్కడి పర్యావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య సదుపాయాలు దెబ్బతినడంతో వ్యాధుల భయం నెలకొంది. ఇప్పటికే అంటువ్యాధులు పెరిగినప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉందన్నారు వైద్యులు.

మరోవైపు.. టర్కీలో సహాయక చర్యల కోసం భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ దోస్త్‌’ ముగిసింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) చివరి బృందం స్వదేశానికి చేరుకుంది. మూడు బృందాల్లో మొత్తం 151 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, డాగ్‌స్క్వాడ్‌లు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం