Climate Change: అదే మన దేశంలో అయితే అరిచి గగ్గోలు పెట్టేవారు.. ఒహియో రైలు ఘటన మరో ‘చెర్నోబిల్ 2.0’నా?
ఒహియో రైలు ఘటన అనంతరం అక్కడ ఏర్పడిన విపత్కర పరిస్థితులను "చరిత్రలో అతిపెద్ద పర్యావరణ విపత్తు" లేదా "చెర్నోబిల్ 2.0" అంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 1986 అణు విపత్తు వలే, ఇది కూడా ఒకటి..

ఓ చిన్న ప్రమాదం.. ప్రకృతి బీభత్సాన్ని సృష్టించింది. అగ్రదేశం అమెరికాలో జరిగిన ఓ రైలు ప్రమాదం ఘటన.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓహియోలో రెండు వారాల క్రితం టన్నుల కొద్ది ప్రమాదకర పదార్థాలను తీసుకువెళుతున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన అనంతరం పేలుడు సంభవించడంతోపాటు.. ఆ ప్రాంతమంతా కాలుష్యంతో నిండిపోయింది. గాలి, నీరు కలుషితమయ్యాయి. విష పదార్థాల కారణంగా ఉపరితల జలాలు, మట్టి అంతా రసాయనాలమయంగా మారింది. నీటిలో ఉన్న వేలాది చేపలు చనిపోయాయి. దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరిఅవుతున్నారు. ఈ ఘటనపై రాజకీయాలు సైతం ప్రారంభమయ్యాయి. ఈ విపత్తుపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు ఈ పరిస్థితిని “చరిత్రలో అతిపెద్ద పర్యావరణ విపత్తు” లేదా “చెర్నోబిల్ 2.0” అంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 1986 అణు విపత్తు వలే, ఇది కూడా ఒకటి అంటూ పేర్కొంటున్నారు. కాగా.. రైలు ఘటన జరిగిన ప్రాంతంతోపాటు దిగువన ఉన్న రాష్ట్రాలకు సేవలందించే ముఖ్యమైన నీటి రిజర్వాయర్లు కూడా కలుషితమవుతాయని పలువురు హెచ్చరిస్తున్నారు.
ఫిబ్రవరి 4న ఒహియో – పెన్సిల్వేనియా సరిహద్దులో ఓ ట్రైన్ పట్టాలు తప్పింది. దాదాపు నాలుగు డజన్ల రైలు భోగిలు పట్టాలు తప్పడంతోపాటు.. మంటలు అంటుకున్నాయి. అయితే, వీటిలో చాలా వరకు విషపూరిత రసాయనాలు ఉండటంతో పేలుడు సంభవించడంతోపాటు.. చుట్టూ ప్రమాదకర స్థాయిలో పొగ కమ్ముకుంది. విష పూరిత రసాయనాలు విడుదలవ్వడంతో అక్కడున్న ప్రాంతం కలుషితమయంగా మారింది. గాలి, నీరు అన్నీ కలుషితమయ్యాయని పేర్కొంటున్నారు. ఇది విపత్తులా మారిందని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కొంతమంది ప్రభుత్వంపై సైతం విమర్శలు గుప్పించారు. ఒహియో పట్టణం చెర్నోబిల్ లాగా కనిపిస్తోందంటూ 1986 ఏప్రిల్ 25 నాటి చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం ఘటనతో పోలుస్తున్నారు. ఈ ప్రమాదంలో నార్ఫోక్ సదరన్ రైలులోని దాదాపు 50 కార్లు ఉండగా, వాటిలో కేవలం పది కార్లలో మాత్రమే ప్రమాదకర పదార్థాలు ఉన్నాయని నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) తెలిపింది. అయితే, వాటిలోని రసాయనాలు ఆ ప్రాంతాన్ని నాశానం చేస్తాయన్న ఊహగానాల మధ్య.. అధికారులు రెస్క్యూ సైతం నిర్వహించారు.




మన దగ్గర జరిగితే..
ఈ ఘటనపై భారత్ లో కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తరచూ ప్రభుత్వాన్ని నిందించే వారు.. ఈ ఘటనపై ఏం మాట్లాడుతారు అంటూ ఉదారావాదులకు ప్రశ్నలు సంధిస్తున్నారు. దీనిపై అభిషేక్ బెనర్జీ ట్వీట్ చేశారు. USలో టన్నుల కొద్దీ విష రసాయనాలను మోసుకెళ్తున్న రైలు పట్టాలు తప్పింది. భారీగా మంటలు చెలరేగడంతోపాటు టాక్సిక్ కెమికల్స్ విడుదలవ్వడంతో సమీపంలోని నదులలో వేలాది చేపలు చనిపోయాయి. అయితే, ఈ ఘటనపై NYT స్పందించింది. పర్యావరణ ప్రమాదాల గురించి అనవసర ప్రచారం చేయవద్దంటూ సూచించింది. అయితే, ఇలాంటి ప్రమాదం భారత్ లో జరిగితే.. కొంతమంది విపక్ష పార్టీల నేతలు, ఉదారవాదులు దేశానికి నష్టం జరుగుతుందంటూ పేర్కొనేవారు.. ఇంకా ప్రభుత్వం వల్లనే ఇలా జరిగిందంటూ బురదజల్లేవారంటూ పలువురు పేర్కొంటున్నారు.
ఆలోచించాలి..
‘‘ఇలాంటి ప్రమాదం భారతదేశంలో జరిగినా.. ఏదైనా పర్యావరణ విపత్తు సంభవించిన ఉదారవాదులు ఎలా అరిచి గగ్గోలు పెడతారో ఆలోచించండి.. “కార్యకర్తల” స్వరం ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది. నీరు, వాయుకాలుష్యంపై ప్రజలు ఆందోళన విరమించాలని నినాదాలు చేస్తున్నారు. గతంలో కొంతమంది ఉదారవాదులు.. గంగా నది క్రూయిజ్‌ను మూసివేయాలని కోరుకున్నారని గుర్తుంచుకోండి.. శబ్దానికి డాల్ఫిన్‌లు, చేపలకు ఆటంకం కలుగుతుందని గొడవ చేశారు. కార్యకర్తలు పెద్ద US కంపెనీల ప్రయోజనాలను పరిరక్షిస్తారు.. ఇప్పుడు NYT ప్రశాంతంగా ఉండండి, దేని గురించి చింతించకండి అని చెప్పింది. “వైల్డ్ స్పెక్యులేషన్” చేయవద్దు భారతదేశంలోని పర్యావరణ సమస్యల గురించి మాత్రమే ఆందోళన చెందుతున్న వారు దీని గురించి ఆలోచించాలి’’.. అంటూ బెనర్జీ ట్వీట్ చేశారు.
Train carrying tons of toxic chemicals derailed in US
Toxic chemicals burned in huge flame
1000s of fish died in nearby rivers
NYT says dont do “wild speculation” about environmental risks
Now think how liberals scream about environmental risk of anything being built in India
— Abhishek (@AbhishBanerj) February 19, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం
