Earthquake: జపాన్‌లో కంపించిన భూమి.. రియాక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదు..
జపాన్‌లోని హక్కైడోలో భూకంపం సంభవించింది. రియాక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది.

జపాన్‌లోని హక్కైడోలో భూకంపం సంభవించింది. రియాక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం, భూకంప కేంద్రం ఒబిహిరో సిటీకి 9 కి.మీ దూరంలో 112 కి.మీ లోతులో ఉంది. ఒబిహిరో 173,000 మంది జనాభా కలిగిన నగరం. వార్త రాసే వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
గత ఏడాది కూడా జపాన్‌లో పలుమార్లు భూకంపం సంభవించింది. కొన్నిసార్లు 7.3, మరికొన్ని సార్లు 6.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నమోదైంది. ఈ భూకంపాలలో కొందరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అదే సమయంలో 2011లో జపాన్‌లో అతిపెద్ద భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో దాదాపు 18 వేల మంది చనిపోయారు.
భూకంపాలు ఎందుకు, ఎలా సంభవిస్తాయి?
భూమి లోపల ఉండే ప్లేట్లు ఢీకొనడం వల్ల భూకంపం సంభవిస్తుంది. మన భూమి 12 టెక్టోనిక్ ప్లేట్లపై ఉందని జియాలజిస్టులు చెబుతున్నారు. ఈ ప్లేట్లు ఢీకొన్నప్పుడు విడుదలయ్యే శక్తిని భూకంపం అంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భూమి కింద ఉన్న ఈ ప్లేట్లు చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ ప్లేట్లు వాటి స్థలం నుంచి 4-5 మి.మీ. జరుగుతుంటాయి. ఈ సమయంలో ఒక ప్లేట్ మరొకదానికి దూరంగా జరగవచ్చు, లేదా మరొక దాని కిందకు జారిపోవచ్చు. ఈ సమయంలో, ప్లేట్లు ఢీకొనడం వల్ల భూకంపం సంభవిస్తుంది.




భూకంపం వస్తే ఏం చేయాలి?
అన్నింటిలో మొదటిది, భూకంపం సంభవించినప్పుడు భయపడకుండా ఉండాలి.
త్వరగా సమీపంలోని టేబుల్ కిందకు వెళ్లి దాక్కోవాలి. ప్రకంపనలు ఆగే వరకు, టేబుల్ కింద ఉండాలి.
భూకంప ప్రకంపనలు ఆగిన వెంటనే ఇల్లు, కార్యాలయం లేదా గది నుంచి బయటకు వెళ్లాలి.
భూకంపం సమయంలో వాహనం లోపల ఉంటే, వెంటనే వాహనాన్ని ఆపి, ప్రకంపనలు ఆగే వరకు లోపల ఉండాలి.
బయటకు వచ్చే సమయంలో లిఫ్ట్‌ని ఉపయోగించవద్దు. బయటకు వచ్చిన తర్వాత చెట్లు, గోడలు, స్తంభాలకు దూరంగా ఉండాలి.
