Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Telecommunication Day: పరుగులు పెడుతున్న ప్రసార వ్యవస్థ.. అత్యంత కీలకంగా మారిన టెలి కమ్యూనికేషన్‌

World Telecommunication Day: ఈ రోజుల్లో మానవ జీవితంలో టెలి కమ్యూనికేషన్‌ అత్యంత కీలకంగా మారింది. విద్య, వ్యాపార, ఉపాధి, వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ టెలి కమ్యూనికేషన్‌

World Telecommunication Day: పరుగులు పెడుతున్న ప్రసార వ్యవస్థ.. అత్యంత కీలకంగా మారిన టెలి కమ్యూనికేషన్‌
World Telecommunication Day
Follow us
Subhash Goud

|

Updated on: May 17, 2021 | 5:24 PM

World Telecommunication Day: మానవుని జీవితంలో ప్రస్తుతం టెలికమ్యూనికేషన్‌ అనేది ముఖ్యభాగమైపోయింది. రోజురోజుకు టెలికమ్యూనికేషన్‌ అనేది ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ కమ్యూనికేషన్‌ అభివృద్ధి వల్ల ఎన్నో లాభాలు ఉన్నా.. కొంత నష్టం కూడా ఉంది. ఈ రోజుల్లో మానవ జీవితంలో టెలి కమ్యూనికేషన్‌ అత్యంత కీలకంగా మారింది. విద్య, వ్యాపార, ఉపాధి, వైద్యం ఇలా అన్ని రంగాల్లోనూ టెలి కమ్యూనికేషన్‌ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ రోజుల్లో మానవుడికి నిత్యావసర సరుకుగా మారిపోయింది. తపాలా, టెలిఫోన్‌, టెలిగ్రాం, ఫ్యాక్స్‌, పత్రికలు, రేడియో, టెలివిజన్‌ మొదలైనవి సాంప్రదాయ సమాచార ప్రసార వ్యవస్థలో అంతర్భాగాలు ఉన్నాయి. ఆధునిక సమాచార వ్యవస్థలో వీటితో పాటు మొబైళ్లు, కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌, సమాచార ప్రసార సాధానాలు కూడా అంతర్భాగంలోనే ఉన్నాయని చెప్పాలి. అయితే మే 17వ తేదీన ప్రపంచ టెలి కమ్యూనికేషన్‌ డే నిర్వహించుకుంటున్నాము.

పరుగులు పెడుతున్న నేటి ప్రసార వ్యవస్థలో మానవులకు ఎంతోగానో ఉపగాయాలున్నప్పటికీ.. కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంలో ముఖ్యంగా ఈ ప్రసార సాధనాలను ఉపయోగించుకుని అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంటర్‌నెట్‌ వల్ల ఉపయోగాలున్నా.. కొన్ని నష్టాలు కూడా జరుగుతున్నాయి. నివాసాల మధ్య టెలి కమ్యూనికేషన్‌కు సంబంధించి సెల్‌ టవర్ల నిర్మాణానికి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి.

మొదటి సారిగా టెలిఫోన్‌ సౌకర్యానికి ప్రభుత్వం అనుమతి

1981లో మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్‌కు చెందిన ఓరియంటల్‌ టెలిఫోన్‌ కంపెనీకి దేశంలో టెలిఫోన్‌ సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1982 జనవరి 28న కోల్‌కతా, ముంబై, మద్రాస్‌ టెలిఫోన్‌ ఎక్ఛైంజ్‌లు ఏర్పాటు చేశారు. ప్రపంచంలో టెలి కమ్యూనికేషన్ రంగంలో ప్రస్తుతం భారత్‌ ఎంతో ముందుంది. ప్రసార వ్యవస్థలో ప్రసార సాధానాలు ప్రధానంగా మారాయి. కొత్త సమాచార వ్యవస్థలను ఇన్‌ఫర్మేషన్ హైవేగా పిలుస్తున్నారు. రాగితీగల స్థానంలో ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుళ్ల వాడకం సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది.

ఫైబర్‌ కేబుల్‌ ద్వారా సముద్ర గర్భంలో..

గ్లోబల్‌ టెలికమ్యూనికేషన్‌ రంగంలో 430 దేశాలలో నిరాటకంగా పని చేస్తున్నాయి. ప్రస్తుతం భూమి మీదనే కాకుండా ఫైబర్‌ కేబుల్‌ ద్వారా సముద్రం లోపల కూడా విస్తరించింది. టెలిఫోన్‌ సంకేతాలే కాకుండా టెలివిజన్‌ సంకేతాలు వీడియో చిత్రాలను అత్యంత వేగంగా ప్రసారం చేసేందుకు వీలు కలుగుతుంది. సమాచారం ప్రసారాలు, మల్టీమీడియా సదుపాయం ప్రస్తుతం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది.

టెలి కమ్యూనికేషన్‌ వ్యవస్థ ప్రారంభమైందిలా..

➦ 1851లో కోల్‌కతా డైమాండ్‌ హార్బర్ల మధ్య మొదటి టెలిగ్రాఫ్‌, టెలిఫోన్‌ లైన్‌ ఏర్పాటైంది. ➦ 1881లో కోల్‌కతా మొదటి టెలిఫోన్‌ సర్వీస్‌ ఎక్చైంజ్‌ ప్రారంభమైంది. 1900లో టెలిఫోన్‌, టెలిగ్రాఫ్‌ సేవలు, భారత రైల్వేల వ్యవస్థతో అనుసంధానం చేశారు. ➦ 1902లో దేశంలో వైర్లెస్‌ టెలిగ్రాఫ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ➦ 1913లో సిమ్లాను ఆటోమెటిక్‌ టెలిఫోన్‌ ఎక్ఛైంజ్‌ను ప్రారంభించారు. ➦ 1948లో ఇండియన్‌ టెలిఫోన్‌ వ్యవస్థ ప్రారంభమైంది. ➦ 1953లో టెలెక్స్‌ విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు. ➦ 1960లో మొట్ట మొదటి సారిగా ఎస్‌టీడీ సౌకర్యాన్ని లక్నో -కాన్పూర్‌ మధ్య ప్రారంభించారు. ➦ 1975లో తపాలాశాఖ నుంచి టెలికాన్‌ వ్యవస్థను వేరు చేశారు. ➦ 1980లో శాటిలైట్‌ ఎర్త్‌ స్టేషన్‌ను ప్రారంభించారు. ➦ 1985లో మొబైల్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు.అదే ఏడాదిలో ఢిల్లీ – ముంబై మహానగరాలలో టెలికాం నిగాం లిమిటెడ్‌ ఏర్పాటు చేశారు. ➦ 2000 అక్టోబర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సౌకర్యాన్ని ప్రారంభించారు. ➦ ఇదే ఏడాదిలో ఆగస్ట్‌ 13 నుంచి ప్రైవేటు రంగంలో ఎస్‌టీడీ సేవలు ప్రారంభమయ్యాయి. ➦ 2011 మార్చి 31వ తేదీ నాటికి ఏపీలో 169 వినియోగదారుల సేవా కేంద్రాలు, 4వేలకుపైగా టెలిఫోన్‌ ఎక్ఛైంజ్‌లు ➦ 2002లో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ సంచార సేవక్‌ పథకాన్ని ప్రారంభించారు. ➦ 2003లో యూనివర్సల్‌ లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టి, దీని కోసం టెలిగ్రాఫ్‌ చట్టంలో సవరణ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రారంభం నుంచి మొదటి 9 ఏళ్లలో దేశంలో రూ.48వేల కోట్ల లాభాలను సంపాదించింది. రూ. 28 కోట్ల టర్నోవర్‌, 2.5 లక్షల మంది ఉద్యోగాలున్న అతి పెద్ద ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కొనసాగింది. ➦ మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. ఈ టెలికమ్యూకేషన్‌ వ్యవస్థతో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోంది.

ఇవీ కూడా చదవండి:

Bank Services: బ్యాంకు కస్టమర్లకు హెచ్చరిక.. ఆ రోజు ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం కుదరదు.. ఆర్బీఐ కీలక ప్రకటన

Google Assistant: గూగుల్ అసిస్టెంట్ నుంచి త్వరలోనే కొత్త అప్‌డేట్ .. రంగు రంగుల రూపంలో డార్క్‌ థీమ్‌