Panjshir Valley: తాలిబన్లకు ఆ ప్రదేశం అంటే వణుకు.. కనీసం కన్నువేయడానికి కూడా వణికిపోతుంటారు.. ఎందుకో తెలుసా..

Panjshir Valley: తాలిబన్లకు ఆ ప్రదేశం అంటే వణుకు.. కనీసం కన్నువేయడానికి కూడా వణికిపోతుంటారు.. ఎందుకో తెలుసా..
Panjshir Valley

ఆఫ్గనిస్తాన్‌లో.. మళ్లీ రాక్షస రాజ్యం మొదలైంది. మతచాందసవాదులు రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రావిన్స్‌లలో కఠిన చట్టాలను అమల్లోకి తీసుకొస్తూ.. పౌరులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. కానీ ఈ దేశంలోని ఓ ప్రదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం వారు వణికిపోతున్నారు. ఇప్పుడే కాదు గతంలోనూ ఇటువైపు చూసేందుకు కూడా భయపడిపోయేవారు. అదే పంజ్‌షీర్‌...

Sanjay Kasula

|

Aug 20, 2021 | 7:25 AM

మనుషుల మీద అయితే నమ్మకం ఉంటుంది.. కానీ నరరూప రాక్షసులుగా ముద్రపడ్డ తాలిబన్లను కూడా ఎవరైనా నమ్మగలరా? ఆ అవకాశమే లేదంటున్నారు ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజలు… గతంలో జరిగిన అకృత్యాలు ఇంకా కళ్లముందున్నాయి. షరియా చట్టాల ముసుగులో సాగించిన దుష్టపాలన ఇంకా మదిలో కదలాడుతూనే ఉంది. ఇలాంటి కలకేయులు అక్కడ అడ్డ వేశారు.  అఫ్ఘనిస్తాన్‌ వారి పాలనలోకి వెళ్లి పోయింది. ఆ దేశంలో గత కొన్ని రోజులుగా బీభత్సం కొనసాగుతోంది. ప్రజలు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్  ప్రతి మూలలో అడుగు పెట్టారు. ఒక వైపు, తాలిబాన్ల ‘జి హుజూరి’తో దేశం మొత్తం కట్టడిలోకి తెచ్చుకున్నారు. ఎదురు మాట్లాడేవారు లేకుండా పోయారు. ఇక వారిదే ఇష్టారాజ్యం. అయితే దేశంలోని చాలా ప్రాంతాలను ఆక్రమించిన ఈ రాక్షసలకు ఓ స్థలం పేరు చెబితేనే వణికిపోతారు. అక్కడికి వెళ్లేందుకు కూడా సాహసం చేయరు. ఆ ప్రదేశం ఉత్తర కూటమిగా పేరున్న  ‘పంజ్‌షీర్ లోయ’ ఇది ఓ బలమైన కోట. పంజ్‌షీర్‌ను ‘పంజ్‌షేర్’ అని కూడా అంటారు. అంటే ‘ఐదు సింహాల లోయ’ అని అర్థం.

ఆఫ్ఘనిస్తాన్‌లోని 34 ప్రావిన్సులలో ఒకటైన పంజ్‌షీర్ లోయ.. విశిష్టతను అంచనా వేయవచ్చు. తాలిబాన్ తన ప్రభావాన్ని ఇక్కడ ఎప్పుడూ వ్యాప్తి చేయలేక పోయారు. ఈ రోజు కూడా లోయ పూర్తిగా సురక్షితంగా ఉంది. 70-80 లలో సోవియట్ యూనియన్ కూడా లోయను ఆక్రమించడానికి ప్రయత్నించాయి. కానీ అది జరగలేదు..

ఆ దేశ రాజధాని కాబూల్ నుంచి 150 కి.మీ దూరంలో ఈ లోయ ఉంటుంది. పంజ్‌షీర్‌ లోయల్లో పంజ్‌షీర్ అనే నది ప్రవహిస్తుంది. అంతే కాదు ఇది హిందూ కుష్ పర్వత సానువుల్లో వాలినట్లుగా పంజ్‌షీర్  ఉంటుంది. ఇక్కడి చేరాలనుకుంటే ప్రధాన రహదారి కూడా ఉండదు. లోయ మొత్తం పచ్చని తివాచి పరిచినట్లుగా ఉంటుంది. ఈ లోయలో అభివృద్ది కార్యక్రమాలను అమెరికా చాలా బాగా చేసింది. వారి ఆధ్వర్యంలో ఇది కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇక్కడ రోడ్లు నిర్మించబడ్డాయి. రేడియో టవర్లు ఏర్పాటు చేయబడ్డాయి. తద్వారా లోయలోని ప్రజలు కాబూల్ చానెల్స్ కార్యక్రమాలను వినవచ్చు.

పంజ్‌షీర్‌ను పట్టుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది

పంజ్‌షీర్‌ను పట్టుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై బాంబు దాడి చేసినప్పుడు కూడా లోయ ఎలాంటి అలజడి కనిపించలేదు. అక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. అయితే, లోయలో విద్యుత్ , నీటి సరఫరా లేదు. అక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఓ జనరేటర్ ఉంది. వాటి ద్వారానే ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తారు.

1996 లో తాలిబాన్ కాబూల్ నియంత్రణలోకి వచ్చినప్పుడు ఉత్తర కూటమి పుట్టింది. దీని పూర్తి పేరు యునైటెడ్ ఇస్లామిక్ ఫ్రంట్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఉత్తర కూటమికి ఇరాన్ , రష్యా, ఉజ్బెకిస్తాన్, టర్కీ, తజికిస్తాన్,  తుర్క్మెనిస్తాన్ మద్దతు ఉంది.

‘మేము పోరాడతాము, లొంగిపోము’

9/11 తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర కూటమి సహాయం కోరింది. ‘మేము పోరాడతాం, లొంగిపోము’ అనే స్ఫూర్తి పంజ్‌షీర్ ప్రజలలో నాటుకుపోయింది. ఒక మిలియన్ కష్టాలు వచ్చినా, పంజ్‌షీర్ ప్రజలు మోకాళ్లపై పడరని ఉగ్రవాదులకు తలవంచబోరని స్థానికుడు చెప్పాడు.

అయితే, రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పంజ్‌షీర్ వ్యక్తి, “ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది” అని తెలిపారు. కానీ తాలిబాన్లు పంజ్‌షీర్ పై ఆంక్షలు విధించవచ్చు. నిత్యావసరాల సరఫరాకు అంతరాయం కలిగించవచ్చు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. పంజ్‌షీర్‌కు ప్రస్తుతం తగినంత ఆహారం, ఔషధ సరఫరా ఉందని ఒక అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి: Sharia Law: షరియా చట్టం అంటే ఏంటి? తాలిబన్లు అమలు చేసే ఈ చట్టంలో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా?

Afghanistan crisis: ఆ విమానంలో నుంచి కింద ప‌డిన ముగ్గురిలో ఇద్దరు అన్నదమ్ములు!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu