శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ కన్నుమూత
శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ కన్నుమూశారు. 2014 నుంచి హార్ట్‌కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో

Lee Kun hee death: శాంసంగ్ ఛైర్మన్ లీ కున్ హీ కన్నుమూశారు. 2014 నుంచి హార్ట్‌కి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కాగా 1942లో కొరియాలోని డేగులో లీ కున్ హీ జన్మించారు. శాంసంగ్ వ్యవస్థాపకుడు, లీ కున్ హీ తండ్రి అయిన లీ బైంగ్ చుల్ మరణం తరువాత 1987లో ఆయన శాంసంగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్ చిప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడంలో శాంసంగ్‌ని ప్రపంచ దిగ్గజ సంస్థగా ఆయన అభివృద్ధి చేశారు. ఆయన మరణంపై పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు.
Read More:
Bigg Boss 4: ప్రేమ మొదలైందన్న అఖిల్.. అలాంటిదేమీ లేదన్న మోనాల్
Bigg Boss 4: అరియానా కాంట్రవర్షియల్ ప్రశ్నలు.. అందరినీ ఆడుకుందిగా