AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia McDonald: ‘వుకోసో ఐ తోచ్చా’.. టేస్ట్ అదిరిపోయింది మచ్చా.. ఎగబడి తింటున్న జనాలు..!

Russia McDonald: మెక్‌డొనాల్డ్స్‌ వెళ్లిపోయిందని నిరాశలో ఉన్న రష్యన్లను సరికొత్త రూపంలో బర్గర్లు పలకరించాయి. కొత్త బ్రాండ్‌తో వచ్చిన బర్గర్ల కోసం తొలిరోజే జనం..

Russia McDonald: ‘వుకోసో ఐ తోచ్చా’.. టేస్ట్ అదిరిపోయింది మచ్చా.. ఎగబడి తింటున్న జనాలు..!
Burgers
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 14, 2022 | 5:58 AM

Russia McDonald: మెక్‌డొనాల్డ్స్‌ వెళ్లిపోయిందని నిరాశలో ఉన్న రష్యన్లను సరికొత్త రూపంలో బర్గర్లు పలకరించాయి. కొత్త బ్రాండ్‌తో వచ్చిన బర్గర్ల కోసం తొలిరోజే జనం విరగబడ్డారు. ‘వుకోసో ఐ తోచ్చా’.. రష్యన్ భాషలో చెప్పాలంటే దీని అర్థం రుచికరమైన సమయం. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాతో తమ వ్యాపారాన్ని మూసేసింది అమెరికా కంపెనీ మెక్​డొనాల్డ్స్. అయితే, బర్గర్ల రుచికి అలవాటు పడ్డ రష్యన్లు ఈ వార్తను జీర్ణించుకోలేకపోయారు. మెక్​డొనాల్డ్స్ ఔట్‌లెట్లను మూసేస్తున్న చివరి రోజుల్లో ఎగబడి మరీ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మెక్​డొనాల్డ్స్ బర్గర్లకు తమ దేశంలో ఉన్న ఆదరణ చూసిన రష్యన్‌ వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ ఈ చైన్‌ ఔట్‌లెట్లను నిర్వహించేందుకు ముందుకొచ్చారు. దీంతో రష్యాలో తమ వ్యాపార యాజమాన్య హక్కులను ఆయనకు అమ్మేసింది. అలెగ్జాండర్ గోవర్ వెంటనే మెక్​డొనాల్డ్స్ బ్రాండ్‌ను తొలగించి ‘వుకోసో ఐ తోచ్కా’ బ్రాండ్‌తో వ్యాపారాన్ని ప్రారంభించేశాడు. మాస్కోలోని పలు చోట్ల ఈ ఔట్లెట్లు ఆదివారం నాడు తెరచుకున్నాయి. గ్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక బర్గర్‌, రెండు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ కనిపించేలా డిజైన్‌ చేసిన కొత్త లోగో అందరినీ ఆకట్టకుంటోంది. తొలిరోజునే రష్యన్లు ‘వుకోసో ఐ తోచ్కా’ బర్గర్ల కోసం పోటెత్తారు.

ఇవి కూడా చదవండి

రష్యాలో మెక్​డొనాల్డ్స్‌కు 850 రెస్టారెంట్లతో పాటు 62వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ ఇప్పుడు అలెగ్జాండర్ గోవర్ యాజమాన్యం కిందకే వచ్చారు. త్వరలోనే అన్ని ఔట్లెట్లను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. మెక్​డొనాల్డ్స్ బ్రాండ్‌ మారినా అందులోని మెనూ పాతదే. దీంతో కొత్త కవర్లో పాత బర్గర్లు అని కొందరు చమత్కరిస్తున్నారు. కాగా ‘వుకోసో ఐ తోచ్కా’ మరికొన్ని రుచులను చేర్చబోతోంది.

ఈ వారంలో జాక్‌పాట్‌ కొట్టిన రిలయన్స్‌, టాటా.. ఎంత సంపాదించారు?
ఈ వారంలో జాక్‌పాట్‌ కొట్టిన రిలయన్స్‌, టాటా.. ఎంత సంపాదించారు?
త్రిష ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..
త్రిష ఆస్తులు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది గురూ..
మరో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఈసారి ఆ హ్యాండ్సమ్ హీరోతో..
మరో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన శ్రీలీల.. ఈసారి ఆ హ్యాండ్సమ్ హీరోతో..
ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు మార్పు.. జూన్ 1 నుండి అమలు!
ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నియమాలు మార్పు.. జూన్ 1 నుండి అమలు!
పిల్లలకు ఈ పొదుపు పాఠాలు నేర్పుతున్నారా.. దీని వల్ల ఎన్ని లాభాలో
పిల్లలకు ఈ పొదుపు పాఠాలు నేర్పుతున్నారా.. దీని వల్ల ఎన్ని లాభాలో
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
వాళ్లిద్దరు విడిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది... శ్రుతి హాసన్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
మహిళకు ఎంతకూ తగ్గని కడుపునొప్పి.. టెస్టులు చేసిన డాక్టర్ షాక్
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
90 రోజుల వ్యాలిడిటీతో ఈ 9 చౌక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
IPL 2025: సౌత్ నటితో SRH ఫెయిల్యూర్ ప్లేయర్ చెట్టాపట్టాల్..
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్
సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్