TANA Youth Ideathon: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కాన్ఫరెన్స్ లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో తానా 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో జరగనున్నాయి. దీనిలో భాగంగా తానా కమిటీ తెలుగు వారి కోసం పలు రంగాల్లో పోటీలను నిర్వహించి.. ప్రతిభ ఆధారంగా పురస్కారాలను, బహుమతులు అందించేందుకు సిద్ధమవుతోంది.
అయితే, తెలుగు యువతలోని వినూత్నమైన ఆలోచనలను ఆవిష్కరించేందుకు తానా తొలిసారిగా “యూత్ ఐడియాథాన్” ఒక రోజు పెద్ద ఎత్తున (హ్యాకథాన్) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. TANA యూత్ ఐడియాథాన్.. అర్థవంతమైన నమూనాలను రూపొందించడానికి వారి STEM లెర్నింగ్, కోడింగ్ సామర్థ్యాలను బయటకు తీసుకువచ్చి.. తద్వారా ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను ధైర్యంగా ఎదుర్కొనేలా యువకులను సిద్ధచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
తానా యూత్ ఐడియాథాన్ భవిష్యత్ వ్యాపారవేత్తలకు, ఉన్నత స్థానానికి వెళ్లాలనుకున్న యువతకు ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని తానా యూత్ ఐడియాథాన్‌ను ఏర్పాటు చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న అమెరికాలోని యువకులు ఈరోజే పేరును నమోదు చేసుకోవాలని తానా ప్రతినిధులు ప్రకటనలో కోరారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. యువతను ప్రోత్సహించేందుకు తోడ్పాటునందించాలంటూ కోరారు.
దిగువ ఇచ్చిన లింక్‌ని ఉపయోగించి జూన్ 20, 2023లోపు తానా యూత్ ఐడియాథాన్ లో పాల్గొనేందుకు పేరును నమోదు చేసుకోవాలి.. జూన్ 24న ఈ కార్యక్రమం జరగనుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..