Al Jawahari: అల్ ఖైదా అగ్రనాయకుడు అల్ జవహరీ బతికే ఉన్నాడా.. సంచనంగా మారిన తాలిబన్ల ప్రకటన

అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌ జవహరీ చనపోలేదా.. జవహరీని మట్టు బెట్టినట్లు వస్తున్న వార్తలు నిజం కాదా.. తాలిబన్ల చర్యలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి మరి. అయితే అల్ జవహరీని మట్టుబెట్టినట్లు అమెరికా ప్రకటించిన...

Al Jawahari: అల్ ఖైదా అగ్రనాయకుడు అల్ జవహరీ బతికే ఉన్నాడా.. సంచనంగా మారిన తాలిబన్ల ప్రకటన
Jawahari
Follow us

|

Updated on: Aug 04, 2022 | 1:54 PM

అల్‌ఖైదా అగ్రనాయకుడు అల్‌ జవహరీ చనపోలేదా.. జవహరీని మట్టు బెట్టినట్లు వస్తున్న వార్తలు నిజం కాదా.. తాలిబన్ల చర్యలు చూస్తుంటే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి మరి. అయితే అల్ జవహరీని మట్టుబెట్టినట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ వార్తలపై తాలిబన్లు (Talibans) స్పందించారు. జవహరీ మృతి చెందలేదని ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు ఆధారాలు లేవని చెప్పారు. మృతిపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. కాగా.. కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో అల్‌-జవహరీని చంపినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. 2011లో ఒసామా బిన్‌ లాడెన్‌ను (Bin Laden) మట్టుబెట్టిన తర్వాత అల్‌-ఖైదా పగ్గాలు జవహరీ తీసుకున్నాడు. జవహరీపై అమెరికా 25 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించింది. అయితే.. కాబూల్‌లో జవహరీ చనిపోయినట్లు సంబంధించిన డీఎన్‌ఏ ఆధారాలు లేవని అమెరికా చెప్పింది. అమెరికా, తాలిబన్‌ల పరస్పర ప్రకటనలతో అల్‌ ఖైదా అధినేత అల్ జవహరీ మృతి మిస్టరీగా మారింది.

అయితే.. అల్ జవహరిని అంతమొందించేందుకు అమెరికా ఎప్పటి నుంచో ప్లాన్ వేసింది. సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ పక్కా ప్లాన్ తో జవహరీ ఆచూకీ గుర్తించి దాడి చేసింది. క్షిపణి దాడిలో జవహరిని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి. అమెరికాలో 9/11 దాడుల సూత్రధారి అయిన అల్ జవహరి చాలా సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారు. గతేడాది అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లాక.. ఆ దేశంలో అగ్రనేతల కదలికలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జవహరీ కాబూల్‌లో ఒక సురక్షిత ప్రాంతంలోని ఇంటికి మారినట్టు తెలుసుకుంది. అప్పటి నుంచి CIA అతని కదలికలను గమనించారు. ఆయన అదే ఇంట్లో నివాసముంటున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు.

ఈ సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అందించి, జవహరీ కదలికలపై నిఘా పెట్టారు. అల్ ఖైదా చీఫ్ అల్ జవహరి ప్రతిరోజూ ఉదయం కాబూల్ సేఫ్ హౌస్ బాల్కనీలో కొంతసేపు ఒంటరిగా ఉంటారు. ఈ అలవాటే జవహరీ కొంప ముంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి..

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!