కెనడా ఇండియా ఫౌండేషన్ నుంచి ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ అందుకున్న సద్గురు.. నగదుని కావేరీ నది పరిరక్షణకు విరాళం..
ప్రఖ్యాత భారతీయ యోగి, ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగదీష్ వాసుదేవ్ కెనడా ఇండియా ఫౌండేషన్ నుంచి 'గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2024' అవార్డును అందుకున్నారు. కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం ద్వారా మానవ చైతన్యాన్ని పెంపొందించడానికి, పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి సద్గురు చేసిన అత్యుత్తమ కృషికి గాను ఈ అవార్డును అందుకున్నారు. సద్గురు నాలుగు దశాబ్దాలుగా అవిశ్రాంత కృషి చేసినందుకు గుర్తింపుగా కెనడా ఇండియా ఫౌండేషన్ ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని చూపిన భారత సంతతికి చెందిన వ్యక్తులకు అందజేస్తారు.

ప్రఖ్యాత భారతీయ యోగి, ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు గత నాలుగు దశాబ్దాలుగా కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం ద్వారా మానవ చైతన్యాన్ని పెంపొందించడానికి , పర్యావరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా కెనడా ఇండియా ఫౌండేషన్ ఆయనను అవార్డుతో సత్కరించింది. గ్లోబల్ ఇండియన్ అవార్డు 2024ను ప్రదానం చేశారు. ఈ అవార్డు ని సద్గురు జగదీశ్ వాసు దేవ్ కు ఇవ్వనున్నట్లు మొదట అక్టోబర్ 2024లో ప్రకటించారు. ఈ అవార్డును మే 22, 2025న టొరంటోలో CIF చైర్ రితేష్ మాలిక్ , జాతీయ కన్వీనర్ సునీతా వ్యాస్, ఇండో-కెనడియన్ నాయకులు, వ్యవస్థాపకులు , కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో అధికారికంగా ప్రదానం చేశారు.

ఈ అవార్డుతో పాటు సద్గురుకు 50,000 CAD మన దేశ కరెన్సీ లో రూ. 31,02,393ల బహుమతిని ప్రదానం చేశారు. అయితే తనకు బహుమతిగా వచ్చిన నగదు మొత్తాన్ని సద్గురు కావేరి నది ప్రక్షాళన కోసం వినియోగించనున్నట్లు ప్రకటించారు. కావేరీ నది పునరుజ్జీవింపజేసి.. తద్వారా ఆ నదీ మీద ఆధారపడి జీవిస్తున్న 84 మిలియన్ల ప్రజల జీవితాలను మార్చడానికి సద్గురు ఒక అడుగు ముందుకు వేశారు. ఈ నగదుని కావేరి కాలింగ్‌కు అంకితం చేశారు.
Wonderful to see the Indian community contributing to the growth and prosperity of both Canada and India. Deeply appreciate your warmth & hospitality. Much Love & Blessings. -Sg @Cif_Official1 @RiteshMalikCan https://t.co/85XfuZ0VLW
— Sadhguru (@SadhguruJV) May 25, 2025
ఈ సందర్భంగా CIF చైర్ రితేష్ మాలిక్ మాట్లాడుతూ.. సద్గురు ప్రపంచ వ్యాప్తంగా భూసారం క్షీణత, వాతావరణ మార్పు, ఆహార నాణ్యత వంటి సవాళ్లకు ఆచరణాత్మక, దీర్ఘకాలిక పరిష్కారాలను అందిస్తున్నారు. వ్యక్తిగత శ్రేయస్సు, స్థిరత్వం, సమ్మిళితత్వంపై సద్గురు చేసే బోధనల నుంచి కెనడా ఎంతో ప్రయోజనం పొందవచ్చని చెప్పారు. యోగా, ధ్యానంపై ఆయన ప్రాధాన్యత కెనడా ప్రజారోగ్య ప్రాధాన్యతలతో, ముఖ్యంగా మానసిక అనారోగ్యం అందించే వ్యవస్థకు ఆయన బోధనలు సంపూర్ణంగా సరిపోతాయని చెప్పారు.
కెనడా ఇండియా ఫౌండేషన్ అనేది కెనడా-భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించిన ప్రజా విధాన ఆలోచనా కేంద్రం. దీని గ్లోబల్ ఇండియన్ అవార్డు మానవాళికి శ్రేష్ఠమైన సేవలను అందించిన భారతీయ వారసత్వ వ్యక్తులకు అందజేస్తుంది. సేవ్ సాయిల్ , కావేరి కాలింగ్ , యాక్షన్ ఫర్ రూరల్ రిజువనేషన్ , ఈశా విద్య వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ, సామాజిక పరివర్తనకు నాయకత్వం వహించిన కాన్షియస్ ప్లానెట్ ఉద్యమం కర్త సద్గురుకు తాజాగా ఈ అవార్డు అందజేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




