22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే జైలు నుంచి పరార్! పోలీసుల ముమ్మరగాలింపు
అతను 22 ఏళ్లుగా జైల్లో శిక్ష అనుభవించాడు. సరిగ్గా విడుదలకు కొద్దిసేపటి గంటల ముందే పరారైన ఉదంతం ఆసక్తికరంగా మారింది. జైలు నుంచి విడుదల కావడానికి కొన్ని గంటల ముందు పరారీ అయితే పాపం ఊహించలేక తప్పులో కాలేశాడా నేరస్తుడు. రష్యాలోని ఇర్కుట్స్క్ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు..

రష్యా, అక్టోబర్ 1: అతను 22 ఏళ్లుగా జైల్లో శిక్ష అనుభవించాడు. సరిగ్గా విడుదలకు కొద్దిసేపటి గంటల ముందే పరారైన ఉదంతం ఆసక్తికరంగా మారింది. జైలు నుంచి విడుదల కావడానికి కొన్ని గంటల ముందు పరారీ అయితే పాపం ఊహించలేక తప్పులో కాలేశాడా నేరస్తుడు. రష్యాలోని ఇర్కుట్స్క్ సమీపంలో ఉన్న మార్కోవా జైలులో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ విడుదల కావాల్సిన రోజే జైలు నుండి తప్పించుకున్నాడు. అసలెందుకు అలా చేశాడో తెలిసిన పోలీసులు..
రష్యాకు చెందిన కమోల్జోన్ కలోనోవ్ అనే ఖైదీ రెండు హత్యలు, చోరీలు, అక్రమ ఆయుధాల సరఫరా, మందుగుండు సామగ్రిని కలిగి ఉండటం వంటి పలు క్రిమినల్ కేసుల్లో గత 22 ఏళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అతను విడుదల కావాల్సిన రోజు రానే వచ్చింది. అయితే ఆ ఖైదీ అదే రోజున తెల్లవారుజామున 4 గంటలకు జైలు నుండి అదృశ్యమవడం ఆశ్చర్యకరంగా మారింది. దీంతో జైలు అధికారులు సదరు ఖైదీ జైలు నుంచి పరారైనట్లు ప్రకటించారు. దీనిలో అతనిపై మరొక కేసు నమోదు చేశారు. రష్యాలోని ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ప్రాంతీయ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. ఖైదీ కమోల్జోన్ కలోనోవ్ రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని జిమా నగరంలో నివాసం ఉంటున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
పలు నేరాలలో అతను దోషిగా తేలడంతో కోర్టలు అతనికి జైలు శిక్ష విధించింది. అయితే అతను 1997లో జైలు నుంచి విడుదలయ్యాడు. ఆ తర్వాత 2001లో అతను డబుల్ మర్డర్ కేసులో దోషిగా తేలడంతో అతనికి కోర్టు 22 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. శిక్ష మొత్తం విధించిన కమోల్జోన్ కలోనోవ్ తాజాగా విడుదలయ్యే రోజు రాగానే అదే రోజు పరారై జైలు అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాడు. ఫెడరల్ పెనిటెన్షియరీ సర్వీస్ ఆఫ్ రష్యా ప్రకారం కమోల్జోన్ కలోనోవ్ జైలులో కఠినమైన శిక్షను అనుభవించినట్లు తెలుస్తోంది. అతను విడుదలైన అనంతరం అతనిని బలవంతంగా కూలీ పనులకు పంపనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. బహుశా ఈ పనులు చేయడం ఇష్టంలేకనే కమోల్జోన్ కలోనోవ్ పరారయ్యి ఉంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రష్యా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతను ఈసారి పట్టుబడితే కోర్టు కఠినమైన శిక్ష విధిస్తుందని అధికారులు తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




