Hajj 2023: హజ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. కోవిడ్ రూల్స్ సడలించిన సౌదీ అరేబియా.. దరఖాస్తు ఎప్పటి నుంచి చేసుకోవచ్చంటే..

హజ్ యాత్రికులకు గుడ్‌న్యూస్ చెప్పింది సౌదీ అరేబియా. హజ్ చేయడానికి అన్ని వయో పరిమితులను తొలగించింది.

Hajj 2023: హజ్ యాత్రికులకు గుడ్‌న్యూస్.. కోవిడ్ రూల్స్ సడలించిన సౌదీ అరేబియా.. దరఖాస్తు ఎప్పటి నుంచి చేసుకోవచ్చంటే..
Saudi Arabia
Follow us

|

Updated on: Jan 10, 2023 | 2:53 PM

ప్రపంచం నలుమూలల నుండి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే యాత్రికుల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదని సౌదీ అరేబియా సోమవారం ప్రకటించింది. దేశ హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా మాట్లాడుతూ.. ఈ సంవత్సరం హజ్ యాత్రికుల సంఖ్య, వయోపరిమితి పరిమితులను తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. కరోనా మహమ్మారికి ముందు సంవత్సరాల్లో హజ్ యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున.. ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నట్లుగా తెలిపారు. 2019 లో తీర్థయాత్రలో సుమారు 2.5 మిలియన్ల మంది పాల్గొన్నట్లు తెలిపారు. కరోనా ఆంక్షల కారణంగా తర్వాతి సంవత్సరాల్లో సంఖ్య తగ్గిందన్నారు. ఆ తర్వాత కర్ఫ్యూ సడలింపు తర్వాత వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. అయితే ఈ ఏడాది హజ్ యాత్రికులకు వయోపరిమితి లేదన్నారు. ఈ వివరాలను సౌదీ అరేబియా – హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ట్వీట్  ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

దీంతో భారత్‌లో కూడా హజ్ యాత్రికుల కోసం నిబంధనలను విడుదల చేసింది. అందులో, తీర్థయాత్ర దరఖాస్తు ప్రయాణం జూలై మధ్య వరకు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం జాతీయ లేదా నివాస దృవీకరణ పత్రాలను కలిగి ఉండాలి. కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన రుజువు తప్పనిసరిగా ఉండాలి. అదనంగా, వారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి కనీసం 10 రోజుల ముందు ACYW క్వాడ్రపుల్ మెనింజైటిస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను తీసుకెళ్లాలని సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం