Russia Ukraine War Highlights: ఉక్రెయిన్‌లో తిరుగుబాటు జరిగే ఛాన్స్.. రష్యా ఆర్మీకి అధ్యక్షుడు పుతిన్ కీలక సూచన

Sanjay Kasula

|

Updated on: Feb 25, 2022 | 10:23 PM

Russia Ukraine Conflict Live Updates in Telugu: ఉక్రెయిన్‌పై రష్యా(Russia - Ukraine) విరుచుకుపడుతోంది. అసలు కథ ముందుంది అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) చేసిన కామెంట్స్..

Russia Ukraine War Highlights: ఉక్రెయిన్‌లో తిరుగుబాటు జరిగే ఛాన్స్.. రష్యా ఆర్మీకి అధ్యక్షుడు పుతిన్ కీలక సూచన
Russia Ukraine

Russia Ukraine Conflict Highlights: ఉక్రెయిన్‌పై రష్యా(Russia – Ukraine) విరుచుకుపడుతోంది. అసలు కథ ముందుంది అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తొలిరోజు దాడుల పర్వం.. రెండవ రోజు కూడా కొనసాగిస్తోంది రష్యా. గురువారం అర్థరాత్రి మొదలైన యుద్ధం(War).. ఇంకా కొనసాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ శాంతించాలని రష్యాను కోరినా స్పందన కరువైంది. అగ్రరాజ్యాలు వార్నింగ్ ఇచ్చినా బేఖాతరు చేసింది రష్యా. యుద్ధం మొదలైన తరువాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన పుతిన్.. తగ్గేదే లేదు అంటూ స్పష్టమైన ప్రకటన చేశారు. అధ్యక్షుడి ప్రకటనతో మరింత ఊగిపోతోంది రష్యా సైనం. ఉక్రెయిన్‌పై ముప్పేటా దాడులకు తెగపడుతోంది. ఉక్రెయిన్ దేశంలోని అనేక నగరాల్లోని వీధుల్లో రష్యన్ బలగాలు కవాతు చేస్తున్నాయి. నిన్న అర్థరాత్రి నుంచి మిస్సైల్స్‌, జెట్‌ఫైటర్స్‌తో ఎటాక్ చేస్తూ వచ్చిన రష్యా.. ఇవాళ ఆ ప్రాంతాల్లోకి ఆర్మీని పంపింది. సమీ, ఖార్కివ్ సహా అనేక నగరాల్లో రష్యన్ ఆర్మీకి తారసపడిన దృశ్యాలను చూసి రష్యన్ ఆర్మీ జబ్బులు చరుసుకుంటున్నట్లే ఉంది. ఎక్కడ చూసినా కాలిబూడిదైన ఆర్మీ వెహికిల్స్, హైవేలపై దగ్దమైన కార్లు, మంటల్లో చిక్కుకున్న జనావాసాలు, ఎక్కడికక్కడ శవాలు కనిపిస్తున్నాయి.

రెండో రోజు దాడులకు సంబంధించిన క్షణ క్షణం అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Feb 2022 10:16 PM (IST)

    ఐఓసీ ఈ విజ్ఞప్తి చేసింది

    రష్యా లేదా బెలారస్‌లో జరిగే ఈవెంట్‌లను రద్దు చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) అన్ని సమాఖ్యలను కోరింది.

  • 25 Feb 2022 09:28 PM (IST)

    కీవ్‌ను చుట్టుముట్టిన పుతిన్ ‘ఆపరేషన్ Z’..రష్యన్ ట్యాంక్లపై వ్రాసిన కోడ్‌ ఇదే

    కీవ్ వైపు వెళుతున్న రష్యన్ ట్యాంకులు, సాయుధ వాహనాలు మరియు సైనిక కాన్వాయ్‌ను నిశితంగా పరిశీలిస్తే ఒక రహస్యం తెలుస్తుంది. ప్రతి వాహనంపై ఆంగ్ల అక్షరం ‘Z’ అని తెలుపు రంగులో రాసి ఉంటుంది. 

  • 25 Feb 2022 09:20 PM (IST)

    యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం..

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐరోపాలోని పుతిన్ ఆస్తులను జప్తు చేయాలని ఈయూ నిర్ణయించింది. ఉక్రెయిన్‌పై రష్యా చర్యను EU వ్యతిరేకిస్తోంది. పుతిన్ ఆస్తులను జప్తు చేసేందుకు ఒప్పందం కుదిరింది. 

  • 25 Feb 2022 08:18 PM (IST)

    దిగివచ్చిన రష్యా.. ఉక్రెయిన్‌తో చర్చలకు ఓకే చెప్పిన పుతిన్‌

    రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. చర్చలకు బెలారస్‌ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా బృందాన్ని పంపిస్తామని వెల్లడించింది. ఉక్రెయిన్‌ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు తాము సిద్ధమేనంటూ ఇప్పటికే రష్యా విదేశాంగశాఖ మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా పుతిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉక్రెయిన్‌తో చర్చలు జరపాలని ఆయన కూడా సూచించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

  • 25 Feb 2022 07:50 PM (IST)

    కాసేపట్లో కీలక నిర్ణయం.. ప్రారంభమైన నాటో సమావేశం..

    రష్యాపై చర్య తీసుకోవడానికి  NATO సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ఉక్రెయిన్ సాయంతో కీలక నిర్ణయానికి రావచ్చని సమాచారం.

  • 25 Feb 2022 07:32 PM (IST)

    ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి

    ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబాతో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దౌత్యం, సంభాషణలకు భారతదేశం మద్దతు ఇస్తుందని అన్నారు. విద్యార్థులతోపాటు భారతీయుల పరిస్థితిపై చర్చించారు.  

  • 25 Feb 2022 06:35 PM (IST)

    కీవ్ శివారు ప్రాంతమైన కోషిట్సా స్ట్రీట్‌లో దెబ్బతిన్న ప్రాంతాలు ఇవే..

    ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివారు ప్రాంతమైన కోషిట్సా స్ట్రీట్‌లో దెబ్బతిన్న నివాస ప్రాంతాల చిత్రాలను AFP ట్విట్టర్‌లో షేర్ చేసింది.

  • 25 Feb 2022 06:33 PM (IST)

    భారతీయ పౌరులను తరలించేందుకు ప్రభుత్వం 4 స్థలాలను గుర్తించింది

    ఉక్రెయిన్‌లో ఉంటున్న భారత పౌరులను తీసుకొచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే వారిని ఉక్రెయిన్ సరిహద్దులు దాటించాలనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా హంగేరీ, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ , రొమేనియాలో నాలుగు ప్రదేశాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 1000 మంది ఉక్రెయిన్‌లో ఉన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడినట్లుగా తెలిపారు.

  • 25 Feb 2022 06:29 PM (IST)

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ రోజు మరోసారి నాటో సమావేశం..

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత నాటో ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు నాటో దేశాల ముఖ్యమైన సమావేశం జరగనుంది. ఇందులో రష్యాకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయవచ్చని సమాచారం .

  • 25 Feb 2022 06:27 PM (IST)

    Russia Ukraine War: ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దుకు చేరుకున్న భారత విద్యార్థుల బృందం..

    ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దుకు భారత విద్యార్థుల బృందం చేరుకుంది. డేన్‌లో హాలిత్‌స్కీ మెడికల్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులను ప్రత్యేక బస్సులో సరిహద్దుకు తరలించారు. ఇందులో దాదాపు 40 మంది భారతీయ వైద్య విద్యార్థుల ఉన్నట్లుగా తెలుస్తోంది. బోర్డర్ పాయింట్ నుంచి 8 కి.మీ దూరంలో కాలేజీ బస్సులో వారిని దింపారు.

  • 25 Feb 2022 06:23 PM (IST)

    ఉక్రెయిన్ చర్చల ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది

    ప్రపంచ దేశాల ప్రతిపాదనలను రష్యా తోసిపుచ్చింది. ఉక్రెయిన్ చర్చల ప్రతిపాదనను రష్యా తిరస్కరించింది.

  • 25 Feb 2022 06:16 PM (IST)

    ఢిల్లీలో రష్యన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన..

    ఢిల్లీలో రష్యన్ ఎంబసీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎంబసీ ముందు ఆందోళనకు దిగారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఉక్రెయిన్‌లో తమ పిల్లల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

  • 25 Feb 2022 06:10 PM (IST)

    Russia Ukraine War: రొమేనియాను టార్గెట్ చేసిన రష్యా

    రష్యా ఇప్పుడు రొమేనియాను టార్గెట్ చేసింది. నల్ల సముద్రంలో ఈ నాటో సభ్య దేశానికి చెందిన ఓడపై దాడి చేశాడు.

  • 25 Feb 2022 05:02 PM (IST)

    ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తాం.. యూరప్ దేశాలకు రష్యా వార్నింగ్..

    అమెరికా, యూరోప్ దేశాల ఆంక్షలపై రష్యా భగ్గుమంది. ఇష్టానుసారంగా ఆంక్షలు పెడితే ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్‌ను కూల్చేస్తామని హెచ్చరించింది. స్పేస్ స్టేషన్‌ను యూరోప్‌ దేశాలు, అమెరికాపై కూల్చేస్తే మీకు ఓకేనా అని ప్రశ్నించారు రష్యా స్పేష్ ఏజెన్సీ చీఫ్‌ రొగొజిన్. ఆంక్షలతో కట్టడి చేయాలనుకుంటే ఫలితం ఇంకోలా ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చింది.

  • 25 Feb 2022 04:57 PM (IST)

    Russia Ukraine War: కివీ ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకున్న కృష్ణా జిల్లా విద్యార్ధి

    ఎంబీబీఎస్ విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లిన కృష్ణా జిల్లా విద్యార్ధి కివీలో చిక్కుకుపోయాడు. మైల‌వ‌రం కు చెందిన మాధు హేమంత్ కుమార్ ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. యుద్దం ప్రారంభానికి ముందే ఎయిర్ పోర్ట్‌కు చేరుకోవాల‌నే ఆత్రంతో తోటి విద్యార్ధుల‌తో క‌లిసి బ‌స్సులో బ‌య‌లుదేరాడు. అప్ప‌టికే కివీ ఎయిర్ పోర్ట్ పై దాడి జ‌ర‌గ‌డం, విమానాలు ర‌ద్దు చేయ‌డంతో అక్క‌డే ఇరుక్కుపోయాడు. నిన్నంతా క‌నీసం తిండి.. నీరు లేక త‌మ బిడ్డ తీవ్ర ఇబ్బందులు ప‌డ్డాడంటున్నారు పేరెంట్స్. ప్రస్తుతం ఓ హోట‌ల్ బంక‌ర్ లో త‌ల‌దాచుకున్న త‌న బిడ్డ‌ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు త‌ల్లిదండ్రులు. త‌మ బిడ్డ ప‌రిస్థితిపై తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు.

  • 25 Feb 2022 04:20 PM (IST)

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న హైదరాబాద్ విద్యార్థి..

    ఉక్రెయిన్‌లో ఉన్నత విద్యకోసం పిల్లలను పంపించిన కుటుంబాలు కన్నీటిపర్యంతమవుతున్నాయి. ఎల్బీనగర్ పవన్ పురికి చెందిన అశోక్ కుమార్ కుటుంబం ఆందోళనతో కన్నీరు పెట్టుకొంటోంది. ఉక్రెయిన్ లో జఫరోజియా లో ఉన్న వైతరుణి గౌడ్ తో తల్లిదండ్రులు అశోక్ కుమార్ గౌడ్ , స్వరూప రాణి లను టీవీ9 మాట్లాడించింది. ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయం వెంటాడుతోందని అంటోంది వైతరుణి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ బిడ్డను ఇక్కడకు క్షేమంగా తీసుకురావాలని కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు తల్లిదండ్రులు.

  • 25 Feb 2022 04:14 PM (IST)

    Russia Ukraine War: ఆరుగురు ఉన్నతాధికారులతో ఏపీ ప్రభుత్వం కంట్రోల్ రూమ్

    ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను తరలించేందుకు ఆరుగురు ఉన్నతాధికారులతో ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు ఏపీ సీఎస్ సమీర్ శర్మ. పోలాండ్, ఉక్రెయిన్ సరిహద్దు, అలాగే మరో బోర్డర్ కు ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను తరలించేందుకు విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిందని చెప్పారు సీఎస్. ముందు ఉక్రెయిన్ సరిహద్దు దాటించి విమానాల ద్వారా ఢిల్లీకి తీసుకొస్తారన్నారు సమీర్ శర్మ. విద్యార్థుల తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు సీఎస్ .

  • 25 Feb 2022 04:11 PM (IST)

    రొమేనియా, హంగేరి మీదుగా తీసుకువస్తున్నాం.. భారత రాయబార కార్యాలయం

    ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఒక సలహా జారీ చేసింది. భారతీయులు సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం సూచించింది. ఉక్రెయిన్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం నిరంతరం సహాయం చేస్తోంది. రొమేనియా, హంగేరి మీదుగా భారతీయులను తిరిగి భారత్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లుగా వెల్లడించింది.

  • 25 Feb 2022 03:36 PM (IST)

    రష్యా దాడిని ఖండించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ

    ఉక్రెయిన్‌పై రష్యా దాడిని అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ విమర్శించారు. ఇది యూరప్‌తోపాటు మొత్తం ప్రపంచ భద్రతకు ముప్పు అని ఆయన తన ట్వీట్‌లో అభివర్ణించారు.

  • 25 Feb 2022 03:30 PM (IST)

    Russia Ukraine War: భారతీయులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలు..

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విమానాలను పంపిస్తోంది. విమాన ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తోంది.

  • 25 Feb 2022 03:28 PM (IST)

    భారత్ జెండాను పెట్టుకొని.. హంగేరీ బోర్డర్ చెక్ పోస్టుకు చేరుకోండి..- భారత్ కీలక ప్రకటన

    ఉక్రెయిన్‌లో భారత రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు తమ వాహనాలపై భారత్ జెండాను పెట్టుకొని.. హంగేరీ బోర్డర్ చెక్ పోస్టుకు చేరుకోవాలని సూచించింది. అక్కడి నుంచి ప్రస్తుతం వెయ్యి మంది విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించింది.

  • 25 Feb 2022 03:12 PM (IST)

    Russia Ukraine War: ఉక్రెయిన్ సంక్షోభంపై తాలిబాన్ కీలక ప్రకటన..

    ఉక్రెయిన్ సంక్షోభంపై తాలిబాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న ఎన్నికల పరిస్థితుల దృష్ట్యా ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని.. హింసను తీవ్రతరం చేసే స్థానాలకు అన్ని పక్షాలు దూరంగా ఉండాలని ట్వీట్‌ చేస్తూ.. ‘చర్చల’కు ప్రాధాన్యతనివ్వాలని సూచించింది.

  • 25 Feb 2022 03:08 PM (IST)

    Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని అనేక నగరాల్లో రష్యా ఆర్మీ కవాతు

    ఉక్రెయిన్ దేశంలోని అనేక నగరాల్లోని వీధుల్లో రష్యన్ బలగాలు కవాతు చేస్తున్నాయి. నిన్న అర్థరాత్రి నుంచి మిస్సైల్స్‌, జెట్‌ఫైటర్స్‌తో ఎటాక్ చేస్తూ వచ్చిన రష్యా.. ఇవాళ ఆ ప్రాంతాల్లోకి ఆర్మీని పంపింది. సమీ, ఖార్కివ్ సహా అనేక నగరాల్లో రష్యన్ ఆర్మీకి తారసపడిన దృశ్యాలను చూసి రష్యన్ ఆర్మీ జబ్బులు చరుసుకుంటున్నట్లే ఉంది. ఎక్కడ చూసినా కాలిబూడిదైన ఆర్మీ వెహికిల్స్, హైవేలపై దగ్దమైన కార్లు, మంటల్లో చిక్కుకున్న జనావాసాలు, ఎక్కడికక్కడ శవాలు కనిపిస్తున్నాయి.

  • 25 Feb 2022 03:04 PM (IST)

    తన గగనతలం మీదుగా బ్రిటిష్ విమానాలకు అనుమతి లేదు.. యూకేపై రష్యా ఆంక్షలు..

    బ్రిటన్‌కు వార్నింగ్ ఇచ్చింది రష్యా. తమ గగనతలం మీదుగా బ్రిటిష్ విమానాలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యా తన గగనతలాన్ని మూసివేసినట్లుగా వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఉత్తర జిల్లాలో పోరాటాలు కొనసాగుతున్నాయి. రాజధాని కీవ్ వెలుపల తాము రష్యా బలగాలతో పోరాడుతున్నామని ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. 

  • 25 Feb 2022 02:59 PM (IST)

    రష్యాతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నాము..- ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు

    రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారు మైఖైలో పొడోలియాక్ వెల్లడించారు.

  • 25 Feb 2022 02:57 PM (IST)

    NATO దళాలను పంపే ఆలోచన లేదు – పోలిష్ ఇంటెలిజెన్స్

    NATO దళాలను ఉక్రెయిన్‌కు పంపే ఆలోచన లేదని పోలిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అధిపతి స్పష్టం చేశారు.

  • 25 Feb 2022 02:52 PM (IST)

    Russia Ukraine War: మాకు సాయం చేయండి.. భారతీయ రాజకీయ నాయకులందరినీ వేడుకుంటున్నాను..

    భారత సహాయాన్ని ఉక్రెయిన్ ఎంపీ సోఫియా ఫెడినా అర్థించారు. “ఉక్రెయిన్‌కు ఆయుధాలు మాత్రమే కాదు, మానసిక సహాయం కూడా అవసరం.. దురాక్రమణదారుని (మాస్కో) శిక్షించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. శాంతిని ప్రేమించే ఉక్రెయిన్‌ ప్రజలను చంపేస్తున్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీ సోఫియా ఆవేదన వ్యక్తం చేశారు. ‘సార్వభౌమాధికారం కలిగిన దేశ మానవ హక్కులను కాపాడాలని భారతీయ రాజకీయ నాయకులందరినీ వేడుకుంటున్నాను’ అని అన్నారు. ఉక్రెయిన్‌లోని ఓ బాంబ్ షెల్టర్ లోపల నుంచి ఆమె మాట్లాడారు.

  • 25 Feb 2022 01:24 PM (IST)

    దూకుడు పెంచిన ఉక్రెయిన్ సైన్యం.. రష్యా ఏయిర్‌ఫీల్డ్‌పై బాంబుల వర్షం..

    రష్యా దాడులను ఉక్రెయిన్ ప్రతిఘటిస్తోంది. ఉక్రెయిన్ బలగాలు రష్యా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో రష్యాపైనా విరుచుకుపడుతున్నారు. రష్యాలోని రోస్తోవ్ ప్రాంతంలో గల ఎయిర్‌ఫీల్డ్‌పై ఉక్రెయిన్ బలగాలు బాంబుల వర్షం కురిపించింది. దీనిపై రష్యా నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

  • 25 Feb 2022 01:22 PM (IST)

    రష్యన్ ఆర్మీ వాహనాలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బలగాలు..

    ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కొనసాగుతోంది. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ సైతం తగ్గేది లేదంటూ ధీటైన సమాధానం చెబుతోంది. తాజాగా రష్యన్ ఆర్మీ వాహనాలను ఉక్రెయిన్ బలగాలు ధ్వంసం చేశాయి.

  • 25 Feb 2022 01:19 PM (IST)

    ఉక్రెయిన్‌లో భారత ఎంబసీ కీలక ప్రకటన..

    రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు తాము ప్రయాణించే వాహనాలపై భారతీయ జెండా పెట్టుకోవాలని సూచించింది. హంగేరి బోర్డర్ చెక్‌పోస్టుకు చేరుకోవాలని సూచించింది.

  • 25 Feb 2022 12:47 PM (IST)

    ఉక్రెయిన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి సైనిక వాహనాలను స్వాధీనం చేసుకున్న రష్యా..

    రష్యా-ఉక్రెయిన్ వార్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చిన రష్యన్ ఆర్మీ.. ఆ దేశానికి చెందిన సైనిక వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

  • 25 Feb 2022 12:44 PM (IST)

    ఉక్రెయిన్‌లోని ఎల్వివ్ నగరంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటిస్తున్నారు.

  • 25 Feb 2022 12:42 PM (IST)

    ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి..

    ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన జయశంకర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. విద్యార్థులను దేశానికి రప్పించడానికి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

  • 25 Feb 2022 12:29 PM (IST)

    ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల ఇబ్బందులు…

    రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. సరూర్ నగర్‌కు చెందిన విద్యార్థులు మెడిసిన్ కోసం ఉక్రెయిన్ వెళ్లారు. తేజస్వి, దివ్య జేప్రజీయా మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నారు. అయితే, అక్కడ యుద్ధవాతావరణం ఉండటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మరింత భయంకరంగా మారిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

  • 25 Feb 2022 11:33 AM (IST)

    అపార్ట్‌మెంట్‌పై కుప్పకూలిన యుద్ధ విమానం.. భారీగా ప్రాణ నష్టం..

    విమాన శిథిలాలు పడి కీవ్‌లోని ధ్వంసమైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్. భారీగానే ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చంటున్న సోర్సెస్.

  • 25 Feb 2022 11:27 AM (IST)

    RussiaUkraineConflict: ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితి.. ఎటు చూసినా శిథిలాలే..

    రష్యా దుశ్చర్య కారణంగా ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. రష్యా దాడుల కారణంగా అక్కడ పరిస్థితులు అత్యంత భీతావహంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని కీవ్, ఖార్కీవ్, మైదాన్ నెజాలెజ్నోస్టిలో ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో బాంబుల మోత మోగుతోంది. రష్యా దాడులతో అనేక భవనాలు నేలకూలాయి.

  • 25 Feb 2022 11:18 AM (IST)

    ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. కీలక ప్రకటన చేసిన డెన్మార్క్..

    నాటో దళాలను బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని డెన్మార్క్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలన్నారు. నాటో కూటమికి సహాయం చేయడానికి సిద్ధం అంటూ డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడెరిక్సెన్ ప్రకటించారు. రష్యా చర్యలను.. ఐరోపాలో శాంతి, స్థిరత్వంపై దాడిగా అభివర్ణించారాయన.

  • 25 Feb 2022 11:10 AM (IST)

    రష్యాపై పోరుకు ఆయుధం చేతపట్టిన మాజీ బాక్సింగ్ ఛాంపియన్లు..

    మాజీ హెవీమెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ విటాలి క్లిట్ష్కో, హాల్ ఆఫ్ ఫేమర్ వ్లాదిమిర్ క్లిట్ష్కోతో కలిసి తమ దేశం ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రష్యాపై పోరులో తాము సైతం పాల్గొంటామని ప్రకటించారు. తమకు ఆయుధాలిస్తే రష్యాపై పోరాడుతామన్నారు. 2014 నుంచి ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కు మేయర్‌గా కొనసాగుతున్న విటాలి క్లిట్ష్‌కో పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

    Russia Ukraine War Live: यूक्रेन के 13 सैनिकों का सरेंडर से इनकार, रूसी युद्धपोत ने उन्हें मार गिराया

  • 25 Feb 2022 10:45 AM (IST)

    లక్ష మందికిపైగా నిరాశ్రయులైన ఉక్రేనియన్లు.. ప్రకటించిన యూఎన్‌హెచ్ఆర్‌సీ..

    రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా దాడుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఈ మేరకు యూఎన్‌హెచ్ఆర్‌సీ ప్రకటించింది.

  • 25 Feb 2022 10:15 AM (IST)

    లొంగిపోవడానికి నిరాకరించిన సైనికులు.. నిర్ధాక్షిణ్యంగా చంపేసిన రష్యా..

    రష్యా సైన్యాలు పెట్రేగిపోతున్నాయి. ఉక్రెయిన్‌పై ఉక్కుపాదం మోపుతోంది. బాంబుల వర్షం కురిపిస్తోంది. క్షిపణులు, ఫైటర్ జెట్స్, రాకెట్ లాంచర్స్‌తో ముప్పేట దాడి చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్ ద్వీపంలో 13 మంది సైనికులను పొట్టన పెట్టుకుంది రష్యా. లొంగిపోవడానికి నిరాకరించిన 13 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా యుద్ధ నౌకలో చంపేశారు. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ బయటకొచ్చాయి.

  • 25 Feb 2022 10:06 AM (IST)

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిలిపివేయాలి.. యూఎన్ కీలక ప్రకటన..

    ఉక్రెయిన్‌లో రష్యా మిలటరీ ఆపరేషన్‌ను నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితి కోరింది. వెంటనే బలగాలను రష్యాకు వెనక్కి రప్పించాలంది. రష్యా దాడులు ముమ్మాటికి తప్పుడు చర్యగా పేర్కొంది. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నామని, ఉక్రెయిన్‌కు యునైటెడ్ నేషన్స్ ఆర్థిక సాయం అందిస్తుందని ప్రకటించింది. ఉక్రెయిన్‌కి 20 మిలియన్ల యూఎస్ డార్లు ఆర్థిక సాయం ప్రకటించింది యూఎన్.

  • 25 Feb 2022 10:03 AM (IST)

    రష్యాపై యుద్ధం ప్రకటించిన హ్యాకర్ల బృందం.. శాంపిల్‌గా ఏం హ్యాక్ చేశారంటే..

    గుర్తు తెలియని హ్యాకర్ల బృందం రష్యా ప్రభుత్వంపై ‘సైబర్ వార్’ ప్రకటించింది. రష్యా టుడే టీవీ ఛానెల్ వెబ్‌సైట్‌పై దాడి చేసిన ఈ హ్యాకర్లు.. ఇదే అంశాన్ని ధృవీకరించారు. వెబ్‌సైట్‌పై దాడికి తామే కారణమంటూ ప్రకటించారు. టీవీ ఛానెల్, వెబ్‌సైట్‌పై సైబర్ అటాక్స్ జరుగుతున్నాయని ఆర్‌టీ టీవీ ప్రకటించింది. ఇప్పటికీ ఆ ఛానెల్, వెబ్‌సైట్‌ను హ్యాకర్ల చెర నుంచి విడిపించలేకపోయారు.

  • 25 Feb 2022 09:14 AM (IST)

    ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. యూఎన్ భద్రతా మండలి తీర్మానం..

    ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ ముసాయిదాలో కీలక అంశాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

  • 25 Feb 2022 09:09 AM (IST)

    చెర్నోబిల్ పవర్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా..

    ఉక్రెయిన్‌ ఆక్రమణే లక్ష్యంగా యుద్ధం ప్రకటించిన రష్యా.. కీలక విజయం సాధించింది. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ సలహాదారు మైఖైలో పోడోల్యాక్ ప్రకటించారు.

  • 25 Feb 2022 09:03 AM (IST)

    క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా.. ఉక్రెయిన్‌ అతలాకుతలం…

    రష్యా తన జోరును మరింత పెంచింది. క్షిపణులు, రాకెట్ లాంచర్లతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో జాపోర్జియాలో రాకెట్ లాంచర్లు, క్షిపణులతో దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. భారీ ప్రాణ నష్టం జరిగిందని ప్రకటించింది.

  • 25 Feb 2022 09:01 AM (IST)

    రష్యా యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఉక్రెయిన్..

    రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతోంది. తాజాగా ఉక్రెయిన్ బలగాలు.. రష్యాకు చెందిన యుద్ధ విమానాన్ని కూల్చివేశాయి. దానికి సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్ అయ్యాయి.

  • 25 Feb 2022 08:55 AM (IST)

    రష్యా లక్ష్యం ఇంకా నెరవేరలేదు.. ప్రకటించిన బ్రిటన్..

    ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా జరుపుతున్న దాడులను ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే రష్యా తన లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని బ్రిటన్ ప్రకటించింది. ఉక్రెయిన్ దళాలు అద్భుతంగా ప్రతిస్పందిస్తున్నాయని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

  • 25 Feb 2022 08:53 AM (IST)

    ఉక్రెయిన్‌పై దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యన్లు..

    ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో వేలాది మంది ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. దాంతో అలర్ట్ అయిన రష్యా పోలీసులు.. వందలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వెయ్యి మందికి పైగా ప్రజలు గుమిగూడారు. రష్యా దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

  • 25 Feb 2022 08:47 AM (IST)

    రష్యా దాడుల్లో 137 మంది ప్రాణాలు కోల్పోయిన ఉక్రెయిన్లు..

    రష్యా జరుపుతున్న భీకర దాడుల్లో 137 మంది ఉక్రెయిన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెంస్కీ ప్రకటించారు.

  • 25 Feb 2022 08:45 AM (IST)

    ఉక్రెయిన్ ఒంటరైపోయింది.. ఆదేశాధ్యక్షుడి ఆవేదన..

    రష్యాతో జరిగే పోరాటంలో ఉక్రెయిన్ ఒంటరి అయిపోయిందని ఆదేశాధ్యక్షుడి జెలెంస్కీ ఆవేదన వ్యక్తం చేశారు.

  • 25 Feb 2022 08:43 AM (IST)

    ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారీ పేలుళ్లు..

    ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. దాంతో కీవ్ దద్దరిల్లిపోతోంది. భారీ పేలుళ్లలో కీవ్ అతలాకుతలం అవుతోంది. కీవ్‌ను ఇవాళ స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న రష్యా.. దాడులను మరింత పెంచాలాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

  • 25 Feb 2022 08:37 AM (IST)

    రష్యాకు చెందిన 7 ఫైటర్ జెట్స్, 30 యుద్ధ ట్యాంకులు ధ్వంస చేశామని ప్రకటించిన ఉక్రెయిన్..

    రష్యాకు చెందిన 7 ఫైటర్ జెట్స్, 30 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని ఉక్రెయిన్ డిఫెన్స్ డిప్యూటీ మినిస్టర్ హన్నా మాల్యార్ ప్రకటించారు. ఈ మేరకు ఉక్రెయిన్ రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

  • 25 Feb 2022 08:30 AM (IST)

    జర్మనీకి భారీ సంఖ్యలో సైన్యాన్ని పంపిన అమెరికా..

    రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా డేగ కన్ను వేసింది. పరిస్థితులకు అనుకూలంగా ముందడుగు వేస్తోంది. ఏడువేల మంది సైనికులను జర్మనికి పంపించింది అమెరికా.

  • 25 Feb 2022 08:27 AM (IST)

    వైట్ హౌస్ వద్ద ఉక్రెయిన్ ప్రజల భారీ నిరసన ప్రదర్శనలు..

    ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడాన్ని యావత్ ప్రపంచం వ్యతిరేకిస్తోంది. అమెరికాలోని ఉక్రెయిన్ దేశస్తులు.. వైట్ హౌస్ వద్ద భారీ నిరసన ప్రదర్శనలు చేశారు.

  • 25 Feb 2022 08:25 AM (IST)

    కర్ణాటక నోడల్ అధికారిని నియమించింది..

    ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన కర్ణాటక ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా తరలించడానికి కర్ణాటక ప్రభుత్వం నోడల్ అధికారిని నియమించింది. నోడల్ కార్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖ, కీవ్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుంటుంది.

Published On - Feb 25,2022 7:48 AM

Follow us
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..