పిల్లల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్స్, సింగపూర్ లో స్కూళ్ళు, జూనియర్ కాలేజీల మూసివేత, ఇళ్ల నుంచే పాఠాల లెర్నింగ్

పిల్లల్లో కొత్త స్ట్రెయిన్స్ వ్యాపిస్తున్న కారణంగా బుధవారం నుంచి సింగపూర్ లో స్కూళ్ళు, కాలేజీలు మూసివేస్తున్నారు. ఇక విద్యార్ధులంతా ఇళ్ల నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఇన్ని నెలలుగా అసలు జీరో కేసులే...

పిల్లల్లో కొత్త వైరస్ స్ట్రెయిన్స్, సింగపూర్ లో స్కూళ్ళు, జూనియర్ కాలేజీల మూసివేత,  ఇళ్ల నుంచే పాఠాల లెర్నింగ్
Singapore Warns News Virus Strains Infecting Children
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 17, 2021 | 6:41 PM

పిల్లల్లో కొత్త స్ట్రెయిన్స్ వ్యాపిస్తున్న కారణంగా బుధవారం నుంచి సింగపూర్ లో స్కూళ్ళు, కాలేజీలు మూసివేస్తున్నారు. ఇక విద్యార్ధులంతా ఇళ్ల నుంచే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఇన్ని నెలలుగా అసలు జీరో కేసులే ఉండగా ఇటీవల లోకల్ ట్రాన్స్ మిషన్లు పెరగడంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేయనుంది. ఈ నెల 28 న స్కూళ్ల టర్మ్ ముగిసేవరకు ప్రైమరీ, సెకండరీ స్కూళ్ళు,జూనియర్ కళాశాలలను మూసివేస్తామని, స్టూడెంట్స్ ఇక ఇళ్లకే పరిమితమై పాఠాలు నేర్చుకోవాలని అధికారులు వెల్లడించారు. నిన్న 38 లోకల్ ట్రాన్స్ మిషన్లకు సంబంధించి కరోనా వైరస్ కేసులను గుర్తించామని, 8 నెలల తరువాత ఇన్ని కేసులను గుర్తించడం ఇదే మొదటిసారి అని వారు చెప్పారు. ఓ ట్యూషన్ సెంటర్ లోని విద్యార్థుల గుంపులోని కొంతమందిలో ఈ కేసులు కనిపించాయట. ఇండియాలోని బీ.1.617 వేరియంట్ ఇక్కడి పిల్లలకు సోకినట్టు కనిపిస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. ఇండియాలోనే మొదట ఈ స్ట్రెయిన్ ని కనుగొన్నారు. విద్యార్థులకు కూడా ఇది సోకుతున్నందున 16 ఏళ్ళ లోపు వారికీ వ్యాక్సిన్ ఇచ్ఛే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. నిజానికి సింగపూర్ లో గత ఏడాది అతి తక్కువ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 61 వేలు నమోదు కాగా 31 మంది రోగులు మరణించారు.

అటు తైవాన్ లో కూడా తాజాగా 333 కరోనా వైరస్ కేసులను కనుగొన్నారు. అక్కడా ఈ నెల 28 వరకు స్కూళ్ళు, కాలేజీలు మూసివేస్తున్నారు. అప్పుడే రాజధాని తైపీలో మెల్లగా వ్యాక్సినేషన్ కార్యక్రమం లాంచ్ చేశారు.

మరిన్ని చదవండి ఇక్కడ: Shekar Master: డ్యాన్సర్‌లందరికీ నేనున్నా… ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా… ( వీడియో )

Viral Video: ఆకాశం నుంచి ఎలుకల వర్షం వట్టి భ్రమేనా..?? అసలు విషయమేమిటంటే… ( వీడియో )