Russia Ukraine War: యుద్దానికి వారే కారణం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన కామెంట్స్..
ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటనతో రష్యా గరం గరం అవుతోంది. పాశ్చాత్యదేశాలు శాంతిని కోరుకోవడం లేదని పుతిన్ ఫైర్ అవడం.. నీ గెలుపు అసాధ్యమని బైడెన్ కౌంటర్ ఇవ్వడం హీటెక్కించింది. ఉక్రెయిన్ యుద్దానికి పాశ్చాత్య దేశాలే..
ఉక్రెయిన్‌లో బైడెన్ పర్యటనతో రష్యా గరం గరం అవుతోంది. పాశ్చాత్యదేశాలు శాంతిని కోరుకోవడం లేదని పుతిన్ ఫైర్ అవడం.. నీ గెలుపు అసాధ్యమని బైడెన్ కౌంటర్ ఇవ్వడం హీటెక్కించింది. ఉక్రెయిన్ యుద్దానికి పాశ్చాత్య దేశాలే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్. సమస్యను పరిష్కరించడానికి అమెరికా మిత్రదేశాలకు చిత్తశుద్ది లేదని ,అందుకే ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు ఇస్తున్నాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌లో పర్యటించడం.. 500 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించడాన్ని పుతిన్ తప్పుపట్టారు.
బైడెన్ ఉక్రెయిన్ పర్యటన తరువాత రష్యా మరింత దూకుడు పెంచింది. ఉక్రెయిన్‌ను రష్యా స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ కాదన్న బైడెన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ద ప్రభావం రష్యా ఆర్ధికవ్యవస్థపై ఏమాత్రం లేదన్నారు. డాలర్‌ను బలహీనపర్చడమే తమ లక్ష్యమన్నారు పుతిన్. దశలవారిగా యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తమన్నారు. మరిన్ని అధునాతన ఆయుధాలను రష్యా ఉత్పత్తి చేస్తుందని ప్రకటించారు పుతిన్.
ఇక ఉక్రెయిన్ నుంచి పోలాండ్ వెళ్లిన బైడెన్.. అక్కడ ఇచ్చిన స్పీచ్‌లో రష్యాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్‌ని జయించడం రష్యా వల్ల ఎప్పటికీ కాదన్నారు బైడెన్. ఏడాది క్రితం కీవ్ పతనం తప్పదని అంతా అనుకున్నారని.. ఇప్పుడు కీవ్‌ని చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. కీవ్ ఎంతో స్వేచ్ఛగా నిలబడిందన్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ‘ఏడాది క్రితం కీవ్ కుప్పకూలుతుందని అంతా అనుకున్నారు. ఇప్పుడే కీవ్ నుంచి వస్తున్నా.. కీవ్ గట్టిగా నిలబడింది. కీవ్ గర్వంతో నిలబడింది. తలెత్తుకుని స్వేచ్ఛగా నిలబడింది కీవ్. ఉక్రెయిన్‌కి మద్ధతు తెలపడంలో వెనకడుగు వేయం, నాటో విడిపోవడం జరగదు, మేం అలసిపోలేదు. పక్క దేశాన్ని ఆక్రమించుకోవాలని అధ్యక్షుడు పుతిన్ తహతహలాడుతున్నారు. కాని దేశం పట్ల ఉక్రెయిన్ ప్రజలకు ఉన్న ప్రేమే గెలుస్తుంది’ అని బైడెన్ వ్యాఖ్యానించారు.
భారత్‌తో సంబంధాలు..
భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకుంటామని అన్నారు పుతిన్. ఉక్రెయిన్‌కు పశ్చిమదేశాలు అణుబాంబును ఇస్తే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి రష్యా ప్రజలు సిద్దంగా ఉండాలని సూచించారు. పుతిన్ హెచ్చరిస్తున్న సమయంలో ఉక్రెయిన్ సరిహద్దు లోని పోలండ్ పర్యటనలో ఉన్నారు బైడెన్.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..