AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Texas Shooting: టెక్సాస్‌ మాల్‌లో బీభత్సం.. దుండగుల కాల్పుల్లో 9 మంది మృతి..

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్‌కు బ్రేకులు పడట్లేదు. ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాల్లో కలుస్తాయో అనే టెన్షన్ కనిపిస్తోంది. తాజాగా టెక్సాస్‌లో.. ఒకే రోజు రెండు చోట్ల జరిగిన కాల్పుల ఘటనలు యూనెటెడ్ స్టేట్స్ లో కలకలం రేపాయి.

Shaik Madar Saheb
| Edited By: |

Updated on: May 07, 2023 | 4:20 PM

Share

అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్‌కు బ్రేకులు పడట్లేదు. ఎప్పుడు ఎవరి ప్రాణాలు గాల్లో కలుస్తాయో అనే టెన్షన్ కనిపిస్తోంది. తాజాగా టెక్సాస్‌లో.. ఒకే రోజు రెండు చోట్ల జరిగిన కాల్పుల ఘటనలు యూనెటెడ్ స్టేట్స్ లో కలకలం రేపాయి. టెక్సాస్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఇద్దరు సైకోలు వీరంగం సృష్టించారు. సడన్‌గా ఎల్లెన్ మాల్‌లోకి చొరబడిన ఇద్దరూ అక్కడ ఉన్న వాళ్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఒక నిందితుడిని హతమార్చారు. ఈ కాల్పుల ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని టెక్సాస్ పోలీసులు పేర్కొంటున్నారు.

ఉత్తర డల్లాస్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని స్ప్రాలింగ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత షాపింగ్ మాల్‌లోని కస్టమర్లు, ఉద్యోగులూ.. పార్కింగ్ లాట్స్‌లోకి పరుగులు తీశారు. మిలిటరీ దుస్తులు ధరించిన ఓ దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.

ఒక్కసారిగా ఎదురైన ఈ హింసాత్మక కాల్పులతో వందలాది మంది మాల్ నుంచి భయాందోళనతో బయటకు పరుగులు పెట్టారు. తనకు కొంచెం దూరంలో ఆగి ఉన్న కారులోంచి ఒక్కసారిగా ఫైరింగ్‌ స్టార్ట్ అయ్యిందని ప్రత్యక్ష సాక్షి శిల్ప చెబుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే ఇంత బీభత్సం జరిగిపోయిందంటున్నారు.

ఇవి కూడా చదవండి

టెక్సాస్‌ అనేది తెలుగువాళ్లు అధికంగా ఉండే ప్రాంతం. ఇక్కడ రెండు లక్షల జనాభా ఉంటే దాదాపు సగం మంది తెలుగు వారే. ఇలాంటి ప్రాంతంలో కాల్పులు జరపడంతో టెన్షన్‌ నెలకొంది. అటు టెక్సాస్ సమీపంలోని ఫ్రిస్కన్‌ ప్రాంతంలో కూడా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. పలువురికి గాయాలు అయ్యాయి. ఒకే రోజు రెండు కాల్పుల ఘటనలతో అక్కడి ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
చర్మం మెరవాలన్నా.. బాడీ ఫిట్‌గా ఉండాలన్నా ఇవి తీసుకోవాల్సిందే..
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
విరిగిన పుర్రె ఎముక .. ఫ్లైదుబాయ్ హీరోకు ఎమర్జెన్సీ ఆపరేషన్
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
భారతదేశ రూపురేఖలు మార్చిన.. ప్రధాని మోదీ 25 విప్లవాత్మక ఆలోచనలు
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
వలపు వల.. నేవీ ఉద్యోగులను మాయ చేసిన పాక్ మహిళా ఏజెంట్లు వీరేనట!
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..