మోస్ట్ వాంటెడ్‌ అల్‌ ఖైదా సీనియర్ టెర్రరిస్ట్‌ హతం

మోస్ట్ వాంటెడ్‌ అల్‌ ఖైదా ఉగ్రవాది అల్‌ మస్రీ హతమయ్యాడు. అతడని ఆప్ఘనిస్తాన్‌ ప్రత్యేక భద్రతా దళం కాల్చి చంపినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ సర్వీసు ప్రకటించింది

మోస్ట్ వాంటెడ్‌ అల్‌ ఖైదా సీనియర్ టెర్రరిస్ట్‌ హతం
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 25, 2020 | 2:04 PM

Terrorist al-Masri death:  మోస్ట్ వాంటెడ్‌ అల్‌ ఖైదా ఉగ్రవాది అల్‌ మస్రీ హతమయ్యాడు. అతడని ఆప్ఘనిస్తాన్‌ ప్రత్యేక భద్రతా దళం కాల్చి చంపినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ సర్వీసు ప్రకటించింది. మధ్య ఘజ్ని ప్రావిన్సులో ఈ ఉగ్రవాదిని హతమార్చినట్లు ఆప్ఘనిస్తాన్ జాతీయ భద్రతా డైరెక్టరేట్ ఓ ట్వీట్‌లో వెల్లడించింది. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు, ఎలా జరిగిందన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.

అయితే ఈజిప్టు జాతీయుడైన అల్ మస్రీని టెర్రరిస్ట్ గ్రూప్‌ అల్‌ ఖైదాలో నంబర్‌ టూగా భావిస్తారు. హుసామ్‌ అబ్దుల్‌ రవూఫ్ పేరుతో ఇతడు మోస్ట్ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ల జాబితాలో ఉన్నాడు. ఓ విదేశీ ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడంతో పాటు.. ఆ సంస్థకు వనరులు అందించి, అమెరికా పౌరులను చంపేందుకు అల్ మస్రీ కుట్ర పన్నాడని ఆ దేశానికి సమాచారం అందింది. దీంతో 2018 డిసెంబర్‌లో అల్ మస్రీ అరెస్ట్‌కు అమెరికా ప్రభుత్వం వారెంట్‌ జారీ చేసింది. ఇదిలా ఉంటే ఆప్ఘనిస్తాన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో అల్‌ మస్త్రీ హత్య జరిగింది.

Read More:

Official: నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’.. సాయి పల్లవి, కృతి శెట్టి ఫిక్స్‌

సెక్స్‌ రాకెట్‌: నటుడు అరెస్ట్‌.. ముగ్గురు బుల్లితెర నటులను కాపాడిన పోలీసులు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu