టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీ సెమీస్‌ పోరాడి ఓడిన సాత్విక్‌-చిరాగ్ జోడి..

సెమీస్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జంట తమ అత్యుత్తమ ఆటను బయట పెట్టలేకపోయింది. టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీ ఓడిపోయింది.

  • Rajeev Rayala
  • Publish Date - 9:15 am, Sun, 24 January 21
టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీ సెమీస్‌ పోరాడి ఓడిన సాత్విక్‌-చిరాగ్ జోడి..

సెమీస్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జంట తమ అత్యుత్తమ ఆటను బయట పెట్టలేకపోయింది. టయోటా థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీ ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో మలేసియా జోడీ ఆరోన్‌ చియా, సోవూయి యిక్‌తో జరిగిన పోటీలో సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీ ఓటమిచవిచూసింది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీ మూడుసెట్ల హోరాహోరీ పోరులో పోరాడి ఓడింది. రెండో గేమ్‌లోనూ భారతే తొలుత 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వరుసగా 4 పాయింట్లు సాధించిన మలేసియా జోడీ 7-3తో పైచేయి సాధించింది. 8-8 వద్ద స్కోరు సమమైనా ఆరోన్‌, సోవూయీ వేగంగా ఆడి గేమ్‌తో పాటు మ్యాచునూ గెలిచేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి: 

‘టీమిండియా సింహంలా గర్జిస్తుంది’.. జర జాగ్రత్త ప్లేయర్స్.. స్వాన్ స్వీట్ వార్నింగ్..