AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోవిడ్ పై తప్పుడు సమాచారమిస్తున్న సోషల్ మీడియా.. మండిపడిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

కోవిడ్ పైన, వ్యాక్సిన్లపైన సోషల్ మీడియా తప్పుడు సమాచారమిస్తోందని, ప్రజలను ఈ మీడియాయే 'చంపేస్తోందని' అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మండిపడ్డారు...

కోవిడ్ పై తప్పుడు సమాచారమిస్తున్న సోషల్ మీడియా.. మండిపడిన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్
Joe Biden
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jul 17, 2021 | 12:11 PM

Share

కోవిడ్ పైన, వ్యాక్సిన్లపైన సోషల్ మీడియా తప్పుడు సమాచారమిస్తోందని, ప్రజలను ఈ మీడియాయే ‘చంపేస్తోందని’ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మండిపడ్డారు. ‘వాళ్ళు ప్రజలను చంపేస్తున్నారు.. మనకు ఉన్న పాండమిక్ అల్లా దీన్ని ‘వ్యాక్సినేట్’ చేయకపోవడమే అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ లో శుక్రవారం జరిగిన మీడియా మీట్ లో మాట్లాడిన ఆయన..సోషల్ మీడియా తన వైఖరిని సరిదిద్దుకోవాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు-ముఖ్యంగా ఫేస్ బుక్ తన చర్యలను ఒకసారి సమీక్షించుకోవాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి సూచించారు. ఫేస్ బుక్ గానీ, ఇతర మాధ్యమిక సాధనాలు గానీ సమాచారాన్ని విశ్లేషించుకోవడం లేదన్నారు. ఏది తప్పుడు సమాచారం..ఏది కాదు.. అన్న విషయాన్ని మేం పరిశీలిస్తున్నాం.. ముఖ్యంగా ఫేస్ బుక్ ప్రాబ్లమాటిక్ పోస్టులను సేకరించడంలో మునుపటికన్నా ఎక్కువగా ఇప్పుడు రియాక్ట్ కావాలని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్ కి వ్యతిరేకంగా 65 శాతం వరకు తప్పుడు సమాచారం ఇస్తున్న సుమారు 12 మంది ఈ సామాజిక మాధ్యమంలో యాక్టివ్ గా ఉన్నట్టు ఆమె చెప్పారు. కొన్ని మాధ్యమాలు ఈ విధమైన వైఖరిని బ్యాన్ చేశాయి కూడా అన్నారు.

అయితే ఫేస్ బుక్ ప్రతినిధి ఒకరు ఈ ఆరోపణలను ఖండించారు. వాస్తవాల ఆధారంగా లేని ఈ ఆరోపణలను తాము పట్టించుకోబోమన్నారు. తాము ఇస్తున్న సమాచారాన్ని 200 కోట్ల మందికి పైగా ప్రజలు విశ్వసనీయమైనదిగా పరిగణిస్తున్నారన్నారు. పైగా వ్యాక్సిన్ ని ఎలా తీసుకోవాలన్న విషయాన్ని కనుక్కునేందుకు మా వ్యాక్సిన్ ఫైండర్ టూల్ ని 30 లక్షలమందికి పైగా ప్రజలు వినియోగించుకుంటున్నారని ఆ ప్రతినిధి వెల్లడించారు. నిజానికి మేం ప్రజలను కాపాడుతున్నాం అని వివరించారు. అసలు తప్పుడు సమాచారానికి సంబంధించిన 18 మిలియన్లకు పైగా పోస్టులను తొలగించినట్టు ఫేస్ బుక్ ఇదివరకే తెలిపింది. కాగా-అమెరికాలో ఈ నెల 15 న 33 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో ఇవి 70 శాతం పెరిగాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: Monkey Pox: టెక్సాస్ లో వ్యక్తికి మంకీ పాక్స్..తొలి కేసు నమోదు.. ఆందోళనలో అమెరికా

Tips For Common Cold: జలుబు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతుందా.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి