Sri Lanka Crisis: ఆర్థిక, రాజకీయ సంక్షోభంపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభం క్లిష్ట దశను దాటుతోంది. రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య దేశ ప్రజలు ఊగిసలాడుతున్నారు. మరోవైపు శ్రీలంక మాజీ అధ్యక్షుడు, శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ప్రకటన చేశారు.

Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభం క్లిష్ట దశను దాటుతోంది. రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య దేశ ప్రజలు ఊగిసలాడుతున్నారు. మరోవైపు శ్రీలంక మాజీ అధ్యక్షుడు, శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ప్రకటన చేశారు. పొలన్నరువాలో తమ పార్టీ నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన ఆదివారం ప్రసంగిస్తూ దేశంలో కొత్త ఎన్నికలకు పిలుపునిచ్చారు.
దేశం పెను విషాదాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో రాజకీయ నాయకులు ప్రజల పక్షం వహించాలని ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అన్నారు. దుకోసం తాను కృషి చేస్తానని సిరిసేన తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే, అతని పార్టీని లక్ష్యంగా చేసుకుంటూ, ‘దేశంలోని అత్యంత ధనవంతుల నుండి అమాయక రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, వెంటనే వైదొలగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా.. ఈ ప్రభుత్వం వెళ్లనందున నేను కూడా వీధుల్లోకి వచ్చానన్నారు. దేశంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను.’ దేశంలో వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాను ఇంట్లో ఉండలేనని అన్నారు. మొరగాకండ రిజర్వాయర్‌తో దేశాన్ని వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించాలని కలలు కన్న పొలన్నరువా రైతులు.. ఇప్పుడు ఒక్క రోజూ కూడా వ్యవసాయం చేయలేకపోతున్నారు. రైతాంగం సమస్యల పరిష్కారానికి ఉద్యమించాల్సి అవసరముందన్నారు.
ప్రస్తుత నాయకుడే ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడాన్ని ప్రస్తావిస్తూ ఇంట్లోనే చనిపోయే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే మూడు లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని, వారి నుంచి ఫోన్లు వస్తున్నాయని అన్నారు. దేశం అంతటా ప్రజలు ఆహారం, ఇంధనం కోసం అలమటిస్తున్నారన్నారు.
Read Also…. TRS vs BJP: అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి విజన్ కొరతే.. మంత్రి KTR విమర్శనాస్త్రాలు
